ramayam forest range
-
గొర్రెలపై గుర్తు తెలియని జంతువుల దాడి
రామయంపేట(మెదక్): మండలంలోని సుతార్‌పల్లి గ్రామంలో రాగి పెద్ద అంజయ్యకు చెందిన నాలుగు గొర్రెలను గుర్తు తెలియని జంతువులు హతమార్చాయి. అంజయ్య తన గొరెల్రను వ్యవసాయ బావి వద్ద కొట్టంలో ఉంచగా, గుర్తు తెలియని జంతువు హతమార్చింది. చిరుత పులి దాడి చేసినట్లు బాధితుడు పేర్కోనగా, ఇది చిరుత దాడి కాదని అటవీ శాఖ డీప్యూటీ రెంజ్ అధికారి కుతుబోద్దీన్ పేర్కోన్నారు. బాధితుణ్ణి ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. -
‘అరణ్య’రోదన
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: అడవులను నరకడమే కాకుండా ప్లాంటేషన్ ద్వారా పెంచిన చెట్లను సైతం అక్రమార్కులు వదలటం లేదు. రామాయంపేట ఫారెస్టు రేంజ్‌లోని బ్యాతోల్ అటవీ పరిధి హవేళిఘణపూర్ తండా ప్రాంతంలో గల అడవిలో 15 ఏళ్ల క్రితం వేలాది రూపాయలను వెచ్చించి సుమారు 25 ఎకరాల్లో నీలగిరి మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. అయితే ఈ చెట్లపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో ఎవరికీ వారుగా ప్లాంటేషన్‌కు వెళ్లి చెట్లను దర్జాగా నరుకుతున్నారు. ఫలితంతా ప్లాంటేషన్ కనుమరుగవ ుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అడవులు ఎలాగో కాపాడలేకపోతున్న అధికారులు కనీసం ప్లాంటేషన్ చేసిన చెట్లను సైతం అధికారులు రక్షించలేక పోతున్నారన్న విమర్శలున్నాయి. పర్యావరణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతియేటా కోట్లాది రూపాయలను విడుదల చేసి అడవుల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. దీంతో అడవులతో పాటు ప్లాంటేషన్లు సైతం మాయమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.