కింగ్తో మరోసారి..!
సెకండ్ ఇన్నింగ్స్లో జెట్ స్పీడుతో దూసుకుపోతోంది చెన్నై చంద్రం త్రిష. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవటంతో తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటి ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు గ్లామర్ రోల్స్ లోనూ అలరిస్తోంది. ఎక్కువగా కోలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న త్రిష, త్వరలో ఓ సీనియర్ స్టార్ హీరో సరసన తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది.
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ ముందుండే సీనియర్ స్టార్ నాగార్జున హీరోగా తెరకెక్కనున్న సినిమా రాజుగారి గది 2. ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్కు జోడిగా త్రిష అలరించనుంది. గతంలో కింగ్ సినిమాలో కలిసి నటించిన ఈ జోడి మరోసారి తెర ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తుండగా.. సమంత కీలక పాత్రలో కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే హీరోయిన్ల ఎంపికపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.