Ramchandra rao
-
రాజ్యాంగ పరిరక్షకురాలిగా స్పందించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం–కేంద్రం–బీజేపీల మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. సోమవారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతుండగా అంతరాయం కలిగిస్తున్నారనే పేరుతో ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం తెలిసిందే. కాగా దీనిపై వారు రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేయాలని, ఇతర అన్ని వేదికలు, సంస్థలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా స్పందిస్తామన్నారు తాము సభలో ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకపోయినా సస్పెండ్ చేశారంటూ గవర్నర్‌కు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని, తమ హక్కులను కాలరాస్తూ తమను సస్పెండ్ చేసినందున రాజ్యాంగ పరిరక్షకురాలిగా దీనిపై స్పందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందిగా స్పీకర్‌కు సూచించాలని కోరారు. తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు అసెంబ్లీలో తాము ప్రాతినిధ్యం వహించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా దీనిపై రాజ్యాంగబద్ధంగా స్పందిస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని ఈటల, రఘునందన్‌రావు మీడియాకు తెలిపారు. శాసనసభలో పరిణామాలను గవర్నర్‌కు వివరించామని, గవర్నర్‌ను ప్రసంగించేందుకు పిలవక పోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పామని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే తమ ముఖాలు చూడకూడదని సస్పెండ్ చేశారని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ నేతలు డీకే అరుణ, డాక్టర్ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, డా.జి.మనోహర్‌రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు నిరసనలు అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ మంగళవారం అన్ని జిల్లాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనేలా చూడాలని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ఈ మేరకు కార్యాచరణపై సోమవారం ఆర్ధరాత్రి వరకు నేతలు చర్చించారు. శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలను ఎదుర్కోలేక, వారు లేవనెత్తే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక, ఈటల రాజేందర్ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో ఆయన ముఖం చూసే ధైర్యం లేకే ఇలాంటి రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ దిగుతున్నాయని బీజేపీ ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు పాల్గొన్నారు. -
కమలంలో లుకలుకలు!
బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు వేదికగా బీజేపీలో నెలకొన్న లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద శనివారం వాకర్లను ఓట్లు అభ్యర్థించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ కూడా వచ్చారు. చింతల రావడంతోనే అప్పటికే అక్కడికి వచ్చిన పార్టీ నేత గోవర్ధన్‌ను పక్కకు జరగాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గోవర్ధన్ చింతలపై విరుచుకుపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాహాబాహికి దిగేందుకూ యత్నించారు. కాగా,పరిస్థితి చేయిదాటుతుండటంతో వెంట నే పక్కనే ఉన్న నేతలు కలగజేసుకొని ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. మొన్నటి కార్పొరేటర్ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీ టిక్కెట్ ఇవ్వకుండా తనను మోసం చేశారని పల్లపు గోవర్ధన్ కోపంతో ఉన్నారు. దీంతో చింతలతో విభేదాలు తలెత్తాయి. -
సిట్టింగ్ పట్టాలె.. ‘బోనస్’ కొట్టాలె!
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలుపే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ సీటుతోపాటు మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బోనస్‌గా దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా కమలనాథులు క్షేత్ర స్థాయి నుంచి ప్రచార వ్యూహాలను సిద్ధం చేశారు. రెండు ఎమ్మెల్సీ సీట్లకు నామినేషన్లు వేసిన నాటి నుంచే పార్టీ క్యాండిడేట్లు, నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. దానికితోడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. మరోవైపు సంఘ్ పరివార్ కేడర్ కూడా చాపకింద నీరులా దూసుకెళ్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం సాధి స్తామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ సీటులో తమ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు గెలిచే చాన్స్ ఎక్కువని.. నల్లగొండ- ఖమ్మం-వరంగల్ సీట్లో గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి విజయం సాధించేలా ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. అన్నిస్థాయిల వారిని రంగంలోకి దింపి.. గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలను రంగంలోకి దింపింది. పార్టీలో చేరిన ముఖ్య నేతలందరినీ రంగంలోకి తెచ్చింది. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, పోలింగ్ బూత్‌ల వారీగా ఇన్చార్జులను నియమించింది. పార్టీ నుంచి ప్రతి 25 మంది ఓటర్లకు ఓ ఇన్చార్జిని పెట్టింది. అన్ని స్థాయిల్లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మోత్కుపల్లి నర్సింహులు, గూడూరు నారాయణరెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి నేతలంతా బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో ఉన్నారు. బీజేపీ శ్రేణులతోపాటు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులోనూ క్రియాశీలకంగా పాల్గొన్న సంఘ్ పరివార్ కార్యకర్తలు కూడా ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. టార్గెట్ టీఆర్ఎస్.. కాంగ్రెస్‌పై ఫైరింగ్ కాషాయ నేతలు ముఖ్యంగా టీఆర్ఎస్ను టార్గెట్‌గా చేసుకుని, ఆరేళ్ల టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. వీలున్నప్పుడల్లా కాంగ్రెస్ గురించి ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ పని అయిపోయినట్లే నని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ మంచి ఊపుమీద ఉన్నప్పుడే బీజేపీ తరఫున రాంచందర్‌రావు భారీ మెజారిటీతో గెలిచారని, వరంగల్ సీటును కూడా కొద్ది ఓట్లతో పోగొట్టుకున్నామని అంటున్న బీజేపీ.. ఇప్పుడు రెండింటినీ కైవసం చేసుకుంటామని చెప్తోంది. టీఆర్ఎస్పై అన్నివర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల సృష్టి, వీసీల నియామకాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ, గ్రూపు- 1, 2 పోస్టుల భర్తీ చేపట్టకపోవడం, యూనివర్సిటీపై నిర్లక్ష్యం, పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు వంటివి అమలు చేయకపోవడం వంటివాటిని గ్రాడ్యుయేట్లలోకి బలంగా తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈ దిశగా మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయడంలో, కౌంటర్లు ఇవ్వడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాంచందర్‌రావు కూడా అదే తరహాలో మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మంత్రులు, అధికార పక్ష నేతలను రెచ్చగొడుతూ, ఇరుకున పెట్టాలన్న వ్యూహంతో ముందుకుసాగుతున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో బీజేపీ క్యాండిడేట్ ప్రేమేందర్‌రెడ్డి తరచూ టీఆర్ఎస్ పాలనపై, మంత్రి దయాకర్‌రావు, ఇతర టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై గట్టి విమర్శలు చేస్తున్నారు. -
'ఏపీలో మాదిరిగా ఐఆర్ ప్రకటించాలి'
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో మాదిరిగా తెలంగాణలో ఉద్యోగస్తులకు ఐఆర్ ప్రకటించాలని ఎమ్మెల్సీ రామచందర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో పీఆర్సీ ఇచ్చే వరకు ఐఆర్ ఇచ్చేవారని, ఆగస్టులోనే పీఆర్సీ నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్రం మూడు డీఏలు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే ఇచ్చిందన్నారు. 2018 నుంచి పీఆర్సీ అమలు కావాల్సి ఉందని, పక్క రాష్ట్రం 27 శాతం ఐఆర్ ఇస్తుందని పేర్కొన్నారు. 'తెలంగాణ వచ్చాక పదోన్నతులు, కొత్త నియామకాలు లేవు. లక్షా 35 వేల ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు..ఎప్పుడు భర్తీ చేస్తారు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి సహా ఉద్యోగస్తులకు రావాల్సిన ఒక్క బెనిఫిట్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం లేదు' అని రామచందర్ రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. (కేసీఆర్‌ను గద్దెదించుతాం: కోమటిరెడ్డి ) -
'తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది'
