నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
Published Tue, Jan 10 2017 11:58 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం నాంపల్లి క్రిమనల్ కోర్టుకు హాజరయ్యారు. మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు వచ్చారు. తదుపరి విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడింది.
కాగా హైటెక్ సిటీ వద్ద భూముల కేటాయింపునకు సంబంధించి అవకతవకలు జరిగాయని, ఈ కేటాయింపుల్లో మై హోం సంస్థ భారీగా లబ్ది పొందిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన తెలిసిందే. దీనిపై తన పరువుకు భంగం కలిగేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారని, పరువునష్టం కింద రూ. 90 కోట్లు చెల్లించాలని రామేశ్వరరావు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement