మృత్యుంజయుడు..!
బీరుట్: ఈశాన్య సిరియాలోని రాఖా పట్టణంపై ప్రభుత్వ దళాలు జరపిన దాడుల్లో ఆదివారం ఐదుగురు చిన్నారులు సహా 12 మంది చనిపోగా, 23 మంది గాయపడ్డారు. ఆ దాడిలో ఒక నిండు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమె గర్భంలోని శిశువును వైద్యులు కాపాడగలిగారు. అయితే, ఆ చిన్నారి తలపై గాయమైందని, చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియోను స్థానిక మిలిటెంట్లు ప్రసారం చేశారు. ‘దాడిలో తల్లికి కడుపులో తీవ్ర గాయమైంది. గర్భంలోని శిశువుకు కూడా తలపై గాయమైంది. కష్టంమీద తల్లిని, శిశువును కాపాడగలిగాం’ అని వైద్యులు పేర్కొంటున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.