సాక్షి, కామారెడ్డి : తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతుందని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో గురువారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు కొనసాగుతున్నాయని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు పెరుగనున్నాయని వెల్లడించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలతో పాగా వేయనుందని రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి జాతీయ బొగ్గు గనుల శాఖ స్వతంత్ర డైరక్టర్ మురళీధర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జంట జలాశయాలు నిష్ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా తాగునీరు అందిస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ రెండు జలాశయాలు కూడా నిష్ప్రయోజనకరంగా మారాయని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు గురువారం హైకోర్టుకు నివేదించారు. ఈ జలాశయాల వల్ల తాగునీరు తగినంత అందడం లేదని, కృష్ణా జలాలనే తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ జంట జలాశయాల పరిధిలో జీవో 111కు విరుద్ధంగా భారీ ఎత్తున వెలసిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు ఎదుట ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై పిటిషనర్ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో ఏఏజీ స్పందిస్తూ, జీవో 111పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 111 జీవో పరిధిలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయని, వీటి విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అలాగే జీవో 111 చట్టబద్ధతను సవాలు చేస్తూ కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏఏజీ వాదనలు వినిపిస్తూ జంట జలాశయాలు నిష్ప్రయోజనకరంగా మారాయని కోర్టుకు నివేదించారు. -
‘అనుమతిచ్చారు.. లేదు ఇవ్వలేదు’
సాక్షి, హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్బంధం చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మండిపడ్డారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రను పోలీసులు అడ్డుకుని ఆయనను గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రామచంద్రరావు మంగళవారం మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామి యాత్రకు పోలీసులే అనుమతి ఇచ్చారని, తిరిగి పోలీసులే యాత్ర చేయకుండా గృహ నిర్బంధం చేశారని అన్నారు. కనీసం ఇతరులు కూడా ఆయనను కలవడానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, ఏం నేరం చేశారని నిర్బంధించారని ప్రశ్నించారు. పోలీసులే అనుమతినిచ్చి.. తిరిగి రద్దు చేయడమేంటన్నారు. స్వామిజీ వెంట వెళ్లే 400 మందికే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం నాలుగు కోట్ల మంది ప్రజలకు ఎలా రక్షణ ఇస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే గృహ నిర్బంధం రద్దు చేసి.. స్వామిజీపై వేధింపులు ఆపాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. కాగా, పరిపూర్ణానందకి తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. -
టీఆర్ఎస్.. మాటలకే పరిమితం
► హామీల అమలులో సర్కార్ విఫలం ► బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు సాక్షి, యాదాద్రి : టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల కే పరిమితమైందని ఎమ్మెల్సీ రామచందర్‌రావు అ న్నారు. శుక్రవారం భువనగిరిలోని బీజేపీ జిల్లా కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, ప్రజలు సంతోషంగా లేరన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మూడేళ్ల కాలంలో కేవలం 20 వేలు మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. మిగిలినవి ఎపుడు చేస్తారని, హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని విమర్శించారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేయలేదని, ప్రజాస్వామ్య హక్కులను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలన పట్ల దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 24న యాదాద్రిభువనగిరి జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నట్లు వెల్లడిం చారు. ఇక్కడ ఉన్న మేధావులతో చర్చిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిమ్స్‌ను ఎయిమ్స్‌గా ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు కావాల్సి 200 ఎకరాల భూమిని చూపకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కేం ద్రానికి తెలంగాణపై ఎలాంటి వివక్ష లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విభజనకు కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, రాష్ట్ర నాయకుడు కాసం వెంకటేశ్వర్లు, దళితమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవిందర్, కర్నాటి ధనుంజయ, పాశం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నర్ల నర్సింగరావు, పడమటి జగన్మోహన్రెడ్డి, జిల్లా కార్యదర్శి నీలం రమేష్, పట్టణశాఖ అధ్యక్షుడు చంద మహేందర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు. -
ఆ కారు నంబర్ కోసం ఎంత పెట్టారో!
తుర్కయంజాల్: కర్మన్‌ఘాట్‌కు చెందిన ఓ వ్యక్తి ఇబ్రహీంపట్నం రవాణా శాఖ కార్యాలయంలో 9999 నెంబర్‌ను అధిక ధరకు వేలంలో దక్కించుకున్నాడు. మునదల రామచంద్రరావు తన కిర్లోస్కర్ కారుకు 9999 నెంబర్‌ను 4,58,020 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. ఇంత ధర పలకడం ఇబ్రహింపట్నం రవాణా శాఖ కార్యాలయంలో ఇదే మొదటిసారి అని ఆర్టీఓ గౌరిశంకర్ తెలిపారు. -
నవ్వు
కోరిన అదృష్టం ఆమెను వరించలేదు. ఏడాదికే ఆమె విధవరాలై తిరిగి వచ్చింది. రామచంద్రరావు చూడటానికి వెళ్లాడు. ధైర్యం చెప్పాడు. అలాగే ప్రతిరోజూ వెళ్లి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు. ఆమె దుఃఖం నుండి కోలుకుంది. రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. అతనికి నవ్వడం ఒక స్వభావమైపోయినట్టూ, కష్టాలూ, చీకాకులూ అతనికి దూరంగా తొలగి వుంటాయన్నట్టు అనిపిస్తుంది. ఊళ్లో అందరినీ అతను నవ్వుతూ పలకరిస్తాడు. అందరూ అతనికి స్నేహితులు. అతను పక్కనుంటేనే మూర్తికి వొళ్లంతా తేలికపడినట్టు, ఉదయపు నీరెండ వంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. మూర్తికి సమస్యలు చాలా ఉన్నాయి. కాని ఆ సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా ఉన్నంతసేపూ మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి. కాని, మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఎందుకు ఇతని వదనాన ఒక విషాద రేఖ గానీ, విసుగు గానీ కనిపించవు? ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును? సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని యితను వశపరచుకున్నాడు? తీరా చూస్తే రామచంద్రరావు సామాన్యుడు. ఆస్తీ, హోదా ఉన్నవాడు కాదు; ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ‘నా’ అన్నవాళ్లెవరూ ఉన్నట్టు కనబడరు. అతను ఒంటరివాడు. ఏలూరు నుండి వచ్చే బస్సు ప్రమాదానికి లోనయిందనీ, ప్రయాణీకులకి చాలామందికి గాయాలు తగిలాయనీ విన్నాడు మూర్తి. వారిలో రామచంద్రరావు ఒకడని తెలిసినప్పుడు బాధపడ్డాడు. మూర్తి కంగారుపడ్డాడు. సరాసరి టిక్కెట్టు కొనుక్కుని ఏలూరు ఆస్పత్రికి వెళ్లాడు. గాయపడినవారిలో రామచంద్రరావును గుర్తించడం కష్టమయింది. అతని తలకీ చెంపలకీ కట్లు ఉన్నాయి. స్పృహ లేదు. మూర్తి గాభరాపడ్డాడు. తక్కిన గాయపడిన వారందరి దగ్గరా వారి వారి భార్యలూ తల్లిదండ్రులూ ఉన్నారు. రామచంద్రరావు మాత్రం వొంటరిగా మృత్యువుకీ, బ్రతుకుకీ మధ్య ఉన్న మసక మసక అంచుమీద ఉన్నాడు. మూర్తికి కళ్లనీళ్లు తిరిగాయి. ఇంత ఉత్తముడికి ఎందుకిటువంటి గతి పట్టింది అనుకున్నాడు. అతని మంచం పక్కన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు మూర్తి. స్పృహ రాగానే - తనని చూస్తాడనీ, కావలించుకుని ఏడుస్తాడనీ అనుకున్నాడు. తనకి ఏడుపు వచ్చేస్తుంది. ఎలాగ ఇతనికి ధైర్యం చెప్పి వోదార్చడం? ఎప్పటికోగాని రామచంద్రరావుకి స్పృహ రాలేదు. అతడు కదలడం మొదలుపెట్టాడు. మూర్తి గుండెలు కొట్టుకున్నాయి దుఃఖంతో ఆనందావేశంతో. రామచంద్రరావు కళ్లు తెరిచాడు. ఓ నిముషం తదేకంగా మూర్తికేసి చూశాడు. ‘బతికే ఉన్నానా’ అంటూ నవ్వాడు. సన్నని చిన్నని నవ్వు హాయిగా మొగ్గవిడి తెల్లని పువ్వు రేకులను విచ్చుకుంటూన్నట్టు. మూర్తి ‘షాక్’ తిన్నాడు. అలాంటి విపత్సమయంలో కూడా అతను నవ్వగలడని అనుకోలేకపోయాడు. తర్వాతి రోజున మాటల సందర్భంలో అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మూర్తి అన్నాడు... ‘‘రామం నీవు పెళ్లి చేసుకోవాలి. ఇటువంటి సమయంలో నీకు భార్య ఉంటే ఎంత పరిచర్య చేసేది? ఇలా వొంటరిగా ఎన్నాళ్లు ఉంటావు?’’ రామచంద్రరావు జవాబుగా - నవ్వాడు. సరళ కనుక అంగీకరించి వుంటే రామచంద్రరావుకి యీ వొంటరితనం ఉండేది కాదు. సరళ రామచంద్రరావుకి దూరపు బంధువుల అమ్మాయి. సన్నగా నాజూకుగా ఉంటుంది. ఆమె కళ్లల్లో తెలివైన వెలుతురు ఉంది. సరళా రామచంద్రరావూ కలిసి చదువుకున్నారు. అప్పుడే వారిద్దరికీ స్నేహం కలిసింది. ఆ స్నేహం ప్రేమగా మారినట్లు కూడా మూర్తికి తెలుసును. రామచంద్రరావు మూర్తితో అన్ని సంగతులూ చెప్పేవాడు. ఆమె తనని తప్పకుండా పెళ్లి చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రకటించేవాడు. సరళ తల్లిదండ్రులు కూడా ఏనాడూ వీరిరువురి స్నేహానికీ అభ్యంతరం చెప్పలేదు. సరళ తల్లిదండ్రులు కలవారు. సరళ ఒక్కర్తే వారి సంతానం. రామచంద్రరావుకి సరళతో పెళ్లి జరగాలనీ, దానితో అతని వొంటరితనమూ ఆర్థిక సమస్యా రెండూ తీరి సుఖిస్తాడనీ నిజమైన నిర్మలమైన స్నేహితుడైన మూర్తి ఎంతో ఆశించేవాడు. ‘‘రామం నువ్వెప్పుడైనా ఆమె అభిప్రాయం తెలుసుకున్నావా?’’ అని అడిగాడు మూర్తి, రామచంద్రరావుకి ఉద్యోగం వచ్చిన రోజున. ‘‘సమయం రానీ’’ అన్నాడు రామచంద్రరావు. రెండు మూడు నెలల అనంతరం సరళా రామచంద్రరావులు పార్కులో కలుసుకున్నారు. విద్యుద్దీపాల కాంతీ, సప్తమి వెన్నెలా కలసి వీరు కూర్చున్న బెంచీమీద విచిత్రంగా పడింది. రామచంద్రరావు, తన మనస్సులోని అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు. కాని ఆ క్షణాన సరళ వివేకం ఆమె హృదయ దౌర్భల్యాన్ని జయించింది. ‘‘రామం, నీ ఆస్తి ఎంత?’’ అని అడిగింది. ‘‘ఒక పాత పెంకుటిల్లు, అదైనా మా వుళ్లో ఉంది’’ అన్నాడు రామచంద్రరావు. ‘‘భూమి గట్రా ఏమైనా...’’ అని ప్రశ్నించింది సరళ. ‘‘సెంటు భూమి కూడా లేదు’’ అని కులాసాగా జవాబు చెప్పాడు రామచంద్రరావు. ‘‘నీ జీతం ఎంత?’’ అని అడిగింది సరళ. ‘‘నూట యిరవై రూపాయలు’’ అన్నాడు రామం. సరళ నిట్టూర్చింది. ఆమె తన సాధక బాధకాలు, అవసరాలు, అలవాట్లూ తన తల్లిదండ్రుల కనీసపు కోర్కెలు అన్నీ చెప్పింది. చివరికి ప్రేమా యిష్టమూ మొదలైన దౌర్భల్యానికి లోబడి తన సుఖాన్నీ భద్రతనీ బలి యిచ్చుకోలేనంది. ‘‘నువ్వంటే నాకెప్పుడూ యిష్టమే, కాని నా జాగ్రత్తలో నేనుండాలిగా’’ అంది. పార్కులోంచి రామచంద్రరావు యివతలకి రాగానే మూర్తి ఎదురై ‘‘ఏమైంది, ఏమైంది’’ అని ఆతృతగా అడిగాడు. ‘‘నిరాకరించింది’’ అన్నాడు రామచంద్రరావు. మూర్తికి కోపం వచ్చింది రామచంద్రరావు మీద. అతనంత తాపీగా జవాబు చెప్పినందుకు కాదు, అతని పెదాల మీద నిశ్చలంగా నిలిచిన చిరునవ్వుని చూసి. ఏ ప్రేమ వైఫల్యానికి మనుష్యులు ఆత్మహత్య చేసుకుంటారో, ఏకాంతంలో పడి ఏడ్చి ఏడ్చి కృశించిపోతారో ఇటువంటి దానికి హాయిగా నవ్వగలిగే యీ రామచంద్ర రావులోని విశేషం ఏమిటి? ఇంత కులాసా, యింత ధీమా ఎక్కడవి అని విస్తుబోయాడు మూర్తి. సరళకి వివాహమైంది. పెళ్లికి రామచంద్రరావు వెళ్లాడు. వెళ్లి నాలుగు రోజులూ యిటు ఆడపెళ్లివారితో, అటు మగపెళ్లివారితో కలుపుగోలుతనంగా తిరిగాడు. అత్తింటికి వెళుతూన్న సరళతో ‘‘నీ భర్త రూపసి, ఉత్తముడు కూడా. నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుతున్నాను. వచ్చే ఏడాదికి నువ్వు పాపాయినెత్తుకొని రావాలి సుమా’’ అన్నాడు. అతని స్నేహ స్నిగ్ధ కంఠ స్వరానికి సరళ హృదయం ఆర్ద్రమయింది. కృతజ్ఞతతో సిగ్గుతో ‘‘థాంక్సు’’ అంది. కాని రామచంద్రరావు మనసారా కోరిన అదృష్టం ఆమెను వరించలేదు. ఏడాదికే ఆమె విధవరాలై తిరిగి వచ్చింది. రామచంద్రరావు చూడటానికి వెళ్లాడు. ధైర్యం చెప్పాడు. అలాగే ప్రతిరోజూ వెళ్లి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు. ఆమె దుఃఖం నుండి కోలుకుంది. ఇంక ఇతని అవసరం తీరిందనుకున్న సరళ తండ్రి రామచంద్రరావుని చాటుగా పిలిచి ‘నువ్వు రోజూ యిలా రావడం బావుండదు. లోకం ఏదైనా అనుకుంటుంది’ అన్నాడు. రామచంద్రరావు నవ్వుతూ ‘మీరు చెప్పింది నిజమే ఇంక నేను రాను’ అని వెళ్లిపోయాడు. మళ్లీ సరళ దగ్గరకు ఎప్పుడూ వెళ్లలేదు. రామచంద్రరావు ఒక మూడు గదుల వాటా తీసుకొని అద్దెకు ఉంటున్నాడు. ఒక గది వంటగదిగా ఉపయోగించుకుని స్వయంగా వండుకు తింటాడు. తొమ్మిదింటికల్లా స్నానం చేసి భోజనం చేసి తెల్లని దుస్తులు వేసుకుని ఆఫీసుకు బయలుదేరతాడు. దారిలో కిళ్లీకొట్టు పోలయ్యనీ, ప్లీడరు రాఘవ రావుగారినీ, వెంకయ్య మాష్టారినీ, పెరుగమ్ముకుని బతికే గోవిందమ్మనీ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఆఫీసుకు వెళతాడు. ఆఫీసులో అందరూ అతని మిత్రులు. ఆఫీసరు కూడా రామ చంద్రరావంటే దయగా అభిమానంగా ఉంటాడు. కాని రామచంద్రరావుని దురదృష్టమే వరించింది. ఆఫీసు రిట్రెంచిమెంటులో పైవాళ్లు అతన్ని ఉద్యోగం నుండి తొలగించి వేశారు. మూర్తి చాలా ఆందోళన చెందాడు. ఇక మీద రామచంద్రరావుకి గడిచే విధానం లేదు. అయినా రామచంద్రరావు ఏమీ బెదిరిపోలేదు. పైగా మూర్తికి అతడు నవ్వుతూ ధైర్యం చెప్పాడు. ఉద్యోగం పోయిన రెండు రోజులకే రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్లాడు. ఓ నెల్లాళ్లపాటు అక్కడే ఉండి, అతని పాత పెంకుటి లోగిలి అమ్మివేసి, మూడు వేల రూపాయలు చేత్తో పట్టుకొని తిరిగి వచ్చాడు. ఈసారి పాత మూడు గదుల పోర్షన్ వదిలేసి ఒక గది అద్దెకు తీసుకున్నాడు. ఒక టైపు మిషన్ కొని, ‘ఇచ్చట టైపు చేయబడును’ అని బోర్డు కట్టాడు. ఈ మూడువేలూ ఎన్నాళ్లు వస్తుంది? ఈ టైపు వల్ల వచ్చే ఆదాయం ఏం సరిపోతుంది? నీ భవిష్యత్తు ఎలాగ? అని ఆతృత కనబరిచాడు మూర్తి. రామచంద్రరావు నవ్వాడు. ‘‘ఎవరి భవిష్యత్తు మాత్రం ఎవరు చెప్పగలరు మూర్తీ. మనం చేసుకున్న కట్టుదిట్టాలు నిజంగా రక్షిస్తాయా?’’ అన్నాడు. రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్లిన రోజులలో సరళ తండ్రి చనిపోయి నట్టూ, ఇంటి యాజమాన్యమంతా సుకుమారమైన సరళ మీద పడినట్టూ తెలుసుకున్నాడు. ఒకసారి సరళను చూసి వచ్చాడు. ఆరు నెలలు గడిచాయి. రామచంద్రరావుకి తీవ్రమైన జబ్బు చేసింది. పదిహేను రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టలేదు. మూర్తి భయపడ్డాడు. తిన్నగా సరళ యింటికి వెళ్లాడు. రామచంద్రరావు పరిస్థితి వివరించి చెప్పాడు. ‘‘మీరు అతని బాధ్యత వహించాలి. ఒకనాడు మీరు అతన్ని మోసగించారు. కాని అతను ఏనాడూ మిమ్మల్ని నిందించలేదు. డబ్బుతో ఏమైనా కొనవచ్చు గాని అటువంటి అమృత హృదయాన్ని పొందలేము. మృత్యుముఖంలో ఉన్న అతన్ని కనికరించండి. లోకం ఏమనుకుంటుందో అనుకొని సంశయించకండి. ఒక్కడూ ఆ చిన్నగదిలో చీకటిలో బాధతో, వ్యాధితో చితికిపోతున్నాడు. వివేకం కన్న, హేతువు కన్న హృదయ ధర్మం గొప్పది. ఈ సత్యాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకోరా’’ అని మూర్తి ప్రాధేయపడ్డాడు. అతను తల పెకైత్తి చూసేసరికి సరళ చెక్కిళ్లు కన్నీళ్లతో తడిసి ఉన్నాయ్. ‘‘పదండి నేనూ మీతో వస్తున్నాను’’ అంటూ సరళ ఎలా ఉన్నది అలా బయలుదేరింది. రామచంద్రరావుని జాగ్రత్తగా సరళ ఇంటికి మార్చారు. పక్కగదిలో డాక్టరు ‘ఇతను బతుకుతాడనే నమ్మకం లేద’ని చెప్పడం అప్పుడే మెలకువ వచ్చిన రామచంద్రరావుకి వినిపించింది. భయాందోళనతో కన్నీటితో సరళా, మూర్తీ రామచంద్రరావు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ‘‘నేను డాక్టరు చెప్పింది విన్నాను. దానికింత భయమెందుకు’’ అన్నాడు రామచంద్రరావు. అతని పెదవుల మీద చిరునవ్వు నిలిచి వుంది. కష్టాల్నీ బాధల్నీ చివరకు మృత్యువును కూడా లక్ష్యం చెయ్యని చిరునవ్వు. అంత ఆందోళనలోనూ ఆశ్చర్యచకితుడయ్యాడు మూర్తి. కాని రామచంద్రరావు సరళ సపరిచర్యలలో, మూర్తి నిరంతర సాన్నిధ్యంలో, పట్నం నుండి పిలిచిన పెద్ద డాక్టర్ల సహాయంతో వ్యాధి నుండి విముక్తుడయ్యాడు. సరళ అతన్ని తన యింట్లో ఉండిపొమ్మని కోరింది, పూర్తిగా ఆరోగ్యం కోలుకునేవరకూ. మూడు నెలల అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతుడైన రామచంద్రరావు తన కృతజ్ఞతను తెలియజేసి వెళ్లిపోతానన్నాడు. ‘‘నా గదికి వెళ్లిపోతాను మళ్లీ టైపు మొదలుపెట్టాలి. సెలవిప్పించు’’ అన్నాడు. ‘‘అయితే నేనూ వస్తాను. ఆ ఒక్క గదిలో మనమిద్దరమూ ఎలా ఉండడం?’’ అంది సరళ. ‘‘నువ్వు రావడమేమిటి? నాతో ఉండడమేమిటి?’’ అన్నాడు రామచంద్రరావు తెల్లబోయి. ‘‘మరి భార్య భర్తను వదిలి ఉంటుందా?’’ అంది సరళ తలవాల్చి వోరగా చూస్తూ. ఈసారి నిజంగా రామచంద్రరావు సిగ్గుపడి పోయాడు. అతను తెప్పరిల్లి చటుక్కున ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. సరళా రామచంద్రరావుల వివాహం నిరాడంబరంగా జరిగింది. మూర్తి ఉత్సాహానికి పట్టపగ్గాల్లేవు. మొదటి రాత్రి రామచంద్రరావు జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ మృదువుగా అడిగింది సరళ... ‘‘మీరు ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. కారణం ఏమిటి నాకు చెప్పరూ?’’ రామచంద్రరావు కళ్లలో గతస్మృతుల నీడలు బరువుగా నల్లగా కదిలాయి. కిటికీలోంచి చీకట్లోకి అలాగ కొంతసేపు చూస్తూ నిలుచున్నాడు. అతని కంఠస్వరం గంభీరంగా మారిపోయింది. ‘‘నా పదహారవయేట నేను, మా అమ్మా, నాన్నా, మా చెల్లెలూ, తమ్ముడూ భద్రాచలం వెడుతున్నాము. నేను అనారోగ్యంతో సన్నగా నీరసంగా ఉండేవాణ్ని. ఎప్పుడేమయిపోతానో అని అమ్మా నాన్నా భయపడుతుండేవారు. భద్రాచల రాముని దర్శనంతో నేను ఆరోగ్యవంతుణ్ని అవుతానని వారి నమ్మకం. అందుకే భద్రాచలం వెడుతున్నాము. పాపికొండల దగ్గర హఠాత్తుగా మా పడవ బోల్తా కొట్టింది. కారణం ఏమిటో యిప్పటికీ నాకు తెలియదు. నేను స్పృహ లేకుండా ఒక ఒడ్డుకు కొట్టుకుపోయాను. తెలివి వచ్చేసరికి నా చుట్టూ జనం మూగి ఉన్నారు. మరికాస్త దూరంలో మా తల్లిదండ్రుల సోదర సోదరీ శవాలు పడివున్నాయి. వాళ్లందరూ చచ్చి పోయారు. ఒక్కసారిగా నేను దిక్కులేని వాడినయ్యాను. ఒక్కసారిగా అపార దుఃఖం నన్ను నిశ్చేష్టితుడ్ని చేసి వేసింది. గుండెలు పగిలిపోయినాయ్. మళ్లీ అదే నదిలో దూకి చచ్చిపోదామనుకున్నాను. కాని ఒక మెరుపులాగ నా మనస్సులో ఏదో మెరిసింది. ఈ సృష్టి ఈ జీవితము అంతా ఒక హాస్యం. దీనికి ఒక నియమమూ నిర్ణీత పద్ధతీ అంటూ లేవు. ఉన్నా మనకి తెలియదు. మనం తెలుసుకోలేము. ఎవరో తెర వెనుక నుండి మనల్ని యిలా ఆడిస్తున్నారు. ఇది పెద్ద జోక్ - నవ్వులాట. లేనిదే అనారోగ్యంతో ఎప్పుడేమవుతానో అన్న నేను బతకడమేవిటి? నిండు ఆరోగ్యంతో ఆశలతో ఉన్నవాళ్లు పోవడమేమిటి? ఈ అద్భుతమైన హాస్య నాటకములో నేనూ ఒక పాత్రని. కష్టాలకీ భయాలకీ రేపటి బాధలకి ఆందోళన చెందడం ఎంత తెలివితక్కువ సరళా? ఈ కాస్సేపటి బతుకునీ సంకుచితత్వంతో సందేహంతో ద్వేష విషంతో నింపుకోవడం ఎంత మూర్ఖత్వం సరళా.’’ ఈ మాటలకి సరళ చలించిపోయింది. విద్యుద్దీపాల కాంతిలో అతని కళ్లు చెమ్మగిల్లినట్లు అనిపించిందామెకు. అతన్ని గుండెలకు హత్తుకుని, ‘‘నేను నిన్ను వదలను రామం’’ అని ఆవేశంగా అంది. రామచంద్రరావు చల్లగా నవ్వాడు తెల్లని మల్లెపూవు విరిసినట్లు, స్వచ్ఛమైన హిమకరణం సూర్యరశ్మిలో మిలమిల మెరిసినట్టు. సరళకి అర్థమయింది - అతని నవ్వు వట్టి నవ్వు కాదని. అతని నవ్వు వెనకాల భయంకర విషాదముంది. వేదాంతం వుంది. కాని యీనాటి వరకూ మూర్తికి మాత్రం అతని నవ్వుకి కారణం తెలియదు పాపం!