Ramnath
-
1995 నుంచి ఇదే చంద్రబాబు బ్లూ ప్రింట్
-
1,300 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : పోలీసులు 1300 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారయ్యారు. బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాంనాథ్ కేకన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మరిపెడ ఎస్సై తాహేర్ బాబా ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీరారం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులను గమనించిన బొలెరో వాహన డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే వాహనం ఆపి తనిఖీ చేయ గా, అందులో బాక్సులు కనిపించాయి. అందులో పేలుడు పదార్థాలకు సంబంధించిన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభించాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట గ్రామానికి చెందిన కస్తూరి కుమార్, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన బాదావత్ కిశోర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కుమార్‌కు వెంకటరమణ ఎంటర్ ప్రైజెస్ పేరు మీద లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ప్రకారం కేవలం నిర్ణీత పరిధిలో మాత్రమే పేలుడు పదార్థాలను అమ్ముకోవాలి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమంగా పేలుడు పదార్థాలను అనుమతి లేని వారికి అమ్ముతూ పట్టుబడ్డారు. కాగా, ఈ ఘటనలో జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట కస్తూరి సారయ్య పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రూరు డీఎస్పీ సురేష్, మరిపెడ సీఐ హతీరాం, ఎస్సై తాహేర్ బాబా, పోలీసు సిబ్బంది క్రాంతికుమార్, వెంకన్న పాల్గొన్నారు. -
విశ్వసనీయత మీడియాకు సవాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత సాంకేతికయుగంలో విశ్వసనీయత మీడియాకు అతి పెద్ద సవాలుగా మారిందని, మీడియా సంస్థలు దాన్ని పాటించడం ముఖ్యమని ప్రధానిమోదీ అన్నారు. రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవంలో బుధవారం మాట్లాడుతూ... సంబంధిత శిక్షణ, విద్యార్హతలు ఉన్నవారే గతంలో జర్నలిజం వృత్తిలోకి వచ్చేవారని, నేడు ఎవరైనా సరే మొబైల్ ఫోన్‌తో ఫొటో తీసి పంపవచ్చన్నారు.దేనిగురించైనా, ఎవరిపైనైనా మాట్లాడడానికి మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఇతరుల అభిప్రాయాల్ని మీడియా ఇష్టపడదంటూ సరదాగా అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఎక్కువ మీడియా ప్రచారం పొందిన రాజకీయ నాయకుడ్ని తానేనని, అందుకు రుణపడి ఉంటానన్నారు. ప్రభుత్వాన్ని మీడియా విమర్శిస్తే ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే రిపోర్టింగ్‌లో తప్పులు ఉండకూడదని, జాతీయ ఐక్యతే ముఖ్యమన్నారు. పలు అంశాలపై భారత్ వైఖరి వెల్లడించేందుకు ప్రపంచ స్థాయి భారత మీడియా సంస్థ అవసరమన్నారు. ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియా రంగాల జర్నలిస్టులకు అవార్డులు అందచేశారు. కాగా, చమురు దిగుమతుల్ని తగ్గించే మార్గాలపై బుధవారం మోదీ నేతృత్వంలో భేటీ జరిగింది. -
బాణీలకు ప్రాణ గాత్రి
బాలు, సాక్షి, విశాఖపట్నం విశాఖపట్నంలోని ఎన్ఎస్టీఎల్ మానసి ఆడిటోరియం. రామ్‌నాథ్ సెకండరీ స్కూల్ విద్యార్థులతో సందడిగా ఉంది. ‘వెల్కం టు హిజ్ ఎక్స్‌లెన్సీ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ అబ్దుల్ కలాం’.. మైకులో ప్రకటన.. ఆ వెంటనే ‘నేనొక భారత యువ పౌరుడిని’ అంటూ విద్యార్థినుల బృంద గానం మొదలైంది. కలాం ఆంగ్ల కవిత ‘యాజ్ ఎ యంగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్మ్డ్ విత్ టెక్నాలజీ’కి తెలుగు అనువాదమిది. హిందోళ రాగంలో రెండున్నర నిమిషాల పాటు సాగిన గానం ముగిసింది. చప్పట్లతో ఆడిటోరియం మారుమోగింది. విద్యార్థినుల్ని కలాం మనసారా దీవించారు. వారి గళాల్లో తేనెలూరిస్తున్న సంగీత ఉపాధ్యాయినిని హృదయపూర్వకంగా అభినందించారు. కలాం కవితకు అద్భుతమైన బాణీ కట్టి ప్రశంసలందుకున్న ఆమె పేరు పాలంకి సరస్వతి. ఇరవయ్యేళ్లుగా సంగీత యజ్ఞం పాలంకి సరస్వతి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో పీవీ శేషయ్య శాస్త్రి శిక్షణలో సంగీత పాండిత్యానికి తుది మెరుగులు దిద్దుకున్నారు. ఎన్ఎస్టీఎల్ రామ్‌నాథ్ సెకండరీ స్కూల్లో ఇరవయ్యేళ్లుగా ఎందరో విద్యార్థులను గాత్రంలో తీర్చిదిద్దుతున్నారు. ఆకాశవాణి కళాకారిణిగా తన గాన మాధుర్యంతో శ్రోతలను సమ్మోహనపరుస్తున్నారు. అమెరికాలోని మసాచుసెట్ నగరంలో డబ్ల్యుఎంఎల్ 95.1 ఆన్లైన్ ఎఫ్ఎం రేడియో చానల్లో కూడా ఆమె గానం చేసిన భక్తి గీతాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. దేశభక్తితో ‘స్వరా’ర్చన సాధారణంగా సీబీఎస్ఈ పాఠశాలల విద్యార్థులకు దేశభక్తి గీతాల్లో శిక్షణ ఇప్పిస్తారు. సరస్వతి తొలిసారిగా దేశభక్తి గీతాలకు స్వరాలను జతపరిచి పాడించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. కర్ణాటక సంగీతంలో బేసిక్స్.. అంటే సరళీ స్వరాలు, జంట స్వరాలు నేర్పేవారు. ఏ గీతాన్నయినా ఆమె విభిన్నంగా బాణీ కట్టడమే పిల్లల విజయానికి కారణం. పురస్కారాలెన్నో పియర్సన్ టీచింగ్ అవార్డ్స్-2013కు దేశవ్యాప్తంగా అందిన 26 వేల ఎంట్రీల్లో సంగీతం కేటగిరీలో టాప్‌ఫైవ్‌లో మొదటి స్థానంలో పాలంకి సరస్వతి నిలిచారు. స్వర కళామణి, గాన కళారత్న, ఉమెన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు.