మెదక్ రూరల్, న్యూస్‌లైన్: అడవులను నరకడమే కాకుండా ప్లాంటేషన్ ద్వారా పెంచిన చెట్లను సైతం అక్రమార్కులు వదలటం లేదు. రామాయంపేట ఫారెస్టు రేంజ్‌లోని బ్యాతోల్ అటవీ పరిధి హవేళిఘణపూర్ తండా ప్రాంతంలో గల అడవిలో 15 ఏళ్ల క్రితం వేలాది రూపాయలను వెచ్చించి సుమారు 25 ఎకరాల్లో నీలగిరి మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. అయితే ఈ చెట్లపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో ఎవరికీ వారుగా ప్లాంటేషన్‌కు వెళ్లి చెట్లను దర్జాగా నరుకుతున్నారు. ఫలితంతా ప్లాంటేషన్ కనుమరుగవ ుతోంది.
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అడవులు ఎలాగో కాపాడలేకపోతున్న అధికారులు కనీసం ప్లాంటేషన్ చేసిన చెట్లను సైతం అధికారులు రక్షించలేక పోతున్నారన్న విమర్శలున్నాయి. పర్యావరణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతియేటా కోట్లాది రూపాయలను విడుదల చేసి అడవుల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. దీంతో అడవులతో పాటు ప్లాంటేషన్లు సైతం మాయమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
‘అరణ్య’రోదన
Published Fri, Jan 3 2014 11:53 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement