Ramesh Reddy Valluru
-
రాష్ట్రాభివృద్ధికి ఎన్నారైల బాసట
గుంటూరు ఎడ్యుకేషన్: గత పాలకుల కబంధ హస్తాలు, కులాల కుంపట్లతో దిగజారిన ప్రవాస భారతీయుల ప్రతిష్ట పునరుద్ధరణ, ఏపీ అభివృద్ధికి స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణలో ప్రధాన భూమిక పోషించి రాష్ట్రాభివృద్ధిలో సీఎం వైఎస్ జగన్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాషింగ్టన్ డీసీకి చెందిన ఎన్నారై వల్లూరి రమేష్‌రెడ్డి తెలిపారు. గుంటూరు అమరావతి రోడ్డులోని అవర్ స్టేట్ అవర్ లీడర్, వైఎస్సార్ ఇంటెలెక్చు్యవల్ ఫో రం సంయుక్త ఆధ్వర్యంలో ‘సుపరిపాలన ప్రస్థానంలో రెండేళ్లు–సవాళ్లు–సాఫల్యాలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర’ అంశంపై ఎన్నారైలతో సోమవారం ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. అమెరికా నుంచి వల్లూరి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఅభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. వ్యాపార భాగస్వామ్యాలతో ఎన్నారైలు రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఫ్రాన్స్‌కు చెందిన జి.రాహుల్ సూచించారు. పచ్చ మీడియా పోకడలను తిప్పికొట్టాలి మరో ఎన్నారై బొమ్మిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో వైఎస్ జగన్ సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఎన్నారైలతో పాటు విదేశీ ప్రతినిధులు సైతం గమనిస్తున్నారని చెప్పారు. అలాగే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతున్న పచ్చ మీడియా పిచ్చిపోకడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా విభాగానికి ఎన్నారైల తోడ్పాటు అవసరమని రామిరెడ్డి చెప్పారు. ఏపీ ఎన్నారై రీజనల్ కో–ఆరి్డనేటర్ కూచిబొట్ల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏపీఎన్ఆర్టీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాల కల్పనలో ఎన్నారైలు భాగస్వాములవుతారని హామీ ఇచ్చారు. ఎన్నారైలు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి గుంటూరుకు చెందిన వెంకట్ ఇక్కుర్తి మాట్లాడుతూ.. కాల్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు, పరిశోధనలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నారైలు కీలక భూమిక నిర్వర్తించాలని సూచించారు. నాలెడ్జ్, కల్చరల్ ఎక్సే్ఛంజ్‌ను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో కీలకమైన శాస్త్ర, సాంకేతిక జ్ఞానాన్ని అందించాలన్నారు. సమావేశంలో ఏఎన్‌యూ ప్రొఫెసర్ మధుబాబు, డాక్టర్ వైఎస్ థామస్‌రెడ్డి, కాపిరెడ్డి కృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని వర్జీనియాలో ప్రార్థనలు
వాషింగ్టన్ డీసీ : విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం నుంచి గాయంతో బయటపడిన వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని వాషింగ్టన్ డీసీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ విభాగం వర్జీనియాలోని లోటస్ టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజా సంకల్పయాత్ర నిర్విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని దేవుని ప్రార్ధించారు. సురేన్ బత్తినపట్ల మాట్లాడుతూ ఈ దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు మరీ ఘోరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహనలేని మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకుంటే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. . వైఎస్సార్సీపీ సలహాదారు (యుఎస్ఏ), రీజనల్ ఇంఛార్జ్(మిడ్ అట్లాంటిక్) వల్లూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మెండుగా ప్రజాదరణ కలిగిన నేతకు రక్షణ కల్పించలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. విమానాశ్రయంలో రక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని ఏపీ మంత్రులు తలా తోక లేకుండా పిచ్చి పట్టినట్టు మాట్లాడటం దారుణమన్నారు. వైఎస్ జగన్‌పై దాడి పిరికిపంద చర్య అన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలి