Ramanamurthy Raju
-
ఎమ్మెల్యే రమణమూర్తి రాజుకు పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్ర చికిత్స చేయించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే యువీ రమణమూర్తి రాజును శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాథ్ , గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, మల్లా విజయప్రసాద్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, విప్ బూడి ముర్తాల నాయుడు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తదితరులు పరామర్శించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యే రమణమూర్తికి అభినందలు తెలిపారు. సత్తి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు.. సతీ వియోగంతో బాధపడుతున్న విశాఖ వైఎస్సార్సీపీ నేత సత్తి రామకృష్ణారెడ్డిని శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాథ్ గొల్ల బాబూరావు, చెట్టి ఫాల్గుణ, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, విఎంఆర్డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, సమన్వయకర్తలు మల్లా విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు, అనకాపల్లి పార్ల మెంట్ అధ్యక్షుడు శరగడం చిన అప్పనాయుడు, కొయ్యా ప్రసాద రెడ్డి, కొండా రాజీవ్ గాంధీ, ఫరూఖీ తదితరులు.. ఇటీవల మృతిచెందిన సత్తి రామకృష్ణారెడ్డి సతీమణి కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలల వేసి నివాళుర్పించారు. -
కన్నబాబుకు 'గంటా' వాయింపు
టీడీపీ నుంచి తనకు టికెట్ హామీ రాకుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి... స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు యోచిస్తున్నారు. అందుకోసం చకచక పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా తనకు అత్యంత సన్నిహిత మిత్రడు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కన్నబాబు ఆదివారం విశాఖపట్నంలో భేటీ ఆయ్యారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న కన్నబాబు మనసులోని మాటను మిత్రుడు గంటా ముందు ఉంచారు. దాంతో కన్నబాబును గంటా సముదాయించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన తాను ప్రస్తుతం ఆ పార్టీలోనే కాకుండా విశాఖ జిల్లాలోని స్థానిక పార్టీ నేతలతో పడుతున్న ఇబ్బందులను కన్నబాబు ముందు గంటా వాయించి వదిలి పెట్టారు. ప్రస్తుత పరిస్థితిలో నువ్వు రాజీనామా చేస్తే తనలా ఇబ్బందులు పడతావంటూ సూచించారు. పార్టీకి రాజీనామా చేసి తొందర పడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవంటూ కన్నబాబుకు గంటా హితవు పలికారు. గంటా శ్రీనివాసరావుతో పాటు విశాఖ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు టికెట్ కేటాయిస్తాడన్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. దాంతో కన్నబాబు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.