ranjana
-
నా కోడలు మాయలాడిది.. ఇప్పుడేమో ఏక్దమ్ చించిపారేసిందట!
ఈ అత్తలున్నారే.. ఎప్పుడెలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు అని కోడళ్లు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు చెప్పే విషయం వింటే వారేంటి.. మీరు కూడా అదే మాట అంటారు. ఇంతకీ ఏం జరిగిందంటే... బుల్లితెర నటి అంకిత లోఖండే ఇటీవలే హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో పార్టిసిపేట్ చేసింది. తను ఒక్కతే వెళ్లలేదు. వెంట భర్తను కూడా తీసుకెళ్లింది. ఆలూమగలన్నాక గొడవలు సర్వసాధారణమే! కానీ చుట్టూ కెమెరాలున్న సంగతే మర్చిపోయి ఈ దంపతులు వేరే లెవల్లో తిట్టుకున్నారు.. కొట్టుకున్నంత పని చేశారు. అప్పుడేమో తిట్టేసి.. ఇది చూసిన అంకిత అత్త రంజనా జైన్‌కు మండిపోయింది. నా కొడుక్కి కనీస గౌరవం ఇవ్వట్లేదు.. నేనెప్పుడో చెప్పా.. ఈమె అలాంటిది, ఇలాంటిది అంటూ విమర్శల పారాయణం చేసింది. అంకిత.. తన మాజీ ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటే కూడా.. అంతా ఫేమస్ అవడం కోసమే, ఓట్ల కోసమే.. పెద్ద మాయలాడి అని నానామాటలు అంది. ఇప్పుడేమో మెచ్చుకుని కట్ చేస్తే అంకిత కీలక పాత్రలో నటించిన స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమా మార్చి 22న విడుదలైంది. థియేటర్లో మూవీ చూసిన అంకిత అత్తయ్య.. నా కోడలు ఎంత బాగా కనిపిస్తుందో! మా అంకిత ఏ1. ఏక్దమ్ యాక్ట్ చేసింది అని మెచ్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. కమల్ హాసన్‌ను మించిపోయిందిగా అని కామెంట్లు చేస్తున్నారు. నటి పారితోషికం? ఇకపోతే స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమా కోసం డైరెక్టర్ కమ్ హీరో రణ్‌దీప్ హుడా 32 కిలోలు తగ్గాడు. కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే రూ.6 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ తొలి రోజు ఈ చిత్రం కేవలం కోటి రూపాయల పైచిలుకు మాత్రమే సాధించడం గమనార్హం. ఈ మూవీకి అంకిత ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఆ సినిమాలు చేశానని వేశ్య అని ట్రోల్ చేస్తున్నారు -
సినిమాల్లో సక్సెస్ కాలేనని ఎగతాళి చేశారు: నటి
ఇతర రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మహిళలు పురుషులకు ధీటుగా సత్తా చాటుకుంటున్నారు. అలా రంజనా నాచ్చియార్ అనే నటి ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. ఈమె దర్శకుడు బాల సోదరుడి కూతురు.. ఎంఎస్సీ, ఎంటెక్, ఎల్ఎల్బీ పట్టభద్రురాలైన రామనాథపురం సంస్థానం రాజా భాస్కర్ సేతుపతి మనవరాలు కూడా! మొదట నటనపై ఆసక్తితో సినిమాలపై దృష్టి సారించారు. అలా తుప్పరివాలన్, ఇరుంబు తిరై, డైరీ, నట్పే తునై, రజనీకాంత్ నటించిన అన్నాత్తే వంటి పలు చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఇప్పుడు నిర్మాతగా మారి స్టార్ గురు ఫిలిమ్స్ పతాకంపై ఏకకాలంలో రెండు చిత్రాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఒక చిత్రానికి కుట్టి పులి చిత్రం ఫేమ్ శర్వాణి శక్తి, మరో చిత్రానికి విజయ్ టీవీ ఫ్రేమ్ శంకర్ పాండే దర్శకత్వం వహించనున్నారు. దీని గురించి నిర్మాత రంజనా నాచ్చియార్ మాట్లాడుతూ.. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తాను సినిమాల్లో జయించలేనని చాలామంది అన్నారు. దీంతో నటిగా సక్సెస్ అయిన తాను దర్శకురాలిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. దానికి ముందుగా నిర్మాతగా మారి అనుభవం గడించాలని భావించానని చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని ఆమె చెప్పారు. చదవండి: ఆ బిజినెస్‌లో కేజీఎఫ్ విలన్ పెట్టుబడి, పెద్ద ప్లానే వేశాడుగా -
‘పరిశ్రమలో ఎంతమంది బంధువులున్నా నటిగా కష్టపడుతూనే ఉన్నా’
అన్నాత్తై చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మధురానుభతి అని నటి రంజనా అన్నారు. ఈమె పూర్తి పేరు రంజనా నాచ్చియార్. రాజవంశానికి చెందిన ఈమె కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది. అన్నాడీఎంకే నేత ఓపీఎస్ ఆమెకు మామయ్య అవుతారు. అదే విధంగా సినీ దర్శకుడు బాలా సొంత బాబాయి. నటుడు నిర్మాత ఆర్కే సురేష్ తదితర సినీ ప్రముఖులు రంజనాకు బంధువులే. ఎంటెక్, బీఏ, బీఎల్ పట్టభద్రురాలైన రంజనా వ్యాపారవేత్త కూడా. ఇన్ని అర్హతలు ఉన్న రంజనా సినీ నటిగా కొనసాగటం విశేషం. ఇటీవల విడుదలైన అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన డైరీ చిత్రంలో అమ్మగా వైవిధ్య భరిత పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు ఆమె. చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! ఈ చిత్రం తనకు మంచి పేరును, గుర్తింపును తెచ్చి పెట్టిందని అంటున్న రంజనా కాసేపు పాత్రికేయులతో ముచ్చటించారు. నటిని అవడానికి తాను చాలా పోరాటమే చేయాల్సి వచ్చిందన్నారు. తొలుత బుల్లితెరపై నటించానన్నారు. మిష్కిన్ విశాల్ కథానాయకుడిగా నటించిన తుప్పరివాలన్ చిత్రంతో సినీ జీవితం ప్రారంభమైందన్నారు. ఆ తరువాత వరుసగా పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్నానని, అలా నటించిన చిత్రాల్లో అన్నాత్తై ఒకటని అన్నారు. ఈ మూవీ షూటింగ్ విరామ సమయంలో ఓసారి రజనీకాంత్ గారు తనను చూసి తెలుగు అమ్మాయివా? అని అడిగారని గుర్తు చేసుకున్నారు. లేదండి పక్కా తమిళ్ అని చెప్పడంతో ఆయన అవునా అంటూ నవ్వేశారన్నారు. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పటి వరకు కమలహాసన్, విజయ్, అజిత్ మినహా అందరూ నటులతోనూ కలిసి నటించానని చెప్పారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించాలనే కోరికతో కర్రసాము, గుర్రపు స్వారీలలో శిక్షణ పొందానని, అంతకు ముందే కరాటేలో ప్రవేశం ఉందని చెప్పారు. అయితే ఆ చిత్రంలో అవకాశం దక్కలేదన్నారు. సినిమా రంగంలో నటిగా ఎదగడానికి సమస్యలను ఎదుర్కొంటున్నారా అన్న ప్రశ్నకు ఏ రంగంలోనైనా మహిళలకు సమస్యలు ఎదురవుతుంటాయని అయితే వాటిని అధిగమంచి రాణించాల్సి ఉంటుందని రంజానా సూచించారు. తాను ఇందుకు అతీతం కాదని, నటిగా విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమన్నారు ఆమె. -
పెళ్లి చేసుకుని.. రైలుకి ఎదురెళ్లి..
సీతాపూర్, ఉత్తరప్రదేశ్ : పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆదివారం ఓ యువ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు వెళ్లింది. వీరేంద్ర వర్మ(19), రంజానా(18) గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో చెప్పి ఒక్కటవ్వాలని భావించారు. అయితే, ఇందుకు పెద్దలు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జంట స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకుంది. అక్కడి నుంచి నేరుగా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అడవుల్లో మరగధకాడు
తమిళసినిమా: పూర్తిగా అడవుల్లో చిత్రీకరణను జరుపుకున్న చిత్రం మరగధకాడు అని ఆ చిత్ర దర్శకుడు మంగళేశ్వరన్ తెలిపారు. ఈయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఆర్.ఫిలింస్ పతాకంపై రఘునాథన్ నిర్మిస్తున్నారు. అజయ్, రంజనా, జయశ్రీ,మలయాళ దర్శకుడు ఇలియాస్ కాత్తవన్, జేపీ.మోహన్, పావాలక్ష్మణన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జయప్రకాశ్ సంగీతాన్ని, నక్షత్ర ప్రకాశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా అడవుల్లో చిత్రీకరించిన మంచి సందేశంతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. నానాటికి నశించి పోతున్న అడవులు, వాటిని నమ్ముకుని జీవించే అటవీవాసుల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రంగా మరగధకాడు చిత్రం ఉంటుందన్నారు. నాగరికత, నగరాభివృద్ధి పేరుతో అడవులను ఎలా హరింపజేస్తున్నారు? దాని వల్ల ప్రకృతి ఎలా బాధింపునకు గురవుతోంది? అన్న అంశాలను ఆవిష్కరించే చిత్రం ఇదన్నారు. ఇప్పుడు నీరు కొనుక్కుంటున్నట్లే ఇకపై గాలిని కొనుక్కునే పరిస్థితి రాకుడదని చెప్పే చిత్రంగా మరగథకాడు చిత్రం ఉంటుందన్నారు. ఇందులో ఒక చక్కని ప్రేమ కథ కూడా ఉంటుందన్నారు. ఒక పరిశోధన నిమిత్తం అడవికి వెళ్లిన కథానాయకుడికి అక్కడ ఒక అందమైన అమ్మాయి తారస పడుతుందన్నారు. వారి పరిచయం ప్రేమగా మారగా,అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే ఆసక్తికరమైన సన్నివేశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం మరగధకాడు అని చెప్పారు. చిత్రాన్ని తమిళనాడు, కేరళ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపారు. -
సందేశాత్మకంగా ‘సంతర్పం’
రంజన, నిర్బన్, గణేష్, పార్వతి, నిషా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘సంతర్పం’. శరవణశక్తి దర్శకుడు. గణేష్ బారీ నిర్మాత. విమల్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో నిర్మాత రాజేందర్ చేతుల మీదుగా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘స్త్రీ, పురుష సంబంధాల్లోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. అంతర్లీనంగా చక్కని సందేశం కూడా ఉంటుంది’’ అని తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కథ: కోవై బాబు, మాటలు: వాసు, కెమెరా: కె.కేశవన్, సహ నిర్మాత: ప్రసాద్.