Ramesh Jigajinagi
-
కర్ణాటకలో ‘చెడ్డీ’ వివాదం: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. హిజాబ్, హలాల్, అజాన్, వంటి వివాదాలతో అట్టుడికిన రాష్ట్రంలో తాజాగా మరో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రస్తుతం చెడ్డీ వార్ నడుస్తోంది. కాషాయపు నిక్కర్లు తగలబెడతామన్న కాంగ్రెస్ బెదిరింపులపై తాజాగా బీజేపీ ఎంపీ రమేష్ జిగజినాగి స్పందించారు. ఈ మేరకు హస్తం పార్టీపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెడ్డీలను ఊడగొట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటక జనాలు కూడా అదే పనిచేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే కాంగ్రెస్ నాయకులు పదే పదే చెడ్డీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లకు చెడ్డీ తప్ప మరేం కనిపించడం లేదని, అందుకే చడ్డీని పట్టుకొని లాగుతున్నారని విమర్శించారు. అసలు ఏంటి ఈ చడ్డీ వివాదం? కర్ణాటకలో విద్యా విధానానికి వ్యతిరేకంగా తుముకూరు జిల్లాలోని తిప్టూరులో ఈనెల 1వ తేదీన కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నిరసనలు చేపట్టింది. విద్యను కాషాయీకరణం చేశారని ఆరోపిస్తూ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు బీసీ నగేష్ ఇంటి ముందు ఖాకీ నిక్కర్లను తగలబెట్టడంతో చడ్డీ వివాదం ప్రారంభమైంది. అదే విధంగా ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా చెడ్డీలను తగుల బెట్టాలని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య పిలుపునిచ్చారు. సిద్ధూ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత రాజుకుంది. అయితే కాంగ్రెస్ విద్యార్థి విభాగం సభ్యులు తన ఇంట్లోకి చొరబడి నిప్పటించారని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ఆరోపించారు. ప్రభుత్వంపై దాడి చేసేందుకు మరే ఇతర కారణం లేకపోవడం వల్ల ‘చెడ్డీ కాల్చడం’ వంటి దిగజారుడు విన్యాసాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ చర్యలు చేపట్టింది. సిద్ధరామయ్య వ్యాఖ్యలకు నిరసనగా ఆర్ఎస్సెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున నిక్కర్ పార్సిళ్లను పంపుతున్నారు. అయితే, తమకు ఎటువంటి పార్సిళ్లు అందలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. చదవండి: పల్లె రఘునాథరెడ్డి నుంచి నుంచి ప్రాణహాని -
ప్రజాభాగస్వామ్యంతోనే అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: జనాభా నియంత్రణతోనే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర తాగునీరు, పారిశుధ్య నిర్వహణ శాఖ సహాయ మంత్రి రమేశ్ జిగజినాగి అన్నారు. ప్రభుత్వంతో ప్రజలు కలిసిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరాలు, పట్టణాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల పాత్ర ఎక్కువగా ఉండాలని అన్నారు. ‘సబ్కా సాత్– సబ్కా వికాస్’నినాదంతో పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ‘ఐడియాస్ కాన్క్లేవ్ ఫర్ బెటర్ హైదరాబాద్’అనే అంశంపై అవేర్నెస్ ఇన్ యాక్షన్ సంస్థ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును కేంద్ర మంత్రి రమేశ్ శనివారం హైదరాబాద్‌లోని సెస్ ఆడిటోరియంలో ప్రారంభించారు. పట్టణ రవాణా, గృహ నిర్మాణం, రహదారులు, పట్టణ ప్రణాళిక, నాణ్యమైన విద్య, నిరంతర కరెంటు సరఫరా, మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థ, బస్తీల అభివృద్ధి, ఊపాధితో కూడిన పారిశ్రామిక అభివృద్ధి, శాంతి భద్రతలు, ఆరోగ్యం–పోషకాహారం, పరిశభ్రమైన తాగునీరు, సుపరిపాలన, డిజిటలైజేషన్ వంటి అంశాలు హైదరాబాద్ అభి వృద్ధిలో కీలకంగా ఉంటాయని అన్నారు. ఈ రంగా ల్లో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలి పారు. కాగా, దేశవ్యాప్తంగా 83,677 కిలో మీటర్ల రహదారులను నిర్మిస్తున్నట్టు మంత్రి చెప్పారు. 2022 వరకు ఈ కార్యక్రమాన్ని ముగించేందుకు ప్రతీరోజు సగటున 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.458.12 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, అవేర్నెస్ ఇన్ యాక్షన్ ప్రతినిధులు దినేశ్‌కుమార్, ఎ.సతీశ్‌కుమార్, ఎం.మాధవి, టి.వి.బుచ్చి బాబు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం.. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమని, ప్రధాని నరేంద్ర మోదీ తరచూ ఈ పథకం గురించి తమ దగ్గర ప్రస్తావిస్తుంటారని కేంద్ర మం త్రి రమేశ్ జిగజినాగి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఏకకాలంలో తాగునీరు అందించడం దేశంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో తాగునీరు, పారిశుధ్య పథకాలపై మంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ‘భగీరథ’పనులను చూడాలనుకుంటున్నానని, పార్లమెంటు సమావేశాల తర్వాత కచ్చితంగా వస్తానని చెప్పారు. -
కేంద్ర నిధులు మళ్లిస్తున్నారు
కేంద్ర మంత్రి రమేశ్ జిగాజినాగి సాక్షి, కామారెడ్డి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోగా, వాటిని దారి మళ్లిస్తోందని కేంద్ర తాగునీరు, స్వచ్ఛత శాఖల మంత్రి రమేశ్ జిగాజినాగి ఆరోపించారు. సోమవారం బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం కామారెడ్డిలో జరిగింది. కార్యక్రమంలో రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వచ్చే ఏడాది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని పేర్కొన్నారు.