ramakrisna
-
‘చెంబుడు నీళ్లు తెచ్చినప్పుడే నిలదీయాలి’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం బ్లూప్రింట్ విడుదల చేయాలని సీపీఐ నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతే మళ్లీ 10.32శాతం వడ్డీకి బాండ్లు విడుదల చేసి మరింత అప్పులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రమైనా బాండ్లతో అప్పు ఈ విధంగా చేసిందా అని ప్రశ్నించారు. కంపెనీల కోసం బాండ్లు విడుదల చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజననాటికి 94వేల కోట్ల అప్పు ఉండేది ఇప్పుడు లక్షల కోట్లకు చేరువైందని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై వెంటనే అఖిలపక్షం నిర్వహించి చర్చించాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం, అమరావతి బాండ్ల వ్యవహారంపై అన్ని పార్టీలతో చర్చించి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. మోదీని అప్పుడే నిలదీయాలి బీజేపీతో చేతులు కలిపి చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని రామకృష్ణ విమర్శించారు. చెంబుడు నీళ్లు, మట్టి తీసుకొచ్చినప్పుడే చంద్రబాబు నరేంద్రమోదీని నిలదీసేది ఉండేదన్నారు. స్వార్ధం కోసం అహో అన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రం మోసం చేసిందంటున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని రామకృష్ణ మండిపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. హోం మంత్రిని డమ్మీని చేశారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ సంస్థల నిర్వాహకానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిచ్చిన విద్యార్థి విభాగానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల న్యాయంకోసం అక్టోబర్ 1న జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టనున్న మహాధర్నాకి మద్దతు ప్రకటిస్తున్నామని రామకృష్ణ తెలిపారు. -
వేధింపులు తాళలేకున్నాం
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: భర్త వేధింపులు తాళలేకున్నాం..ఆస్తి కోసం చంపేందుకు యత్నిస్తున్నారు..బంధువులు వేధిస్తున్నారు..ఇలా ఒక్కొక్కరు తమ ఆవేదనను సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ దృష్టికి తెచ్చారు. తమ సమస్యలను వినతిపత్రం రూపంలో ఎస్పీతో పాటు ఏఎస్పీలు గంగాధరరావు, ఐఆర్ఎస్ మూర్తి, నగర డీఎస్పీ పి.వెంకటనాథ్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు వై. జయరామసుబ్బారెడ్డి, మాధవరావు, ఎం.నాగేశ్వరమ్మ, హోంగార్డ్స్ ఆర్ఐ కేజేఎం చిరంజీవి పాల్గొన్నారు. హత్య చేయబోయాడు నాకు చాముదలకు చెందిన రామకృష్ణతో 14ఏళ్ల కిందట వివాహమైంది. మాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ఇటీవల చెప్పుడు మాటలు విని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నా ఆస్తి కాజేసేందుకు ఇటీవల నన్ను హత్య చేయబోయాడు. విచారించి న్యాయం చేయండి. వల్లేరు కామాక్షి, చామదల, జలదంకి ఇంటిని కూల్చేశారు. మా ఊర్లో గున్నంరెడ్డి సుజన వద్ద ఐదు అంకణాల స్థలాన్ని 2011 ఆగస్టులో కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నాను. గత ఏడాది ఏప్రిల్‌లో సుజన బంధువులు కూనం ధనమ్మ, రాఘవరెడ్డి, వాసుదేవరెడ్డి, దశరథరామిరెడ్డి ఇంటిని కూల్చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అరవ ఉమామహేశ్వరి, జలదంకి బంధువులే వేధిస్తున్నారు నాకు మాధవరావుతో 13 ఏళ్ల కిందట పెళ్లయింది. ఆయన బేల్దారి పనిచేస్తూ కు టుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలం గా నా భర్త అన్న కుమారులు నాగరాజు, శ్రీనివాసులు, అక్క కొడుకు శ్రీహరి నన్ను వేధిస్తున్నారు. పలు దఫాలు మందలించినా ఫలితం లేకపోగా ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. వారు చెప్పినట్లు వినకపోతే నన్ను, నా భర్తను చంపేస్తామంటున్నారు. ఫొటోలు తీసి నెట్లో పెడతామని బెదిరిస్తున్నారు. స్వప్న, బ్రహ్మారెడ్డిపాళెం, కొడవలూరు భర్తపై చర్యలు తీసుకోవాలి నాకు వెంకటేశ్వరపురానికి చెందిన దాసరి కోటయ్యతో వివాహమైంది. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన నాపై అనుమానం పెంచుకుని చిత్రహింసలు పెడుతున్నాడు. ఆయన ఇప్పటికే నలుగురిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై నిలదీస్తే నా కుమార్తెతో పాటు అన్న కుమార్తెను కూడా చంపుతానని బెదిరిస్తున్నాడు. విజయమ్మ, చంద్రబాబునగర్ కాపురాన్ని చక్కదిద్దండి నాకు మేనమామ జాలయ్యతో 1993 లో వివాహమైంది. మద్యానికి బానిసై న భర్త నన్ను, పిల్లల్ని పట్టించుకోకుం డా ఇబ్బంది పెడుతున్నాడు. ఇటీవల మరో మహిళతో వి వాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ప్రశ్నిస్తే కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడు. నా కాపురాన్ని చక్కదిద్దండి. - కూనంగారి మస్తానమ్మ, గుమ్మళ్లదిబ్బ, చిల్లకూరు మోసం చేశారు నేను గతేడాది ఏప్రిల్‌లో టాటా 207 వాహనాన్ని ఫైనాన్స్‌లో తీసుకొన్నాను. రెండు నెలల తర్వాత పొదలకూరుకు చెందిన మస్తాన్‌కి లీజ్‌కి ఇచ్చాను. అతను నాకు తెలియకుండా చేజర్ల మండలం మడపల్లికి చెందిన రవి(హోంగార్డ్)కి అమ్మేశాడు. అతను ఫైనాన్స్ చెల్లించకుండా ఆ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు. అది తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, నా వాహనాన్ని నాకు ఇస్తామని చెప్పి వేరే వాహనానికి నంబరు ప్లేటు మార్చి ఇచ్చారు. దొంగబండి అని తేలడంతో చేజర్ల పోలీసులకు అప్పగించాను. నాకు జరిగిన మోసంపై పొదలకూరు సీఐ రోశయ్యకు ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదు. పి. శ్రీనివాసులు, కలువాయి -
గుట్కా గుట్టు.. రట్టు
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఎర్రచందనం దొంగలను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో జీరో వ్యాపారులు.. టమాటాల మాటున నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్న లారీ విజి‘లెన్స్’కు చిక్కింది.అందులో సుమారు 200 బస్తాల గుట్కా పాకెట్లు ఉండడం చూసి అధికారులు విస్మయం చెందారు. పట్టుబడిందెలాగంటే... అనంతపురం నుంచి బెంగళూరుకు టమాటా లోడుతో వెళ్లిన ఏపీ 02- ఎక్స్ 6551 నంబర్ గల లారీ అక్కడ టమాటాల లోడును దింపిన అనంతరం తిరుగు ప్రయాణంలో టమాటాల రవాణాకు ఉపయోగించే ప్లాస్టిక్ పెట్టె(ట్రేస్)ల మాటున గుట్కా ప్యాకెట్ల బస్తాలతో కడపకు ప్రయాణమైంది. ఈ విషయం పసిగట్టిన కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం అప్రమత్తమైంది. లారీ కడప వైపునకు వస్తున్నట్లు అందిన సమాచారంతో కడప మరియాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు మాటువేశారు. సరిగ్గా అదే సమయానికి లారీ రాగానే తమ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ రామకృష్ణ తెలి పారు. అందులో 200 బస్తాలు ఉండగా, వాటి విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. అయితే బయటి మార్కెట్లో వాటిని విక్రయిస్తే రూ.70 లక్షలు వస్తుందని వెల్లడించారు. లారీని పాత రిమ్స్‌కు తరలించి, స్వాధీనం చేసుకున్న గుట్కా బస్తాలను భద్రపరచినట్లు చెప్పారు. ధర్మవరానికి చెందిన లారీ డ్రైవర్ చరణ్, క్లీనర్ సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లారీ ధర్మవరం ప్రాంతానిదే.. గుట్కా బస్తాలను రవాణా చేస్తు విజి‘లెన్స్’కు చిక్కిన లారీ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముకుందారెడ్డికి చెందినదిగా డ్రైవర్ విచారణలో అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తి గుట్కా వ్యాపారం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. కాగా అక్రమ రవాణా ఎలా జరుగుతోందనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ పుల్లయ్య, ఏఓ శశిధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్ధరాత్రి ఆలయ ప్రహరీ కూల్చివేత
పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్ : పత్తికొండ గ్రామదేవతలైన అంకాలమ్మ, బంగారమ్మ ఆలయ ప్రహరీని స్థానికులు అర్ధరాత్రి కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ప్రహరీ నిర్మాణం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఉదయం ఆర్డీఓ ఆదేశాల మేరకు తహశీల్దారు రామక్రిష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆలయం వద్దకు వెళ్లి ఇంటి నివాసానికి ఇబ్బందిగా ఉన్న కొంత భాగాన్ని మాత్రమే తొలగించారు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకున్న స్థానికులు బాబు, వడ్డే భాగ్యప్ప, చాకలి రంగన్న, రామాంజినేయులు, వడ్డే శ్రీను, తెలుగు శ్రీను ప్రహరీ మొతాన్ని తొలగించాలని పథకం వేశారు. రాత్రి వేళ జేసీబీ యజమాని వద్దకు వెళ్లి తహశీల్దారు రామక్రిష్ణ మిగిలిన గోడను కూడా కూల్చివేయమన్నాడని అబద్ధం చెప్పారు. రాత్రి సమయంలో ఎందుకని పొక్లెయిన్ యజమాని, డ్రైవర్ వారిస్తున్నా పట్టించుకోకుండా జేసీబీని ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు. అధికారుల పేరుతో భయపెట్టి మిగిలిన ప్రహరీని కూడా కూల్చివేయించారు. శుక్రవారం ఉదయంలోపు ఈ విషయం గ్రామం మొత్తానికీ తెలిసిపోయింది. దీంతో 12 ఆయకట్ల రైతులు, గ్రామప్రజలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. మరికొంత మంది ప్రజలు ప్రహరీని కూల్చిన వారి ఇళ్లపైకి దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో సీఐ శ్రీధర్, ఎస్ఐ ప్రియతమ్‌రెడ్డి, తహశీల్దారు రామక్రిష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయం వద్ద గుమికూడిన గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. ఆలయ కమిటీ పెద్దలు ఎల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులతో అధికారులు చర్చించారు. ప్రహరీని తొలగించేందుకు ఉపయోగించిన జేసీబీని అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేసిన దుండగుల్లో కొందరిని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఎస్ఐ ప్రియతమ్ రెడ్డి న్యూస్‌లైన్‌కు తెలిపారు.