ramzaan
-
హైదరాబాద్ లో అతిపెద్ద ‘దావత్-ఎ-రంజాన్’ఎక్స్పో (ఫొటోలు)
-
పార్టీకి పిలిచిన సహోద్యోగి.. ఆమె తన లవర్‌తో వచ్చాక అతను..
సాక్షి ప్రతినిధి, చెన్నై : స్నేహితురాలు రంజాన్ విందుకు ఆహ్వానిస్తే బిర్యానీతో సహా నగలు భోంచేసిన యువకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. చెన్నై సాలగ్రామం అరుణాచలం రోడ్డులోని ఒక అపార్టుమెంట్లో నివసించే దాక్షాయణి (34) ప్రముఖ బంగారునగల దుకాణంలో పనిచేస్తోంది. అదే దుకాణంలో మేనేజర్‌గా పనిచేసే తారా అనే మహిళను రంజాన్ విందుకు దాక్షాయణి ఆహ్వానించింది. తార తన బాయ్‌ఫ్రెండ్ మహమ్మద్ అబూబకర్ (27)తో కలిసి ఈనెల 3వ తేదీన విందుకు వెళ్లింది. ఇద్దరూ కలిసి వేడివేడి బిర్యానీ ఆరగించి ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తరువాత దాక్షాయణి తాను బయటకు వెళ్లేందుకు బీరువా తెరిచి చూడగా రూ.1.45 లక్షల విలువైన మూడు బంగారు గొలుసులు, వజ్రాల దండ కనిపించలేదు. అయితే, తార, అబూబకర్ మినహా వేరెవ్వరూ ఇంటికి రాకపోవడంతో దాక్షాయణి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అబూబకర్‌ను విచారించగా పొంతనలేని సమాధానం ఇచ్చాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి పొట్టభాగాన్ని స్కాన్ చేయగా నగలు కనపడ్డాయి. రంజాన్ వేళ మద్యం తాగేందుకు డబ్బు లేకపోవడంతో చోరీకి పాల్పడ్డానని చెప్పాడు. బిర్యానీ తయారీలో దాక్షాయణి బిజీగా ఉన్న సమయంలో బీరువా తెరిచి నగలు దొంగలించానని, బిర్యానీ మధ్యలో నగలు పెట్టి మింగేశానని నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు. అతడికి వెంటనే ఎనిమా ఇచ్చి నగలను బయటకు తీసి దాక్షాయణికి అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేయగా ఫిర్యాది వేడుకోవడంతో హెచ్చరించి వదిలిపెట్టారు. -
ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ రంజాన్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని మరింత పెంపొందించేలా కృషి చేద్దామని కోరారు. ‘ఈద్ ఉల్ పితర్ సందర్భంగా ఈద్ ముబారక్. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనందరి సమిష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించి ముందుకు వెళ్లేలా కృషి చ్దేదాం' అంటూ మోదీ ట్వీట్ చేశారు. Best wishes on the auspicious occasion of Eid-ul-Fitr. Praying for everyone’s good health and well-being. Powered by our collective efforts, may we overcome the global pandemic and work towards furthering human welfare. Eid Mubarak! — Narendra Modi (@narendramodi) May 14, 2021 -
రంజాన్ వేళ 600 మందికి బిర్యానీ విందు
సింగపూర్: ప్రపంచవవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు నేడు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈ ఏడాది పండగ సంబరాలు ఎక్కడా కనిపించడం లేదు. లాక్డౌన్, సామాజిక దూరం నేపథ్యంలో ఎవరి ఇళ్లలో వారే పండగ జరుపుకుంటున్నారు. ఇళ్లలో ఉన్న వారి పరిస్థితి పర్లేదు.. మరి క్వారంటైన్లో ఉండే వారి సంగతి ఎలా. అక్కడ వారు పెట్టింది తినాలే తప్ప వేరే మార్గం లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్‌కు చెందిన ఓ బిజినేస్ మ్యాన్ క్వారంటైన్లో ఉన్న వారికి బిర్యానీ విందు ఇచ్చి.. పండగ పూట వారికి తోడుగా నిలబడ్డాడు. దుష్యంత్ కుమార్ అనే వ్యక్తి దాదాపు 600 మంది వలస కూలీలకు బిర్యానీతో విందు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు.(నిర్మానుష్యంగా మారిన ఈద్గాలు,మసీదులు) ఈ సందర్భంగా దుష్యంత్ మాటట్లాడడుతూ.. ‘భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. సాధారణంగా అయితే పండగ సమయానికి వారు కుటుంబ సభ్యులతో ఇంట్లో సంతోషంగా ఉండేవారు. కానీ ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. కరోనా వైరస్ వల్ల ఈ వలస కూలీలంతా ఇక్కడే క్వారంటైన్ కేంద్రాల్లో ఉండిపోయారు. పండగ పూట వారి ముఖంలో నవ్వు చూడాలనుకున్నాను. అందుకే నా భార్యతో కలిసి ఓ పెద్ద రెస్టారెంట్ కిచెన్‌లో దాదాపు 600 మందికి సరిపోను బిర్యానీ వండించాను’ అని తెలిపాడు. ఇదే కాక లాక్డౌన్ ప్రారంభం అయిన నాటి నుంచి ప్రతిరోజు 1000 మందికి భోజనం పెడుతు మంచి మనసు చాటుకుంటున్నాడు దుష్యంత్.(గోల్డీ కల్యాణం) -
నిర్మానుష్యంగా మారిన ఈద్గాలు,మసీదులు
-
