హైదరాబాద్ : 'ఇప్పుడు నేను అక్కినేని సమంతను.. నాపై పెద్ద బాధ్యత ఉంది' అని ప్రముఖ నటి అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన సమంత అన్నారు. గురువారం రాజుగారి గది 2 చిత్రానికి సంబంధించి నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడారు. భవిష్యత్‌లో అన్నపూర్ణ స్టూడియో తరుపున నిర్మాణ రంగంలోకి అడుగుపెడతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.
'అక్కినేని వారింట్లో లింగబేధం ఉండదు. అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా చూస్తారు. అమలగారు, సుప్రియగారు చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్.. అదే నాకు పెద్ద బ్లెస్సింగ్స్ అనిపిస్తుంది. నా నుంచి ఆ కుటుంబం ఏం ఆశించడం లేదు, నన్ను ఏమి అడగడం లేదు. కానీ, నేనిప్పుడు అక్కినేని సమంతని. నాపై నేనే పెద్ద బాధ్యత పెట్టుకున్నాను' అంటూ అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టడం ఎంత సంతోషంగా ఉందో తెలిపారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటానని, కానీ, నా క్యారెక్టర్ ఎందుకు ఉంటుందో ఇప్పటికీ తానే చెప్పలేనని అన్నారు. ఒక సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా వన్ వీక్‌లో మర్చిపోతారని, అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని అన్నారు. అయితే, ఆరు నెలలు ఒక పెద్ద పాజిటివ్ టీంతో కలిసి పనిచేశానని, అన్నారు. ఇలాంటి టీమ్‌తో కలిసి రాజుగారి గది 2 చిత్రంలో పనిచేయడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో హీరో నాగార్జున, చిత్ర దర్శకుడు ఓంకార్, ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
నాపై నేనే పెద్ద బాధ్యత పెట్టుకున్నా : సమంత
Published Thu, Oct 12 2017 6:27 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment