'రాందేవ్ మా పర్మిషన్ తీసుకోలేదు'
న్యూఢిల్లీ: దేశంలో నూడుల్స్ వివాదం కొనసాగుతుండగానే ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తన సంస్థ తరుపున నూడుల్స్ ప్రారంభించారు. అది కూడా ఫుడ్ సేప్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోకుండానే. రాందేవ్ బాబా పతంజలి అట్టా నూడుల్స్, రాందేవ్ నూడుల్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
అయితే, ఈ నూడుల్స్ ఇప్పటి వరకు తమ అనుమతి తీసుకోలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ తెలిపారు. ఇసలు ఇప్పటి వరకు అలాంటి అనుమతి కోసం రాందేవ్ బాబా దరఖాస్తు కూడా చేసుకోలేదని అధికార వర్గాల సమాచారం. పైగా ఈ ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ అనుమతి పొందినట్లు ఉందని తెలిసింది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై దృష్టి సారించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ ఆశిష్ బహుగుణ తెలిపారు.
అనుమతి తీసుకున్నాం
పతంజలి నూడుల్స్ ఫుడ్ సేఫ్టి సంస్థ అనుమతి తీసుకోలేదని ఆరోపించగా తాము ఇదివరకే దాని అనుమతులు పొందామని, అన్ని నియమనిబంధనలు, ప్రమాణాలు పాటించామని పతంజలి అధికార ప్రతినిథి ఎస్ కే తిజర్వాలా అన్నారు.