Raththam Movie
-
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్
చాలామంది వీకెండ్లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి కాలక్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి. అటు ఒక వారంలో థియేటర్లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో అంతకు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్ల కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. మరి ఈ శుక్రవారం (నవంబర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వచ్చాయని అర్థం. అమెజాన్ ప్రైమ్ వీడియో ► తకేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది ► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► రత్తం - నవంబర్ 3 ► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్ 3 హాట్‌స్టార్ ► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► కాఫీ విత్ కరణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది ► లోకి రెండో సీజన్, ఐదవ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది ► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 నెట్‌ఫ్లిక్స్ ► జవాన్ - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► మ్యాడ్ - నవంబర్ 3 ► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 3 ► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబర్ 3 ► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 3 ► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబర్ 3 సోనీలివ్ ► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 బుక్ మై షో ► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్ 3 ► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► ద థీఫ్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్ 3 ఆపిల్ ప్లస్ టీవీ ► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 జియో సినిమా ► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3 చదవండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్‌పై రతికా ఫైర్! -
నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ ఏడాది బిచ్చగాడు-2 (పిచ్చైక్కారన్ 2) చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటిస్తోన్న నటుడు విజయ్ తాజాగా నటించిన చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రానికి సీఎస్ అముదాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన నటి మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యానంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషం.ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. #Raththam from November 3rd on @PrimeVideoIN 🩸 pic.twitter.com/0S7VbGaNvL — vijayantony (@vijayantony) October 31, 2023 -
ఎన్నో కోల్పోయా..బాధతో జీవించడం అలవాటైంది: విజయ్ ఆంటోని
తమిళసినిమా: నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రత్తం. తమిళ్ పడం వంటి విజయవంతమైన చిత్రాల ఫేమ్ సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్ పతాకంపై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ కలిసి నటించిన ఇందులో నటి మహిమా నంబిరాయర్, నందితా శ్వేత, రమ్యా నంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించగా నిళల్గల్ రవి, జగన్ ముఖ్యపాత్రలు పోషించారు. కన్నన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 6న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా రత్తం చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో నిర్మాత టీజీ త్యాగరాజన్, అమ్మా క్రియేషన్స్ టి.శివ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధనుంజయన్ మాట్లాడుతూ దర్శకుడు సీఎస్ అముదమ్ తన గత చిత్రాలకు పూర్తిభిన్నంగా రత్తం చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని చెప్పారు. విజయ్‌ఆంటోని మాట్లాడుతూ ఇది పాత్రికేయుల ఇతివృత్తంతో రూపొందిన కథా చిత్రం అని పేర్కొన్నారు. చిత్రం బాగా వచ్చిందని తనకు ఇందులో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. అలాగే తన కూతురు మరణాన్ని తలుచుకుంటూ..‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. నేను జీవితంలో ఇప్పటికే ఎన్నో కోల్పోయాను. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నాను. బాధల నుంచే ఎంతో నేర్చుకున్నా’ అన్నారు. అనంతరం అమ్మా క్రియేషన్స్ టి.శివ మాట్లాడుతూ తాను రత్తం చిత్రాన్ని చూసి చెబుతున్నానని, చాలాబాగా వచ్చిందని చెప్పారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. విజయ్‌ఆంటోని కెరీర్ రత్తం చిత్రం స్పెషల్‌గా నిలిచిపోతుందన్నారు. ఆయన పుట్టెడు బాధల్లో ఉండి కూడా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, నిర్మాతల శ్రేయస్సు గురించి నటుల్లో తనకు తెలిసి తమిళ సినీ పరిశ్రమలో నటుడు విజయ్‌కాంత్ తరువాత విజయ్ఆంటోనినేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ఆంటోని తన చిన్న కూతురు లారాతో కలిసి పాల్గొన్నారు.