my home group
-
హైదరాబాద్‌లో తిరుగులేని రికార్ట్! ఒక్కరోజులోనే 1,125 సయూక్ ఫ్లాట్ల అమ్మకాలు!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోం అరుదైన ఫీట్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రియల్టీ సెక్టార్లో ఇంత వరకు ఏ సంస్థకు సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసింది. ఈ సంస్థ నూతనంగా ప్రారంభించిన మైహోం సయూక్ ప్రాజెక్ట్‌లో కనీవినీ ఎగురని స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. అమ్మకాలు ఆరంభమైన 24 గంటల వ్యవధిలోనే 1,125 ప్లాట్స్ బుక్ అయ్యాయి. వీటి విలువ రూ.1800 కోట్లు ఉంటుందని మైహోం సంస్థ తెలిపింది. తన రికార్డులు తానే రియల్టీలో మైంహోంకి ప్రత్యేక స్థానం ఉంది. 2016లో ఈ గ్రూపు నుంచి మైహోం అవతార్ ప్రాజెక్టును ప్రారంభిచారు. ఆ రోజుల్లో కేవలం 24 గంటల్లోనే వెయ్యికి పైగా ప్లాట్స్ బుక్ అవడం రికార్డుగా నిలిచింది. గడిచిన ఆరేళ్లుగా ఇదే సింగిల్ డే హయ్యస్ట్ బుకింగ్స్ రికార్డుగా కొనసాగుతోంది. తాజాగా సయూక్ 1,125 బుక్సింగ్స్‌తో అవతార్‌ను అధిగమించింది. రియల్టీలో తాను నెలకొల్పిన రికార్డులను తానే బ్రేక్ చేసింది మైహోం. నమ్మకానికి మరో పేరైన హైహోం ప్రారంభించిన ప్రాజెక్టులో ప్లాట్లు సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీ పడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. లగ్జరీకి కొత్త నిర్వచనం టీఎస్ రేరా నుంచి అన్ని అనుమతులు తీసుకుని మైహోం, ప్రతిమ గ్రూపులు సంయుక్తగా 25.37 ఎకరాల విస్తీర్ణంలో సయూక్ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్మెంట్లను దశల వారీగా నిర్మిస్తూ టౌన్షిప్ స్థాయిలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్ట్ సయూక్‌లో 2 బీహెచ్‌కే, 2.5 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవి 1355 చదరపు అడుగుల నుంచి 2262 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మాణం జరుపుకోబోతున్నాయి. మొత్తంగా 40 అంతస్థులతో నిర్మితమవుతున్న సయూక్‌లో లక్ష చదరపు అడుగుల క్లబ్ హౌజ్‌తో పాటు ఇతర లగ్జరీ సౌకర్యాలు కల్పించబోతున్నారు. మొత్తం 12 టవర్లలుగా నిర్మాణం జరుపుకుంటున్న సయూక్‌లో ప్రస్తుతం 6 టవర్లకు సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయి. ఒక్కసారి ఈ ప్రాజెక్టు పూర్తయితే లగ్జరీ లివింగ్ విత్ వాక్ టూ వర్క్ కల్చర్‌కి సరికొత్త నిర్వచనం ఇవ్వగలదు. వారి నమ్మకం వల్లే కష్టమర్లకు మా మీద ఉన్న అంచంచలమైన నమ్మకానికి ప్రతిరూపమే ఈ రికార్డు స్థాయి బుకింగ్స్‌కి కారణమని మైహోం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జూపల్లి శ్యామ్‌రావు అన్నారు. తొలి రోజు రికార్డు స్థాయి అమ్మకాల పట్ల సంతోషంగా ఉందని చెబుతూనే.. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన గడువులోగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలో నిర్మించిన ఇళ్లను కష్టమర్లకు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు శ్యామ్‌రావు. అదే విధంగా మైహోం చైర్మన్ డాక్టర్ రామేశ్వర్రావు, ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్న ప్రతిమా గ్రూపు చైర్మన్ ఎం శ్రీనివాస్‌రావులతో పాటు మైహోం కస్టమర్లకు, ఎంతో శ్రమించి పని చేస్తున్న తమ సంస్థ ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. (అడ్వర్టోరియల్) -
మై హోమ్ టర్నోవర్ రూ.6 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్స్ట్రక్షన్, సిమెంట్, ఎంటర్టైన్మెంట్, ఫార్మా రంగాలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మై హోమ్ గ్రూప్.. మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇందులో రూ.3 వేల కోట్లు కన్స్ట్రక్షన్స్, రూ.2,500 కోట్ల సిమెంట్.. మిగిలినవి ఎంటర్టైన్మెంట్, ఫార్మా విభాగాల వాటా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధిని సాధిస్తామని పేర్కొంది. మై హోమ్ కంపెనీ ప్రారంభమై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారమిక్కడ మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మై హోమ్ ఎండీ జూపల్లి శ్యామ్ రావు మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి 3.5 కోట్ల చదరపు అడుగులలో 25 ప్రాజెక్ట్‌లను డెలివరీ చేసిన ఘనతను సాధించనున్నామని.. ఇందులో ఇప్పటికే 2.7 కోట్ల చ.