
ప్రతీకాత్మక చిత్రం
సీతాపూర్, ఉత్తరప్రదేశ్ : పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆదివారం ఓ యువ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు వెళ్లింది. వీరేంద్ర వర్మ(19), రంజానా(18) గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
విషయం ఇంట్లో చెప్పి ఒక్కటవ్వాలని భావించారు. అయితే, ఇందుకు పెద్దలు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జంట స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకుంది. అక్కడి నుంచి నేరుగా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.