Ranji title
-
Ranji Trophy 2022: చరిత్ర సృష్టించనున్న మధ్యప్రదేశ్..!
మధ్యప్రదేశ్ రంజీ జట్టు చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో ఉంది. ఫైనల్లో ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (162 పరుగులు) సాధించడం ద్వారా ఆ జట్టు తొలి రంజీ టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. రజత్ పాటిదార్ (219 బంతుల్లో 122; 20 ఫోర్లు) సూపర్ శతకంతో మధ్యప్రదేశ్ విజయానికి బాటలు వేశాడు. నాలుగో రోజు ఆటలో పాటిదార్ ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని తన జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. కాగా, రంజీల్లో మ్యాచ్ ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. 368 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన మధ్యప్రదేశ్ మరో 7 పరుగులు చేసి లీడ్‌ను సాధించి 536 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ముంబై ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకే ఆలౌటైన విషయం విధితమే. ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. 1998-99 సీజన్లో ఆ జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆ సీజన్ ఫైనల్లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించినప్పటికీ.. ఆఖరి రోజు ఆఖరి సెషన్లో అనూహ్యంగా కుప్పకూలి ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక, ప్రస్తుత సీజన్ ఫైనల్ విషయానికొస్తే ఏదో అద్భుతం జరిగితే తప్ప ముంబైకు విజయావకాశాలు లేవు. ముంబై చివరిరోజు ఆటలో మధ్యప్రదేశ్‌కు టార్గెట్ సెట్ చేసి ఆ జట్టును ఆలౌట్ చేయగలిగితేనే టైటిల్ సాధించే అవకాశం ఉంటుంది. చదవండి: Ranji Trophy Final: వారెవ్వా.. రజత్ పాటిదార్.. సూపర్ సెంచరీ! ఇక -
గుజరాత్ లక్ష్యం 312
ప్రస్తుతం 47/0 ముంబైతో రంజీ ఫైనల్ ఇండోర్: మరో 265 పరుగులు.. ఒక రోజంతా సమ యం... చేతిలో పది వికెట్లు... తమ తొలి రంజీ టైటిల్‌ను అందుకునేందుకు గుజరాత్ ముందున్న లక్ష్యం ఇది. రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు గుజరాత్ ముందు 312 పరుగుల లక్ష్యా న్ని ఉంచింది. నాలుగో రోజు శుక్రవారం ఆట ముగి సే సమయానికి 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా పార్థీవ్ సేన 47 పరుగులు చేసింది. క్రీజులో సూపర్ ఓపెనింగ్ జోడి ప్రియాంక్ పాంచల్ (34 బ్యాటింగ్; 7 ఫోర్లు), గోహెల్ (8 బ్యాటింగ్) ఉన్నారు. ఒకవేళ రోజంతా క్రీజులో నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగించినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా గుజరాత్ చాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంటుంది. అయితే గెలుపు కోసం దూకుడుగా ఆడతారా.. లేక రక్షణాత్మక ఆటతీరుకు కట్టుబడతారా అనేది వేచిచూడాలి. అంతకుముందు ముంబై జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను 137.1 ఓవర్లలో 411 పరుగుల వద్ద ముగించింది. సీనియర్ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్ (91; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) తన విలువైన ఆటతో జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. కెప్టెన్ ఆదిత్య తారే (69; 12 ఫోర్లు) సహకరించాడు. చింతన్ గజాకు ఆరు వికెట్లు, ఆర్పీ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
అగాధానికి... అంకిత్ చవాన్
27 ఏళ్ల చవాన్ 2008-09 సీజన్లో తొలిసారిగా ముంబై జట్టు తరఫున కెరీర్‌ను ఆరంభించాడు. 2012-13 సీజన్లో ముంబై 40వ సారి రంజీ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర వహించి నంబర్‌వన్ స్పిన్నర్‌గా మారాడు. పంజాబ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 23 పరుగులకు 9 వికెట్లు తీసిన చవాన్‌ను సచిన్ సైతం ప్రశంసించాడు. దేశవాళీ వన్డే, టి20ల్లో ముంబై తరఫున కచ్చితంగా ఆడేవాడు. దీంతో ఐపీఎల్ తొలి సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడినా 2011 నుంచి రాజస్థాన్ జట్టుతో ఉన్నాడు.