ramzan month start
-
ముస్లిం సోదరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని.. నెలరోజుల పాటు నియమనిష్టలతో కఠిన ఉపవాసవ్రతం ఆచరించే ఈ పుణ్యమాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకొంటారని పేర్కొన్నారు. వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని పేర్కొన్నారు. రంజాన్ అంటే ఉపవాసదీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప దీక్ష అని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. -
రంజాన్ నెల ప్రారంభం : వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య పవిత్ర మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకుంటారని, వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని పేర్కొన్నారు. రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ఆయన అన్నారు. Greetings on the beginning of the Holy month of #Ramzan. — YS Jagan Mohan Reddy (@ysjagan) 17 May 2018 -
మాహె.. రంజాన్ ఆయా
– ప్రారంభమైన రంజాన్ ఉపవాసాలు – తొలి రోజు కిటకిటలాడిన మసీదులు అనంతపురం కల్చరల్ : పవిత్ర రంజాన్ మాసం ఆదివారం ఘనంగా ప్రారంభమయింది. మొదటిరోజు కావడంతో అనంతపురం నగరంలోని మసీదుల్లో ఉపవాస దీక్షలు, విశేష ప్రార్థనలతో ప్రత్యేక సందడి నెలకొంది. విద్యుద్దీప కాంతుల నడుమ వింత శోభను సంతరించుకున్న మసీదులు ముస్లింలతో కిటకిటలాడాయి. సాయంత్రం ఉపవాస దీక్ష విరమణతో ఇఫ్తార్ విందులు హల్చల్ చేశాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాలు సాయంత్రం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా తెరచి ఉంచారు. మసీదుల్లో, మదరసాలలో ఖురాన్ ప్రవచనాల తరావి నమాజు కార్యక్రమాన్ని నియమ నిష్టలతో జరుపుకున్నారు. ముఖ్యంగా నగరంలోని లలితకళాపరిషత్ సమీపంలోని ఈద్గా మసీదు, పాతూరు జామియా తదితర చోట్ల మతపెద్దల దివ్య సందేశాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అలాగే ఉపవాసదీక్షలో ఉపయోగించే ఖర్జూరాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇక కర్బానీ కామీఠా, కద్దూరాకీర్, షీర్కుర్మా, డబల్కామీటా, బిర్యానీ తదితర వంటకాలతో పాటు ఈసారి నగరంలో ప్రత్యేక హలీం హోటల్స్ పెరగడంతో నోరూరిస్తూ పసందైన విందునందిస్తున్నాయి. మసీదుల వద్ద ఇస్లామిక్ సాహిత్యం, మత గ్రంథాలు, ఆధ్యాత్మికతను చాటే వివిధ రకాల వస్తువులు విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.