'గుండాలను తీసుకొచ్చి గందరగోళ పరిస్థితులు ఏర్పరిచారు'.
నల్గొండ:ఎంపీ రాజగోపాల్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. దామెదర రెడ్డి విచక్షణా రహితంగా రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గుండాలను తీసుకొచ్చి గందరగోళ పరిస్థితులు సృష్టించారని ఆయన తెలిపారు. ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. దామోదర రెడ్డి రౌడీ రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
జిల్లాలోని భువనగిరిలో ఏఐసీసీ పరిశీకుల సాక్షిగా కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి.... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.