
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు దాఖలైంది. మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రామేశ్వర్ రావు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన కోర్టు... ఈ అంశంపై తగిన సమాధానం తెలియజేయాల్సిందిగా రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువైన రామేశ్వర్ రావుకి హైదరాబాద్‌లో భూములు కేటాయించడంపై రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ తనపై చేసిన ఆరోపణల వల్ల తన పరువు పోయిందని, అందుకు రేవంత్ రూ. 90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు లీగల్ నోటీసులు పంపించారు.