వాటికి ప్రభుత్వం అనిమతించింది: అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ కడప: పవిత్రమైన రంజాన్ పండుగ కరోనా వైరస్ సమయంలో వచ్చినందున్న.. ముస్లిం సోదరులంతా ప్రభుత్వానికి సహకరించాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా రానున్న రంజాన్ దీక్షల తరుణంలో అందరూ ఇళ్లలోనే నమాజ్ నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు. ఇక కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. రంజాన్ ఉపవాస దీక్షలలో 5 పూటలా నమాజ్ చేయడానికి ఇమామ్, మౌజన్లకు అనుమతిని ఇస్తున్నామని, నమాజ్‌కు సంబంధించిన అజా సమయంలో సైరన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఇనుమతించిందన్నారు. (వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి) ఇక సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించే సమయంలో ఎవరూ బయటకు రావోద్దని, ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని ఇఫ్తార్ జరుపుకోవాలన్నారు. నమాజ్ సమయంలో సామాజిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల దుకాణౠలు ఉదయం 10 వరకు అనుమతి ఇస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ఉపవాస దీక్ష విరమణ సమయంలో పండ్లు, ఫలాల కోసం సాయంత్రం వేళ దుకాణాలకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. పేద ముస్లిం వాళ్లకు దాతలు చేసే ఉచిత అన్నదాన కార్యక్రమం అనుమతితో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇఫ్తార్ సమయంలో పోలీసులు అనుమతిని ఇచ్చిన కొన్నిహోటల్స్కు మాత్రమే టెక్ అవెతో వేసులు బాటు కల్పించామన్నారు. క్వారంటైన్లో ఉన్న ముస్లిం సోదరులకు ప్రభుత్వ యంత్రాంగం తరపున వారికి పౌష్టికాహారం అందిస్తున్నామని, అన్ని ప్రాంత్రాల్లో ప్రభుత్వ నిబంధనల బ్యానర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
'చపాతీ' పై చెరో మాట
ఢిల్లీ లోని మహారాష్ట్ర సదన్ లో శివసేన ఎంపీలు భోజనం విషయంలో గొడవ పడి, ఒక ముస్లిం ఉద్యోగి నోట్లో రంజాన్ వేళ బలవంతంగా చపాతీ కుక్కిన ఘటనపై భారీ దుమారం చెలరేగుతోంది. ఈ సందర్భంగా వివిధ పార్టీల వారు తమదైన శైలిలో స్పందించారు. ఎవరేమన్నారో చూద్దాం.... ఉద్ధవ్ ఠాక్రే (శివసేన) - ఇది మా పార్టీ గొంతు నొక్కే యత్నం. మాయావతి (బహుజన సమాజ్ పార్టీ) - మహారాష్ట్ర ఎన్నికల ముందు మతతత్వవాదాన్ని పెంచే కుట్ర ఇది. కమల్ నాథ్ (కాంగ్రెస్) - ఇది శివసేన మనస్తత్వాన్ని తెలియచేస్తోంది. నితిన్ గడ్కరీ (బిజెపి) - మౌనం అద్వానీ (బిజెపి) - ఇది సరైన చర్య కాదు. గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్) - ఇది సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధం -
ఫ్రమ్ ఇరాక్ విత్ లవ్ ....!
ఎక్కడో ఇరాక్ నుంచి బయలుదేరుతుంది. ఆ తరువాత ముంబాయి తీరానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి గుజరాత్ వ్యాపారుల గోడౌన్లలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మన హైదరాబాద్ లోకి బేగం బజార్ లోకి, అక్కడినుంచి పాత బస్తీ వీధులు, సందుల్లోని మసీదుల్లోకి, దుకాణాల్లోకి, ఇళ్లలోకి వస్తాయి. రంజాన్ నెల వచ్చిందంటే చాలు దానికి భలే డిమాండ్! జహేదీ, అజ్వా, మేడ్ జోల్, కలిమీ, రుక్సానా ఇలా వేర్వేరు వెరైటీల రూపంలో అవి దొరుకుతాయి. అవి లేకపోతే రంజాన్ ఉపవాస దీక్ష (రోజా) ను సాయంత్రం నమాజుకు ముందు విడిచిపెట్టలేరు. ఇంతకీ అవేమిటని అనుకుంటున్నారు కదూ. అవే ... ఖర్జూరాలు. గుండె నిండా భక్తిపూర్వక నమాజు, నోటి నిండా గుప్పెడు తియ్యతియ్యని ఖర్జూరాలు.... రంజాన్ నెలంతా కనిపించే దృశ్యాలు ఇవే. ఇరాక్ లో ప్రస్తుతం భయంకరమైన అంతర్యుద్ధం నడుస్తున్నా మన దేశానికి ఖర్జూరం దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఖర్జూరాలను గత నవంబర్ లోనే సేకరించి, కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరిచారు. అంతర్యుద్ధ ప్రారంభానికి ముందే ఖర్జూరాలు గుజరాత్ చేరుకున్నాయి. అందుకే ఈ సారి పెద్దగా ఖర్జూరాల ధరలు పెరగలేదు. అయితే ఖర్జూరం వ్యాపారులు మాత్రం ఖర్జూరాలను డ్రైఫ్రూట్స్ కేటగరీ నుంచి ఫ్రూట్స్ కేటగరీలో చేరిస్తే బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పై 12 శాతం వ్యాట్ పన్ను ఉంటుంది. పండ్ల పైన అంత పన్ను ఉండదు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ లలో ఖర్జూరాలను డ్రైఫ్రూట్స్ శ్రేణి నుంచి తొలగించారు. మన రాష్ట్రంలోనూ అలా చేస్తే బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు.