Rajya Sabha Candidate
-
రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ
-
రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ
-
రాజ్యసభ అభ్యర్థిగా నేడు సింఘ్వి నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన నామినేషన్ పత్రాలను రిటరి్నంగ్ అధికారికి అందజేస్తారని, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆదివారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని షెరటాన్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎలీ్ప) సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సింఘ్విని రేవంత్ పరిచయం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. సింఘ్వి వాదనలతో రాష్ట్రానికి ప్రయోజనం: సీఎం సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్విని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునరి్వభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయ చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని, ఈ చట్టంలోని అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అపరిష్కృత అంశాలపై వాదించేందుకు వీలుగా న్యాయ కోవిదుడు సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కోరామని చెప్పారు. తన రాజ్యసభ సభ్యత్వానికి పెద్ద మనసుతో రాజీనామా చేసిన కేకే క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారని ప్రశంసించారు. త్వరలోనే రైతు కృతజ్ఞత సభ త్వరలోనే రైతు కృతజ్ఞత సభ ఉంటుందని సీఎం చెప్పారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడారు. ఈనెల 20న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నా వీలు కాలేదని చెప్పారు. రైతు కృతజ్ఞత సభ,రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తేదీలు వెల్లడిస్తామని అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో సింఘ్వి ఒకరని, ఆయన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ హక్కులపై మాట్లాడుతూనే ఉంటా: సింఘ్విసింఘ్వి మాట్లాడుతూ తనను తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల విషయంలో తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. శంషాబాద్‌లో ఘన స్వాగతంసింఘ్వి ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సింఘ్వి అక్కడి నుంచి నేరుగా మాజీ ఎంపీ కె.కేశవరావు నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఉన్న సింఘ్వి ఆ తర్వాత సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సింఘ్విని కలిసి కర్మన్‌ఘాట్ హనుమాన్ ప్రసాదాన్ని అందజేశారు. తర్వాత సింఘ్వి ప్రజాభవన్‌కు వచ్చారు. సింఘ్వి దంపతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన సింఘ్వి ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.మహిళా సాధికారతే లక్ష్యం: సీఎం రేవంత్సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సాధికా రతతో పాటు వారిని కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. -
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలుపు ఖాయం
-
రాజ్యసభకు మళ్లీ వద్దిరాజు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరును పార్టీ అధి నేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు జరిగే ఎన్నికకు సంబంధించి గురువారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్ నేతలతో చర్చించి వద్దిరాజు అభ్యర్థిత్వంపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వద్దిరాజు గురువారం నామినేషన్ దాఖలు చేస్తారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు. కాంగ్రెస్‌కు రెండు.. బీఆర్ఎస్కు ఒకటి రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్కు చెందిన వారే కావడం గమనార్హం. వీరిలో జె.సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ ఈ ఏడాది ఏప్రిల్ 2న తమ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. వద్దిరాజు రవిచంద్ర తన రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం చొప్పున లభించనుంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా, బీఆర్ఎస్ తరపున వద్దిరాజు పేరు ఖరారు కావడంతో ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. వరుసగా రెండోసారి.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన వద్దిరాజు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2022 మేలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్ రాజీనామా చేయడంతో అదే నెల 23న వద్దిరాజును బీఆర్ఎస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో వద్దిరాజుకు రెండోమారు బీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కింది. -
ఎవరీ గోవింద్ భాయ్ డోలాకియా? బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక
బీజేపీ రాజ్యసభ అభ్యర్థల రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. అయితే గుజరాత్ నుంచి జేపీ నడ్డా, గోవింద్ భాయ్ డోలాకియా, మయాంక్‌భాయ్ నాయక్, శ్వంత్‌సిన్హ్ జలంసింహ పర్మార్‌లను ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం గోవింద్ భాయ్ డోలాకియా ఎవరు? ఆయను బీజేపీ ఇంత ప్రాధన్యం ఇవ్వటం ఏంటి? అని చర్చజరుగుతోంది. రాజ్యసభ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించిన అనంతరం గోవింద్ భాయ్ డోలాకియా మీడియాతో మాట్లాడారు. ‘వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నా ప్రయాణం వ్యాపారవేత్తగా సాగటం ఆనందం. కొన్ని గంటల ముందు నేను రాజ్య సభ అభ్యర్థిగా ఎంపిక అయినట్లు తెలిసింది. అయితే నా పేరును ఫైనల్ చేసేముందు బీజేపీ అధిష్టానం ఆలోచించి ఉండాల్సింది’ అని అన్నారు. ఎవరీ గోవింద్ భాయ్ డోలాకియా..? గుజరాత్‌లోని సూరత్‌లో శ్రీ రామ కృష్ణా ఎక్స్‌పోర్ట్స్ పప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంస్థకు గోవింద్ భాయ్ డోలాకియా వ్యవస్థాపకుడు, చైర్మన్. ఇది సూరత్ కేంద్రంగా ఉన్న వజ్రాల తయారీ కంపెనీ. 1970లో ఈ వజ్రాల కంపెనీని ఆయన ప్రారంభించారు. లింక్డ్ఇన్ ఫోఫైల్ ప్రకారం ఆయన కంపెనీలో ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ మొత్తం ఆదాయం ప్రస్తుతానికి 1.8 బిలియన్ డాలర్లు ఉన్నట్లు సమాచారం. ఇక.. ఆయన ఒక ప్రముఖ ప్రజా వక్త, సామాజిక సేవకుడు. దేశంలో పేరుమోసిన పలు విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో వక్తగా వ్యవహరించారు. 2011లో అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం కోసం రూ.11 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. 2014లో తన దాతృత్వం ద్వారా ఎస్ఆర్కే నాలెడ్జ్ ఫౌండేషన్‌ని స్థాపించారు. ఆమ్రేలికి చెందిన గోవింద్ భాయ్ డోలాకియా వజ్రాల వ్యాపార రంగంలో మొదట ఒక కార్మికుడి తన ప్రయాణం ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా వజ్రాల వ్యాపారిగా ఎదిగారు. ఇక.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు దీపావళి సందర్భంగా బహుమతులు ఇస్తూ ఉద్యోగుల్లో మంచిపేరు సంపాధించుకున్నారు. గతంలో తన కంపెనీలో పని చేసే 300 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను గోవింద్ భాయ్ డోలాకియా.. సుమారు రూ.90 లక్షల ఖర్చుతో ఒక ప్రత్యేక ఏసీ రైలు బుక్ చేసి మరీ 10 రోజుల పాటు ఉత్తరఖండ్ పర్యటన తీసుకెళ్లి వార్తల్లో నిలిచారు. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులంతా‘కాకాజీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. -
రాజ్యసభ అభ్యర్ధి ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు
-
అందుకే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది: కపిల్ సిబల్
న్యూఢిల్లీ: ముప్ఫై ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు సీనియర్ నేత కపిల్ సిబల్. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసి.. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి చాలారోజులైందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే భవిష్యత్తులో తాను ఎస్పీతో పాటు ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేస్తూ.. కాంగ్రెస్‌ను వీడడంపై కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిణామాలు కష్టంగా అనిపించొచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరమూ ఉంది. ఇప్పుడు నా సమయం వచ్చింది. పార్లమెంట్లో స్వతంత్రంగా గళం వినిపించాలనుకుంటున్నా. ఏ పార్టీ కొర్రీలు తగిలించుకోవాలనుకోవట్లేదు. సుదీర్ఘకాలంగా ఓ పార్టీకి కట్టుబడి ఉండడం, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం చాలా చాలా కష్టమైన విషయం. ప్రతీ ఒక్కరూ వాళ్ల వాళ్ల గురించి ఆలోచించాలి. ఆ ఆచరణను అమలు చేయాలంటే కొత్తగా ఆలోచించాలి. అందుకే బయటకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి.. అని కపిల్ సిబల్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడడం అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని, తానేమీ తమాషా చేయదల్చుకోలేదని, సంకేతాలు ఇచ్చినా ముందస్తుగా ఎవరికీ తెలియకపోవడం అనేది తనను కూడా ఆశ్చర్యపరిచిందని ఆయన అన్నారు. ఇదిలా కాంగ్రెస్ రెబల్ గ్రూప్ జీ-23లో కపిల్ సిబల్ కూడా ఉండేవారు. గాంధీ కుటుంబ నాయకత్వానికి వ్యతిరేకంగా గళం కూడా వినిపించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన కపిల్ సిబల్.. సీనియర్ లాయర్‌గా, న్యాయ నిపుణుడిగా కాంగ్రెస్ లీగల్ వింగ్‌ను పర్యవేక్షించారు కూడా. ఆయన నిష్క్రమణతో ఒకరకంగా కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: అంతా ఒక్కతాటిపైకి రావాలి-కాంగ్రెస్‌ను వీడాక కపిల్ సిబల్ -
Kapil Sibal: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్ బై
లక్నో: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, జి–23లోని కీలక సభ్యుడు కపిల్ సిబల్ (73) కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. మే 16వ తేదీనే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంతేగాక సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా ఆయనతో పాటున్నారు. నామినేషన్ అనంతరం సిబల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో తనది మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధమని గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నందుకు అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ నెల 16వ తేదీనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. నేనిక ఆ పార్టీ నాయకుడిని కాదు’’ అని తేల్చిచెప్పారు. అంతా ఒక్కతాటిపైకి రావాలి ‘‘కాంగ్రెస్‌తో నాకు లోతైన అనుబంధముంది. 30–31 ఏళ్లు ఒకే పార్టీలో కొనసాగడం మాములు విషయం కాదు. నేను కాంగ్రెస్‌లో చేరడానికి ముఖ్య కారణం దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 31 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానంటే ఏం జరిగిందో ఆలోచించండి. అందుకే కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు (పార్టీకి రాజీనామా) తీసుకోకతప్పదు. అయితే నా సిద్ధాంతం కాంగ్రెస్‌తో ముడిపడి ఉంటుంది. కాంగ్రెస్ సిద్ధాంతానికి నేను దూరం కాలేదు. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని ఆశిస్తున్నా. పార్టీలో క్రమశిక్షణ పాటించాలి. అదేసమయంలో స్వతంత్రంగా గొంతుక వినిపించే అవకాశం ఉండాలి. మీరు గొంతెత్తినప్పుడు మరో పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శలు వచ్చే పరిస్థితి ఉండకూడదు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి వ్యక్తిగతం కృషి చేస్తా. అన్ని సిద్ధాంతాలను కలుపుకొని ముందుకెళ్తాం. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, మమతా బెనర్జీ (బెంగాల్ సీఎం), స్టాలిన్ (తమిళనాడు సీఎం).. ఇలా ఎవరైనా కావొచ్చు. అందరూ చేతులు కలపాలి. 2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలి’’ అని కపిల్ సిబల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విశాలమైన పార్టీ: కె.సి.వేణుగోపాల్ కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ నిష్కృమణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పందించారు. కాంగ్రెస్ విశాలమైన పార్టీ అని, అందులో చాలామందికి చోటు ఉందని వ్యాఖ్యానించారు. హరియాణాలో రెండు రోజుల క్రితం 8 మంది మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని, దానికి మీడియాతో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆక్షేపించారు. అజంఖాన్ సిఫార్సుతోనే.. సిబల్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సమాజ్‌వాదీ మద్దతు వెనక ఆ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ మద్దతుందని చెప్తున్నారు. ఆయనకు బెయిల్ ఇప్పించడంలో సిబల్ కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపాలని ఎస్పీ నాయకత్వాన్ని అజంఖాన్ కోరినట్లు తెలిసింది. ఎస్పీకి యూపీ నుంచి ముగ్గురిని రాజ్యసభకు పంపింత సంఖ్యాబలం ఉంది. సిబల్ వంటి సీనియర్ నేత, లాయర్ రాజ్యసభలో ఉండడం దేశానికి మంచిదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. సిబల్ రాజ్యసభ పదవీ కాలం జూలై 4తో ముగియనుంది. సిబల్ కొంతకాలంగా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా గళమెత్తి వార్తల్లోకెక్కారు. గాంధీయేతర వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. సునీల్ జాఖడ్, హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే. #WATCH | Uttar Pradesh: Congress leader Kapil Sibal files nomination for Rajya Sabha election, in the presence of Samajwadi Party (SP) chief Akhilesh Yadav, in Lucknow. pic.twitter.com/8yRDoSwE3g — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 25, 2022 -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నిరంజన్ రెడ్డి
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఎస్. నిరంజన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ చేతుల -
పదవి కాలం మ్యాటర్ కాదు
-
నిరంజన్‌రెడ్డి: వ్యవసాయ నేపథ్యం.. చట్టాలపై పట్టున్న న్యాయ నిపుణుడు
సాక్షి, నిర్మల్: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని వైఎస్సార్సీపీ రాజ్యసభకు అభ్యర్థిగా ఎన్నిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఈయన. పైగా కీలక కేసులను వాదించిన అనుభవమూ ఉంది ఈయనకు. అందుకే రాజ్యసభకు ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. జులై 22, 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జన్మించారు నిరంజన్‌రెడ్డి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి చేశారు. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పలు కేసుల్లో సేవలందించారు కూడా. -
విజయసాయిరెడ్డి: పార్లమెంట్లో సరైన గళం.. అందుకే రెండోసారి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి మరోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం అయ్యారు. పార్లమెంట్లో తెలుగు రాష్ట్రం తరపున బలమైన గళం వినిపించిన నేతగా ఈయనకి పేరుంది. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావించింది.. అభ్యర్థిగా ప్రకటించింది. విజయసాయిరెడ్డి.. పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారాయన. వైఎస్సార్సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు. తెలుగు రాష్ట్రాల హక్కుల సాధన కోసం, నిరసనల సమయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి రెండోసారి అవకాశం దక్కింది ఇప్పుడు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తనకు ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడమే తన విధి అని పేర్కొన్నారు. -
బీద మస్తాన్‌రావు: వ్యాపార, రాజకీయాలతోనే కాదు..
సాక్షి, నెల్లూరు: బీసీ కోటాలో వైఎస్సార్సీపీ తరపున అభ్యర్థిగా రాజ్యసభకు ఎంపికయ్యారు బీద మస్తాన్ రావు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వ్యాపారంలో ఎదిగి.. తిరిగి రాజకీయాలతోనే రాణిస్తున్నారాయన. ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్సీపీ నేత బీద మస్తాన్‌రావు.. జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జన్మించారు. విద్యార్హత.. బీకాం, సీఏ(ఇంటర్). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్నారు బీద మస్తాన్‌రావు. విద్య పూర్తయ్యాక.. చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్‌నకు ఫైనాన్షియల్ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. బోగోల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు. -
ఆర్ కృష్ణయ్య: గోల్డ్ మెడలిస్ట్.. విద్యార్థి దశ నుంచే పోరుబాట
సాక్షి, అమరావతి: బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్యను వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. దశాబ్దాలపాటు బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఉద్యమనేతకు సముచిత స్థానం ఇవ్వాలనే సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నేపథ్యం ఏంటో చూద్దాం. ఆర్ కృష్ణయ్య.. పూర్తి పేరు ర్యాగ కృష్ణయ్య. సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉద్యమ నేతగా ఎదిగారు. నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు-ఆర్ కృష్ణయ్య -
సీఎం జగన్‌కు థ్యాంక్స్.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
-
సీఎం జగన్‌కు థ్యాంక్స్.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఆర్ కృష్ణయ్య
సాక్షి, తాడేపల్లి: బీసీల మీద సీఎం జగన్ చూపుతున్న ప్రేమను.. మరే సీఎం చూపలేదన్నారు ఆర్ కృష్ణయ్య. రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య స్పందించారు. మొదట్నుంచీ సీఎం జగన్.. బీసీలంటే బ్యాక్ బోన్ అంటూనే ఉన్నారు. అన్నట్టుగానే బీసీలకి అధిక ప్రాదాన్యత ఇస్తూ వస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి రాజ్యసభ పదవులు కొనే పరిస్థితి వైఎస్సార్సీపీలో ఉండదన్న కృష్ణయ్య.. అదే ఉంటే తనలాంటోడు రాజ్యసభకు వెళ్తాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలోనే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని, సీఎం జగన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకుగానూ ఆర్ కృష్ణయ్య.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభకు పంపుతున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ణతలు తెలియజేసేందుకు వచ్చానని అన్నారు. దశాబ్దాలుగా బీసీ ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం తాను పోరాడుతున్నానని, ఆ అంకిత భావాన్ని గుర్తించి సేవ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారని, బీసీలకు సీఎం జగన్ ఇస్తోన్న ప్రాధాన్యతను చూసి దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. తన సేవలను వైస్సార్సీపీలో ఉన్న నేతలంతా మనస్పూర్తిగా అంగీకరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. పార్టీ కండువా కప్పుకోపోయినా.. తాను వైఎస్సార్సీపీలో చేరినట్లేనని, అలాగే బీసీల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
హర్భజన్ సింగ్ కు అరవింద్ కేజ్రీవాల్ భారీ ఆఫర్
-
ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం.. హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్
Harbhajan Singh As AAP Rajya Sabha MP: పంజాబ్‌లో నూతనంగా కొలువుదీరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఢిల్లీలోని ఆప్ వర్గాల సమాచారం. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఆప్‌కు కొత్తగా రెండు రాజ్యసభ బెర్తులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భజ్జీని పెద్దల సభకు పంపాలని పార్టీ కేంద్ర కార్యవర్గం కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించే నిమిత్తం భజ్జీకి మరో కీలక బాధ్యత కూడా అప్పజెప్పాలని ఆప్ యోచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే జలంధర్ స్పోర్ట్ యూనివర్శిటీ బాధ్యతలను కూడా భజ్జీకే అప్పగించాలని భావిస్తుంది. ఆప్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రధాన అస్త్రంగా వాడుకుంది. దీంతో ఎన్నికల్లో యువత భారీ సంఖ్యలో చీపురు గుర్తుకు ఓట్లేశారు. కాగా, పంజాబ్ కొత్త సీఎం భగవంత్ సింగ్ మాన్‌తో హర్భజన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల ఫలితాల్లో ఆప్ బంపర్ మెజార్టీ సాధించాక మాన్కు హర్భజన శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇటీవల వెలువడిన పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 117 సీట్లకు గాను ఆప్ 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, ఢిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో గద్దెనెక్కింది. చదవండి: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం.. పాపం న్యూజిలాండ్! -
చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు: డీఎస్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వ సలహాదారుడు సీనియర్ నేత డి. శ్రీనివాస్ చెప్పారు. ఢిల్లీకి వెళ్లి సేవచేసే భాగ్యం తనకు కల్పించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కేసీఆర్ గురువారం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వారిలో డి.శ్రీనివాస్‌ను రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తన గురించి అనేకమంది అనేక విధాలుగా మాట్లాడారంటూ డీఎస్ వాపోయారు. పనిచేసే నేతలకు పదవులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ తోడుగా ఉంటానని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో ఎవరూ అయిన పోటీ చేయొచ్చునని (కాంగ్రెస్‌ను ఉద్దేశించి) పరోక్షంగా డి. శ్రీనివాస్ విమర్శించారు. బంగారు తెలంగాణ కోసమే కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నట్టు తెలిపారు. అందుకే తనకు ఈ అవకాశమిచ్చినట్టు చెప్పారు. టీఆర్ఎస్లో చేరితే తన భవిష్యత్తు బాగుండదని చాలామంది అనుకున్నారని అన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో తామంతా నడుస్తామని డీఎస్ చెప్పారు. -
సీతమ్మకు అందలం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :రాబోయే ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయా లా, ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలా అనే మీమాం శలో కొట్టుమిట్టాడుతున్న జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి అనూహ్యంగా రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆమెను పోటీకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. సోమ వారం రాత్రి ఈ విషయాన్ని పార్టీ ప్రతిని దులు హైద రాబాద్‌లో ప్రకటించారు. కోస్తాజిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన సీతారామలక్ష్మిని రాజ్యసభకు పంపించడం ద్వారా ఆ వర్గం వారిని ఆకర్షించాలనేది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది. దీంతోపాటు మహిళలకు పెద్దపీట వేశామనే సంకేతం ఇచ్చేందుకు వీలుగా సీతారామలక్ష్మికి అవకాశం ఇస్తున్నట్లు తెలిసింది. మంగళవారం ఆమె నామినేషన్ వేయడం ఖాయమని పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి పిలుపు రావడంతో సీతారామలక్ష్మి సోమవారం సాయంత్రం హుటాహుటిన బయలుదేరి వెళ్లి చంద్రబాబును కలిశారు. సందిగ్ధం నడుమ... టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల రేసులో తొలినుంచీ సీతారామలక్ష్మి పేరు విని పిస్తున్నా చివరకు ఆమెకు అవకాశం దక్కుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి రాబో యే సాధారణ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె మళ్లీ అదేస్థానం నుంచి పోటీ చేయాలా, లేదో అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా.. గత ఎన్నికల్లో ఆమె ఓటమి చెందడం, రెండుసార్లు పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిం చాల్సి రావడం వంటి కారణాల నేపథ్యంలో మళ్లీ లోక్‌సభకు పోటీచేస్తే ఆర్థికంగా ఇబ్బంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోటీకి వెనుకడుగు వేస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీతారామలక్ష్మి భీమవరం అసెంబ్లీ సీటుపై కన్ను వేయటం, స్థానిక నాయకులు వ్యతిరేకించడం పార్టీలో ఒకింత గందరగోళానికి తెరలేపింది. ఈ పరిస్థితిల్లో అనూహ్యంగా ఆమెను రాజ్యసభ అభ్యర్థుల రేసులో ముందుండటం చర్చనీయాంశమైంది. దీనిపైనా పార్టీలోని ఒకవర్గం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బహిరంగంగా ఆ విషయాన్ని ఎవరూ బయట పెట్టకపోయినా పార్టీకి పట్టుకొమ్మలా ఉన్న సామాజిక వర్గాన్ని కాదని.. వేరే వర్గానికి చెందిన సీతారామలక్ష్మికి సీటు ఇవ్వడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.