అని పేర్కొన్నారు. కోట్లాది అభిమానుల ఆశీర్వాద బలం, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో వైఎస్ జగన్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించే దయా గుణం లేనివారు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల దౌర్భగ్యమని శశాంక్ అరమడక అన్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రుల వాఖ్యలను శ్రీనివాస్ సోమవారపు తీవ్రంగా ఖండించారు. వారు మానవత విలువలను మరవవద్దని హితబోధ చేశారు. ఓ ప్రతిపక్ష నాయకునికి భద్రత కల్పించలేని ప్రభుత్వము సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని శ్రీధర్ నాగిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్యంగా ఉండాలని, ప్రజా సంకల్ప యాత్ర నిర్విఘ్నంగా సాగాలని, సకల రాజకీయ విఘ్నాలు తొలగిపోవాలని జె జొన్నల గుమ్మడి కాయతో దిష్టి తీశారు. ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడికి చంద్రబాబు బాధ్యత వహించకపోగా, ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతా రహితంగా మీడియాతో మాట్లాడి ఆయన దిగజారుడు తనాన్ని బయట పెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ వాషింగ్టన్ డీసీ ఏరియా విభాగం ఆధ్వర్యం లో నిర్వహించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎన్నికల సమయంలో అమెరికా నుండి మూడు నెలల ముందుగా పెద్ద సంఖ్యలో అభిమానులు తమ సొంత ప్రాంతాలకు తరలి వచ్చి ప్రచారంలో పాల్గొనబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమములో సురేంద్ర బత్తినపట్ల, శ్రీనివాస్ సోమవారపు, రమేష్ రెడ్డి వల్లూరు, అంజిరెడ్డి దొందేటి, జె జొన్నల, శశాంక్ అరమడక, శ్రీనివాస్ సిద్దినేని, జనార్దన్ జంపాల, వెంకట్ కొండపోలు, కిరణ్ ఎల్వీ, సురేష్ అల్లూరి, మధు మోతాటి, శివ ఆమంచర్ల, శ్రీనివాస్ ఆవుల, రఘు నరాల, చంద్రహాస్ జొన్నల, సతీష్ నరాల, శ్రీధర్ నాగిరెడ్డి, మల్లిఖార్జున్ కలకోటి, శివ సైనెని, సత్య పాటిల్, సురేష్ కొత్తింటి, నాగార్జున శ్యామల, పున్నం జొన్నల, ఆనంద్ సాగర్, చిన్ని రెడ్డిగారి, నరేంద్ర ఏలూరు, జీవన్, వేణు జంగా, కడప రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
'జగన్ ఫైటర్.. చంద్రబాబు ఛీటర్'
ఆస్టిన్ (టెక్సాస్): ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలను అమలు చేయాలని 4 ఏళ్లుగా కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్, మిడ్ అట్లాంటిక్ రీజియన్ ఇంచార్జ్ వల్లూరు రమేష్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్న తీరు 'తన కంపు తనకిష్టం.. పరుల కంపు పాపిష్టి కంపు' చందంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, అందరినీ వంచించారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే విశ్వసనీయతకు ప్రతీక అన్నారు. జగన్ ఫైటర్ అయితే చంద్రబాబు ఛీటర్ అని వల్లూరు రమేష్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఈనెల ౩౦న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలపనున్న విషయం తెలిసిందే. దీనికి మద్దతుగా అమెరికాలో వైఎస్సార్సీసీ కార్యకర్తలు ఆస్టిన్‌లో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కార్యకర్తలు చేతిలో ప్లకార్డులు పట్టుకొని ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. ప్రత్యేక హోదాని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా తాము ఈ నిరసన చేపట్టినట్లు వైఎస్సార్సీపీ ఎన్ఆర్లు పేర్కొన్నారు. మహానేత స్ఫూర్తితో వైఎస్సార్సీపీని వైఎస్ జగన్ స్థాపించారని, వైఎస్సార్ ఆశయ సాధనకు వైఎస్ జగన్ నాయకత్వంలో సైనికుల్లా పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా 13 సార్లు హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టి, అప్పటికీ కేంద్రం దిగి రాకపోవడంతో, వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. ఈ నెల ౩౦న జరగనున్న వంచన దినం సందర్భంగా దీక్షకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని దీక్షను విజయవంతం చేయాలనీ విన్నవించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ నేతలు అన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని, వైఎస్సార్సీపీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వల్లూరు రమేష్ రెడ్డి, చింతగుంట సుబ్బారెడ్డి, బల్లాడ రవి, ఎదురు పుల్లారెడ్డి, నంగి పరమేశ్వర్ రెడ్డి, ద్వారసాల కొండారెడ్డి, గూడూరు అశోక్, స్వదీప్ రెడ్డి, ముట్లూరు సచిన్, బండ్లపల్లి మురళి, మండపాటి సుధాకర్, అస్వపాటి కుమార్, ఆరేకూటి మోహన్ రెడ్డి, ఆవుల మల్లికార్జున్ రెడ్డి, గండ్ర నారాయణ రెడ్డి, వుమ్మ వెంకట్రాం రెడ్డి, లక్కు బ్రహ్మేంద్ర, లక్కిరెడ్డి ప్రదీప్, బోయపల్లె అనంత్, గడికోప్పుల నర్సిరెడ్డి, కంబం దేవేందర్, వసంత రెడ్డి, నామాల వెంకట్, సామల మధు, కడిపికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో మహానేత వైఎస్ఆర్కి ఘన నివాళి
-
అమెరికాలో వైఎస్ఆర్కి ఘన నివాళి
వాషింగ్టన్ డి.సి (వర్జీనియా) : ప్రజల నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎనిమిదో వర్ధంతి సందర్బంగా జోహార్ వైఎస్సార్... జోహార్ వైఎస్సార్ నినాదాలతో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ దద్దరిల్లింది. ప్రియతమ నేత వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు వర్జీనియాలోని బంజారా ఇండియన్ కుసైన్ లో సమావేశమై ఆ మహనీయుడికి ఘన నివాళుర్పించారు వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్, మిడ్ అట్లాంటిక్ రీజియన్ కో-ఆర్డినేటర్ వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఏపీ నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. మొదట మహానేత వైఎస్ఆర్ చిత్ర పటం ముందు దివ్యలు వెలిగించి, పుష్పగుచ్చం సమర్పించి, మౌనము పాటించారు. అనంతరం ముఖ్యఅతిథులు వేణు జంగా, అమర్ కటిక రెడ్డి, రాంగోపాల్ దేవపట్ల, క్రిష్ణారెడ్డి చాగంటి, ప్రసన్న కాకుమానిని సత్కరించారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కరిగిపోయే కాలం వెంట చెరిగిపోని నీ చిరునవ్వు సాక్షిగా రాజన్న సువర్ణ రాజ్యాన్ని సాధించుకోవడమే మా తెలుగు ప్రజలు నీకిచ్చే నిజమైన నివాళి’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉందని, వైఎస్ఆర్ సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రజలు చూశారు గనుకే ఇకపైన కూడా అలాంటి నేతలే రావాలని, కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమౌతుందన్నారు. అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అంటూ ఇప్పటికే ప్రజల్లో బాగా బలపడిందని ప్రజల జీవితాలకు నవరత్నాలు భరోసా కల్పిస్తాయని విశ్వాసం ఉందని తెలిపారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఒక జన్మ సరిపోదు అంటూ ‘అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఎన్ని రోజులు బితికామన్నది ముఖ్యం కాదు. జన్మనిచ్చిన మాతృభూమికి ఎంత మేలు చేసామన్నది ముఖ్యమనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించిన ఒకే ఒక్క నేత డాక్టర్ వైఎస్ఆర్ అని’ పేర్కొన్నారు. ఎందరో సీఎంలు వచ్చారు, పోయారు. కానీ దేశ రాజకీయ పటంపై హిమశిఖర సదృశంగా సమున్నతమైన వ్యక్తిగా భాసిల్లిన మహా వ్యక్తిత్వం వైఎస్ఆర్ దని, ఎదిగిన కొద్దీ ఒదగమనే నీ నైజం, ప్రతి తెలుగువాడి ముఖాన చిరునవ్వు చూడాలన్నది నీ ఆశయం తప్పక నెరవేరుతుందన్నారు. నవ్యాంధ్రలోని ప్రజలందరి కుటుంబ సభ్యుడిగా, రైతులకు, పేదలకు సమాజంలోని అన్ని సామాజిక వర్గాల వారికి అండగా, భరోసా ఇచ్చే అన్నగా, అందరితో మమేకమవుతూ త్వరలోనే రాష్ట్రంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో కుటుంబాలకు వెలుగు నిచ్చిన దీపం లాంటివని, ఈ ప్రపంచం ఉన్నంత కాలం తెలుగు ప్రజలు గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచి పోతారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు రాష్ట్ర ప్రజలందరికీ భరోసా కల్పించనున్నాయి, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. వైఎస్ఆర్ సీపీ అమెరికా కో-కన్వినర్ రత్నాకర్ పండుగాయల మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. వైఎస్ఆర్ వెళుతూ వెళుతూ ఆయన నిలువెత్తు రూపం లాంటి జగనన్నని మనకు ఇచ్చి వెళ్లారని చెప్పారు. జగనన్నని ముఖ్యమంత్రిని చేసేవరకు వైఎస్ఆర్ అమెరికా కమిటీ విభాగం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు వస్తుందన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన సభికుల నుండి పలువురు వక్తలు వైఎస్ఆర్తో తమ సాన్నిహిత్యం, తెలుగు రాష్ట్రాలకు వైఎస్ఆర్ అందించిన సంక్షేమ పథకాలు తెలుపుతూ రాజశేఖరరెడ్డిని స్మరించుకున్నారు. వందలాది మంది ప్రవాసాంధ్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. సత్తిరాజు సోమేశ్వర రావు, సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, శ్రీధర్ నాగిరెడ్డి, మధుసూధన రెడ్డి పోళ్లుచల్లా, తదితరులు ఆంధ్ర జగతి సిగలో వైఎస్ఆర్ సీపీ పతాకాన్ని చిరస్థాయిగా నిలపడమే వైఎస్ఆర్ కు నిజమైన నివాళి అన్నారు. అధికార టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలగించడం కోసం వైఎస్ జగన్ తొమ్మిది పథకాలు ప్రకటించారన్నారు. ఈ పథకాల ద్వారా పేదలు, మహిళలు, రైతులు, విద్యార్ధులుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. వర్జీనియా, మేరీలాండ్, వాషింగ్టన్ డీసీ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు వైఎస్ రాజశేఖరరెడ్డి అమర్ రహే.. జై జగన్ అంటూ నినాదాలతో సందడి చేశారు. చివరగా వందన సమర్పణలో భాగంగా ‘జగన్ కోసం మేము సైతం’ అంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతికి తరలివచ్చిన ప్రతి వైఎస్ఆర్ కుటుంబం" సభ్యులకు హృదయ పూర్వకమైన ధన్యవాదాలు తెలుపడంతో రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంస్మరణ దినోత్సవం ముగిసింది. అందరూ ఒక్కటై చక్కటి భోజనంతో రాజన్న జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. -
వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్ వర్థంతి సభ
వాషింగ్టన్ డీసీ: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్థంతి సభను సెప్టెంబర్ నెల 4వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ద లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వర్జీనియాలోని బంజారా ఇండియన్ కుసిన్ లో వర్ధంతి సభ నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ అడ్వైజర్ కమ్ రీజనల్ ఇన్ ఛార్జ్ (మిడ్ అట్లాంటిక్) రమేష్ రెడ్డి వల్లూరు తెలిపారు. చిరునవ్వు చెరగని ముఖం. మడత నలగని పంచె కట్టు. నేనున్నానని భరోసా కలిగించే మాటతీరు. ఆరునూరైనా మాటపై నిలబడే వ్యక్తిత్వం. ఒక్కమాటలో తెలుగుదనానికి నిలువెత్తు సంతకం. మనిషి మరణించాక కూడా బతికే ఉండాలని నమ్మిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. డాక్టర్ వైఎస్ఆర్ మరణించి ఎనిమిదేళ్లు గడిచిన ఆయన జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువు తీరాయని వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని వారు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేసిన వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడిచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రజల అండతో 2019లో వైఎస్ఆర్ సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ఎన్నారైలు ధీమా వ్యక్తం చేశారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు బెబుతున్నారు. పరిపాలన దక్షతకు, రాజనీతిజ్ఞతకు మహానేత వైఎస్ఆర్ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వీరందరి నుంచి నేటికి దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ నిత్య నీరాజనాలు అందుకుంటున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్థంతి - ప్రతి ఇంటికీ ‘వైయస్ఆర్ కుటుంబం’ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్థంతి సందర్భంగా గ్రేటర్ వాషింగ్టన్ వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులకు, అందరికీ ప్రత్యేక ఆహ్వానము పంపారు. ఆంధ్రుల ఆత్మీయ బంధువు గగనానికి ఎగసి నింగిలో తారై నిలుచున్న ఆ సంఘటన ప్రతిరోజు మన హృదయాలను కలిచివేస్తుంది. మరిచిపోలేక మౌనంగా మనల్ని వేధిస్తూ ఉంటుంది. మనసున్న మహరాజు మన మధ్య లేకున్న ఆ తీపి గుర్తులు మనకు మహా మనిషిని గుర్తు చేస్తున్నట్లుగా, అమెరికా వారికి 9/11 , ఆంధ్రా వారికి 9/2 చరిత్రలో మరపురాని దుర్ధినాలు. జన హృదయ నేత రాజశేఖర రెడ్డికి, ఆయనతో పాటు తనువు చాలించిన ఆత్మీయ బంధువులకు, ఘన నివాళులు అర్పించడానికి అభిమానులందరు వేలాదిగ తరలివచ్చి వైఎస్ఆర్ ఎనిమిదో వర్ధంతి సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ యుఎస్ఏ కమిటీ, రాజశేఖర రెడ్డి అభిమాన సంఘం పిలుపునిచ్చింది. -
చికాగోలో వైఎస్సార్ జయంతి వేడుకలపై నేతల భేటీ
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రము చికాగో నగరములో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించారు. ఆటా వేడుకలలో భాగంగా మహానేత వైఎస్సార్ జయంతి భవిష్యత్ ప్రణాళికపై అమెరికా వైఎస్సార్ సీపీ కమిటీ భేటీ అయింది. అమెరికాలో వైఎస్ఆర్ సీపీ సలహాదారు, రీజనల్ ఇంచార్జి రమేష్ రెడ్డి వల్లూరు, ఇంచార్జి హరిప్రసాద్ లింగాల, కన్వీనర్లు రత్నాకర్ పండుగాయల, రాజశేఖర్ కేశిరెడ్డి, మధులిక, స్టూడెంట్ వింగ్ లీడర్ సాత్విక్ రెడ్డి గోకులముడి, చికాగో సిటీ ఇంచార్జి ఆర్ వెంకటేశ్వర రెడ్డి ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల భేటీ జరిగింది. ఈ సభకు ఆటా 25వ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్కే రోజా, గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభకు వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆర్గనైజర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ కమిటీ చికాగో సిటీ ఇన్చార్జ్ ఆర్ వెంకేటశ్వర రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉందని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రజలు చూశారు, దాంతో ఇకపైన కూడా అలాంటి నాయకులే రావాలని, కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమౌతుందని నేతలు పేర్కొన్నారు. ‘ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నప్పుడు ఒక రాజకీయవేత్త రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు’ అని, అలాంటి వ్యక్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారని కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గత రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమవడమే కాక, యథేచ్ఛగా దోపిడీని సాగిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న ‘గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధనబలంతో రాజకీయం చేయాలనుకుంటున్న చంద్రబాబును నిలువరించాలంటే వైఎస్సార్సీపీ నిత్యం జనంతో మమేకం కావాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై దాదాపు ఏడేళ్లు గడుస్తున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారన్నారు. వైయస్సార్ అడుగుజాడల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారన్నారు. వైఎస్సార్ జయంతిని చూసి ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని చెప్పారు. పార్టీ నిర్మాణ పరంగా బలమైన అడుగులు వేసేందుకు ఈ జయంతి కార్యక్రమం ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలని సూచించారు. దుష్టశిక్షణా, శిష్టరక్షణా చేసేందుకు ఆనాడు శ్రీ కృష్ణుడు రథసారధిగా యుద్ధాన్ని ముందుండి నడిపించాడు, తెలుగుదేశం అరాచకాలను ఎండగట్టేందుకు , ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఈనాడు ప్రజలే సారధులుగా సమరాన్ని సాగిస్తున్నారు. ఈ దరిద్రపు పాలన మాకొద్దు అంటూ జగనన్నతో కలసి సమరభేరి మోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. దొంగహామీలు, మాయమాటలతో మనల్ని మోసం చేసిన ఈ దుష్ట పచ్చ కౌరవులను, వారి పచ్చ రాజ్యాన్ని 'వైఎస్ జగన్' అనే వజ్రాయుధ సాయంతో కూకటివేళ్లతో పెకలించివేద్దాం' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు, పలు రాష్టాల నుంచి విచ్చేసిన తెలుగువారు, విద్యార్థులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.