అ.లను డెలివరీ చేసేశామని.. మరొక 80 లక్షల చ.అ. నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. అనంతరం మైహోమ్ హోల్‌టైం డైరెక్టర్ జూపల్లి రాము రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం కోకాపేటలో 2.7 కోట్ల చ.అ.లలో ఆసియాలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్, సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్‌లతో పాటు బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం) 6డీ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనున్నామని చెప్పారు. అలాగే తెల్లాపూర్‌లో అంకుర పేరిట తొలి విల్లా ప్రాజెక్ట్‌ను, ఇదే ప్రాంతంలో త్రిదాస ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లను కూడా నిర్మిస్తున్నామన్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో ప్రాజెక్ట్ విజిటింగ్ నుంచి ఫ్లాట్ బుకింగ్, లావాదేవీలు చెల్లింపులు అన్నింటినీ ఆన్లైన్లోనే చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోల్ టైం డైరెక్టర్ జూపల్లి వినోద్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ జూపల్లి రజితా రావు, సీఎఫ్ఓ ఏ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త అవకాశాలొస్తాయి..
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావంతో కొన్ని రంగాలు నష్టపోయినా మరికొన్ని రంగాల్లో కొత్త అవకాశాలొస్తాయని, మాల్స్, షాప్స్ వంటి రిటైల్ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరడానికి 2 – 3 నెలల సమయం పట్టొచ్చని చెప్పారు మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఎండీ జూపల్లి శ్యామ్‌రావు. స్వల్ప కాలికంగా అన్ని రంగాల్లోనూ అభద్రత, సప్లై చెయిన్‌కు అంతరాయం వంటివి ఉన్నా, కొత్త వ్యాపారావకాశాలు తెరపైకి వస్తున్నా యని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలోనూ కొన్ని వ్యాపారాలు మరింత బలంగా, మెరుగ్గా తయారవుతున్నాయని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని స్థిరాస్తి, నిర్మాణరంగం స్థితిగతులపై ఆయన తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. కొత్త వ్యాపారాలు..అవకాశాలు వ్యాపారపరంగా మెరుగైన నగదు నిర్వహణ, ఖర్చును అదుపులో పెట్టుకుని ముందుకెళ్లే సంస్థలు మూడు నుంచి ఆరు నెలల్లో మార్కెట్లో మళ్లీ నిలదొక్కుకుంటాయి. లాక్‌డౌన్‌తో 90 శాతం మంది ఇంటి నుంచే పనిచేయడంతో మరింత విశాలమైన ఇళ్లుండాల్సిన అవసరం పెరిగింది. ఇకపై ట్రిపుల్ బెడ్రూం ఇళ్లకు డిమాండ్ పెరగొచ్చు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తుండటంతో త్వరలోనే గృహ నిర్మాణ రంగానికి ఊపు వస్తుంది. ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ కరోనా సంక్షోభానికి ముందు హైదరాబాద్‌లో కమర్షియల్ స్పేస్ వినియోగం రికార్డు స్థాయిలో ఉంది. గత 12 నెలల్లో ఆఫీస్ స్పేస్‌పరంగా బెంగళూరుకంటే హైదరాబాద్ 10 – 15 శాతం మేర వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్వల్పకాలంలో ఈ రంగంపై కరోనా ప్రభావం ఉన్నా దీర్ఘకాలంలో పుంజుకుంటాం. గతంలో ఒక్కో వ్యక్తికి 80 నుంచి వంద చదరపు అడుగులుగా ఉండే ఆఫీస్ స్పేస్... భౌతికదూరం వంటి అంశాలతో మరింత పెరగనుంది. గతంలో వెయ్యిమందికి లక్ష చదరపు అడుగులుంటే ప్రస్తుత పరిస్థితుల్లో లక్షన్నర అడుగులకు చేరవచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆఫీస్ స్పేస్ మరింత విశాలంగా ఉండాలనే అంశాన్ని ప్రస్తుత పరిస్థితుల నుంచి పెద్ద కంపెనీలు నేర్చుకున్నాయి. ‘రియల్’ రిటర్న్‌లు ఇల్లనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరం కాబట్టి దీనిపై కరోనా ప్రభావం పెద్దగా ఉండదు. పెట్టుబడుల కోణంలో చూస్తే రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్‌పై వచ్చినంత రిటర్న్‌లు మరే రంగంలోనూ రాలేదు. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిపై పెట్టుబడులు ఈ సంక్షోభంతో తుడిచిపెట్టుకుపోవడంతో అందులో పెట్టుబడులు పెట్టిన వారు ఆందోళనలో ఉన్నారు. రియల్టీ రంగం కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా ఏటా 8–10% వృద్ధిరేటును సాధిస్తూ వచ్చింది. నిర్మాణ రంగానికి మంచిరోజులు హైదరాబాద్ లో చదరపు అడుగు ధర రూ.4,500 నుంచి రూ.9 వేల వరకు ఉంది. బెంగళూరు, చెన్నై, ముంబైల్లో ఇది రూ.20 వేల నుంచి రూ.40వేలు. హైదరాబాద్‌లో భూమి లభ్యత, ఔటర్ రింగురోడ్డు, ఎక్కువ మంది ఎంట్రప్రెన్యూర్స్, డెవలపర్లు ఉండటం వంటి కారణాలతో ధరలు అందుబాటులో ఉన్నాయి. రెండు, మూడు నెలల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుని గృహ నిర్మాణానికి డిమాండ్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయనే భరోసాతో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఇతర రంగాల నుంచి పెట్టుబడులు ప్రవహించే అవకాశం ఉంది. జూలై నాటికి గాడిన పడతాం.. కరోనాతో రెండు నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రంగంలో 95 శాతం మంది వలస కార్మికులే. వీరంతా స్వస్థలాలకు వెళ్లేందుకు మొగ్గు చూపినా, రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వడంతో తిరిగి పనుల్లోకి వస్తున్నారు. ఇప్పటికే 70 –80 శాతం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జూలై నాటికి కరోనా సంక్షోభం తొలగి ప్రాజెక్టులన్నీ గాడినపడతాయి. కొత్త ప్రాజెక్టులు ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి ప్రారంభం కావచ్చు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇదే అనువైన సమయం. స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లో ధరల పెరుగుదల ఏటా 8 – 10 శాతం వరకు ఉంటుంది. రవాణా, మౌలిక వసతులు, కార్మికుల వేతనాల భారం వంటివి సంస్థలపై పడినా... కొనుగోలుదారుడి కోణంలో చూస్తే ధరల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు. -
రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావా
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు దాఖలైంది. మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రామేశ్వర్ రావు స్టేట్మెంట్ను రికార్డు చేసిన కోర్టు... ఈ అంశంపై తగిన సమాధానం తెలియజేయాల్సిందిగా రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువైన రామేశ్వర్ రావుకి హైదరాబాద్‌లో భూములు కేటాయించడంపై రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ తనపై చేసిన ఆరోపణల వల్ల తన పరువు పోయిందని, అందుకు రేవంత్ రూ. 90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు లీగల్ నోటీసులు పంపించారు. -
‘మై హోం’కు హైదరాబాద్ ఫ్రాంచైజీ!
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ బ్యాడ్మిం టన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్ కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 2013లో తొలి సీజన్ జరిగిన అనంతరం వివిధ కారణాలతో ఐబీఎల్‌ను నిర్వహించలేదు. దీంతో 2016 జనవరిలో రెండో సీజన్‌ను జరిపేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్ణయించింది. ఆరింట్లో ఐదు ఫ్రాంచైజీలు రంగంలోకి దిగేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. తొలి సీజన్ విజేత హైదరాబాద్ హాట్‌షాట్స్‌ను రియల్టీ సంస్థ మై హోమ్ గ్రూప్ దక్కించుకున్నట్టు సమాచారం. గతంలో ఈ జట్టు పీవీపీ యాజమాన్యంలో ఉండేది. లక్నో (అవధే వారియర్స్) జట్టును సహారా ఇండియా పరివార్ నిలబెట్టుకోగా ఢిల్లీ స్మాషర్స్‌ను ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ (ఐసీఎస్) జట్టు దక్కించుకుంది. అలాగే బెంగళూరును జిందాల్ గ్రూప్, చెన్నైని సైకిల్ అగర్బత్తి, ముంబైని ఓ రియాల్టీ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం.