rameswar rao
-
నాలాలు, వరద నీటి కాలువల శుభ్రతపై దృష్టి సారించాలి
రాయదుర్గం: పట్టణ ప్రాంతాల్లో నిత్యం నాలాలు, వరద నీటి కాలువలను శుభ్రం చేసే అంశంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి చారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ‘ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ... ప్రస్తుతం పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో రోడ్లపైకి మురుగునీరు, వర్షపునీరు రాకుండా శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్షపు నీటిని చాలా వరకు భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని కూడా పేర్నొన్నారు. అన్ని విభాగాల వారు సమష్టిగా చర్యలు చేపడితే దాదాపు అన్ని సమస్యలు తీరేందుకు అవకాశం ఉంటుందన్నారు. తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలిస్తే వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తే చాలా వరకు సమస్యలు తీరేందుకు ఆస్కారం ఉందన్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కరుణాగోపాల్, రీ సస్టేనబిలిటీ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పి.జి.శాస్త్రి, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ కె.కిషన్, జేఎన్టీయూఏ వాటర్ రిసోర్సెస్ హెచ్ఓడీ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.గిరిధర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.గోపాల్‌నాయక్, సిటీ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నర్సింగ్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రామేశ్వర్‌రావుకు సీఐఐ జీవిత సాఫల్య పురస్కారం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ టైకూన్, మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావును సీఐఐ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. గురువారం హెచ్ఐసీసీలో జరిగిన సీఐఐ గ్రీన్ సిమెంటెక్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. రామేశ్వర్రావు తరఫున ఆయన కుమారుడు వైస్ చైర్మన్ జూపల్లి రామురావు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వీడియో కాల్లో రామేశ్వర్రావు సీఐఐ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. -
ప్రతిష్టాత్మక ‘మై హోమ్ సయూక్’ ను లాంచ్ చేసిన స్టైలిష్‌స్టార్
సాక్షి, హైదరాబాద్: పాపులర్ రియల్ ఎస్టేట్ సంస్థ మై హోమ్ గ్రూప్ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. ‘మై హోమ్ సయూక్’ పేరుతో దీన్ని ప్రారంభించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. గోపనపల్లి-తెల్లాపూర్ రోడ్లో,ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలకు అత్యంత సమీపంలో మై హోమ్ సయూక్ ప్రాజెక్ట్. 12 టవర్లతో, 3780 ఫ్లాట్స్‌గా నిర్మించనున్నారు.మై హోమ్ సయూక్‌లో 6 టవర్ల కోసం బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో భాగం మై హోమ్ సయూక్, మైహోమ్ గ్రూప్ ప్రతిమ గ్రూప్‌ల ఉమ్మడి వెంచర్. హైదరాబాద్ సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విల్లా ప్రాజెక్ట్- ప్రిస్టిన్ ఎస్టేట్స్‌ను ప్రతిమ గ్రూప్ అభివృద్ది చేసింది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో తొలిదశలో మై హోమ్ సయూక్ 25.37 ఎకరాలలో జీ+39 ఫ్లోర్లతో ఉండటంతోపాటు, 82శాతం ఓపెన్ ఏరియాలను అందిస్తుంది. మొత్తం 12 టవర్లు కలిగి ఉండటంతో పాటుగా ఫ్లోర్‌కు 8 ఫ్లాట్స్‌తో ఇది వస్తుంది. వీటిలో 2, 2.5 3బీహెచ్‌కె ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్మెంట్లు 1355 చదరపు అడుగుల నుంచి 2262 చదరపు అడుగుల విస్తీర్ణంలో మై హోమ్ నుంచి సిగ్నేచర్ ఫ్లోర్ ప్లాన్స్‌తో ఉంటాయి. ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణలు • 7.5 ఎకరాలలో సెంట్రల్ ల్యాండ్‌స్కేప్ • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 5 నిమిషాల ప్రయాణం • ప్రతి టవర్‌కూ డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీ • ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ • రాబోతున్న ఇంటర్నేషనల్ స్కూల్, సయూక్ కు పక్కనే • 2 రూఫ్‌టాప్ టెన్నిస్ కోర్టులు • ఏసీ స్విమ్మింగ్ పూల్ ‘సౌకర్యవంతమైన జీవనం, అంతే సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాలలో, కమ్యూనిటీలకు అతి చేరువగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను మూడు దశాబ్దాలకు పైగా అభివృద్ధి చేస్తూ అగ్రగామిగా మై హోమ్ వెలుగొందుతోందని, దానికి కొనసాగింపే మై హోమ్ సయూక్’’ అని మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు వెల్లడించారు -
దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు: కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి గురువారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2017-18లో జరిపిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఈ విషయం స్పష్టం అయినట్లు చెప్పారు. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పెన్షన్ పథకం కింద డిసెంబర్ 9నాటికి దేశంలో 45.83 లక్షల మంది కార్మికులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ళ వయసు కలిగి ఉండి నెలసరి ఆదాయం 15 వేల రూపాయలు లోబడి ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, ఎన్పీఎస్ వంటి ప్రభుత్వ పథకాలలో సభ్యులుకాని వారు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పెన్షన్ పథకంలో చేరేందుకు ఆర్హులని మంత్రి వివరించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు నమోదైన 45 లక్షల మంది కార్మికులలో 31 లక్షల మంది కార్మికుల అకౌంట్లను ఆటో డెబిట్ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్‌తోపాటు ప్రపంచం అంతా ప్రభావితమైనందున ఈ పథకం కింద కార్మికుల నమోదు కూడా మందగించిందని అన్నారు. కార్మికులకు ఊరట కల్పించేందుకు కోవిడ్ కాలంలో ప్రీమియం చెల్లించని వారికి పెనాల్టీని ఎత్తివేసినట్లు చెప్పారు. చదవండి: సీఎం జగన్ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు ఏపీలో 32 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు భారత వాతావరణ విభాగం ఆంధ్రప్రదేశ్‌లో 32 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, 61 ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లను ఏర్పాటు చేసినట్లు శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో గురువారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 974 కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు తీరప్రాంతంలోనే ఉన్నాయి. ఉష్ణమండల తుపాన్లతో కోస్తా ప్రాంతం ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. పెనుతుపాన్లు, ప్రచండమైన గాలులతో ఏర్పడే జలవిలయం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో తరచుగా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని మంత్రి అన్నారు. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరం తుపాను సంబంధించిన విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్ల ముప్పు తప్పడం లేదని వివరించారు. చదవండి: ఏపీ లాసెట్: అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల -
ప్రధాని మోదీకి చినజీయర్ స్వామి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా.. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ప్రధాని మోదీని త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. శనివారం ఆయనతోపాటు మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామని, అందులో పాల్గొని 216 అడుగుల భగవద్ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు. భేటీ అనంతరం వివరాలతో ప్రకటన విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజుల మహావిగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారని అందులో తెలిపారు. ‘‘శ్రీరామానుజుల దివ్యత్వం ప్రధానికి తెలుసు. ఆయన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోట బురుజు నుంచి రామానుజుల వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సంరంభానికి రావాలని, 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని చినజీయర్ స్వామి ఆహ్వానించగా.. ప్రధాని మోదీ అంగీకరించారు. ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమంటూ..చినజీయర్ స్వామి సంకల్పాన్ని కొనియాడారు’’ అని వెల్లడించారు. పెద్దలందరికీ ఆహ్వానం ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీ ఇతర కేంద్రమంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లను చినజీయర్ స్వామి స్వయంగా కలిసి మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. 1,035 హోమగుండాలతో ప్రత్యేక యాగం ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1,035 హోమగుండాలతో ఈ యాగం చేస్తారు. 2 లక్షల కిలోల ఆవునెయ్యితోపాటు ఇతర హోమ ద్రవ్యాలను వినియోగించనున్నారు. చదవండి: 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు చూసి -
రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావా
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు దాఖలైంది. మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రామేశ్వర్ రావు స్టేట్మెంట్ను రికార్డు చేసిన కోర్టు... ఈ అంశంపై తగిన సమాధానం తెలియజేయాల్సిందిగా రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువైన రామేశ్వర్ రావుకి హైదరాబాద్‌లో భూములు కేటాయించడంపై రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ తనపై చేసిన ఆరోపణల వల్ల తన పరువు పోయిందని, అందుకు రేవంత్ రూ. 90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు లీగల్ నోటీసులు పంపించారు.