Rajya sabha bill
-
ప్రభుత్వం ఎంపిక చేసిన దృశ్యాలపై ఎంపీ బినోయ్ విశ్వమ్ లేఖ
న్యూఢిల్లీ: ఆగస్టు 11న రాజస్యభలో జరిగిన రభకు సంబంధించి ప్రభుత్వం ఎంపిక చేసిన దృశ్యాలను మాత్రమే లీక్ చేసి ప్రతిపక్షాలపై తప్పుడు అభిప్రాయాలను కలిగించవద్దంటూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని అన్నారు. సభలోని ప్రతిపక్ష సభ్యులపై గుర్తు తెలియని సైనికులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఆగస్టు 11కు సంబంధించి పూర్తి సీసీటీవీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేకమైన జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) అమెండమెంట్ బిల్, 2021ని సెలక్ట్ కమిటీ పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయన్నారు. అయితే అప్పుడే దాదాపు 40 మంది గుర్తు తెలియని సైనికులు సభలో ప్రవేశించారన్నారు. మహిళా ఎంపీలు సహా ప్రతిపక్ష సభ్యులపై భౌతిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. అయితే బయటకు వచ్చిన వీడియోలలో మాత్రం సభ్యులు మార్షల్స్‌పై దాడి చేస్తున్నట్లు చూపించారని అన్నారు. తనపై కూడా 4–5 మంది బయటి వ్యక్తులు వచ్చి దాడిచేశారని పేర్కొన్నారు. సభలో జరిగిన అసలు విషయాన్ని దాచి ఎంపిక చేసిన వీడియోను విడుదల చేసిన కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చదవండి : సోషల్ మీడియాకు ఊరట, చట్టంలోని కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు స్టే -
రఫేల్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రఫేల్ రక్షణ ఒప్పందంతో ముడిపడిన అన్ని అంశాలతో వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంలోని అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు నిరాకరిస్తోందని విమర్శించారు. రఫేల్ ఒప్పందంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడంతో అనేక తప్పులు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. మంగళవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్.బాలమల్లేష్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విపక్షాల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక పార్లమెంట్ సమయం వృథా అవుతోందంటూ రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ దబాయింపు కేకలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ పౌరసత్వ చట్టానికి కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలను మొత్తంగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ఒక మతానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆ వర్గానికి తీరని అన్యాయం జరిగే పరిస్థితులున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా, రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఎన్డీయే ప్రభుత్వ మొండి తనానికి, మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. దీనికి వ్యతిరేకంగా భారతరత్న అవార్డు తీసుకునేందుకు భూపేన్ హజారికా కుమారుడు నిరాకరించాడన్నా రు. ఇంతకు ముందే అస్సాం, మణిపూర్ ప్రాంతా లకు చెందిన మేధావులు తమకిచ్చిన పద్మశ్రీ అవార్డు లను తిరస్కరించారని గుర్తుచేశారు. ఇద్దరే అన్ని ఫైళ్లు చూస్తారా: చాడ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్టు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. కేబినెట్లో 18 మంది మంత్రులు చూడాల్సిన ఫైళ్లను సీఎం, హోంమంత్రి ఇద్దరే ఎలా పరిశీలిస్తారని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తున్నా పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. -
వేధించే ఎన్ఆర్ఐ మొగుళ్లపై కొరడా
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు(నాన్ రెసిడెంట్ ఇండియన్–ఎన్ఆర్ఐ) ఇకపై తమ పెళ్లిని తప్పకుండా రిజిస్టర్ చేయాల్సిందే. రిజిస్ట్రేషన్ చేయకపోతే వారి పాస్‌పోర్టును జప్తుచేసే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో రద్దుచేసే వీలుంది. భారతీయ పౌరురాలిని లేదా తోటి ఎన్ఆర్ఐను పెళ్లాడే ప్రతీ ఎన్ఆర్ఐ పురుషుడు 30రోజుల్లోపు మ్యారేజ్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్రం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ అబ్బాయిలు చాలామంది అమ్మాయిలనుచేసిన ఘటనల నేపథ్యంలో ఈ బిల్లు తెచ్చారు. ఎన్ఆర్ఐల వివాహ రిజిస్ట్రేషన్ ముసాయిదా బిల్లులోని కొన్ని ప్రతిపాదనలు. ►ఇకపై మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయకుంటే అది చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. ►ఆ ఎన్ఆర్ఐకి చెందిన స్థిర, చరాస్థుల జప్తుకు సైతం కోర్టులు ఆదేశించవచ్చు. ►సంబంధిత కేసుల విషయంలో విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక్ వెబ్సైట్ ద్వారా నిందితులకు సమన్లు, వారెంట్లు జారీచేయనున్నారు. ►వివాహం భారత్‌లో జరిగితే ఇక్కడి చట్టాలకనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయాలి. పెళ్లి విదేశంలో జరిగితే అక్కడి సంబంధిత అధికా రుల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయించాలి. ►ఎన్ఆర్ఐల పాస్‌పోర్టుల జప్తు, రద్దుకు అనువుగా పాస్‌పోర్ట్ చట్టాన్నీ సవరించనుంది. ►పెళ్లి చేసుకున్నాక చాలా మంది ఎన్ఆర్ఐ యువకులు తమ భార్యలను విదేశాల్లో వదిలేసి, భార్యలను శారీరకంగా, మానసికంగా క్షోభపెడుతున్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ►కోర్టుల ఆదేశాల మేరకు నిందితులైన ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్టుతోపాటు, ట్రావెల్ డాక్యుమెంట్లను జప్తుచేయవచ్చు. ►2015–17 మధ్యకాలంలో విదేశాల్లో 3,328 మంది మహిళలను వారి భర్తలు నిర్దాక్షిణ్యంగా వదిలేసి చేతులు దులుపుకున్నారని అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. ►బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టారుకనుక 16వ లోక్‌సభ జూన్ 3న రద్దయ్యేలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్తే బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారే అవకాశముంది -
రాజ్యసభకు రాకుండా చూడండి
టీ బిల్లుపై రాష్ట్రపతికి తృణమూల్ కాంగ్రెస్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ఆమోదించిన తీరును ఎండగడుతూ తృణమూల్ కాంగ్రెస్ బుధవారర రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదుచేసింది. పార్లమెంట్ నిబంధనలు, ప్రక్రియలను పూర్తిగా ఉల్లంఘించి బిల్లును ఆమోదించారని పేర్కొంది. ఈ దృష్ట్యా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టకుండా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం తృణమూల్ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, ముకుల్‌రాయ్‌లతో పాటు మొత్తం 16 మంది ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. ‘మొదటగా ఈ నెల 13న లోక్‌సభ బిజినెస్, సప్లిమెంటరీ బిజినెస్ లిస్ట్‌లో పెట్టకుండానే మా నిరసనల మధ్యే హోం మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ఇంత ప్రాధాన్యం ఉన్న బిల్లుపై పూర్తిస్థాయి చర్చ జరగనేలేదు. మా పార్టీ ఎంపీ సౌగతారాయ్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొన్ని సవరణలు సూచించారు. అన్ని సవరణలపై డివిజన్ చేయమని కోరాం. కానీ స్పీకర్ దీన్ని తిరస్కరించారు. బిల్లు ఆమోదం సమయంలో డివిజన్‌కు అనుమతించకుండా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు’ అని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. మనోభావాలను పట్టించుకోలేదు: మమత లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. మమత బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని భూస్వామ్య పెత్తందారీ విధానంలో పాలిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె దుయ్యబట్టారు.