రెండు రేషన్ దుకాణాలు సీజ్
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్‌లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించి రెండు రేషన్ దుకాణాలను సీజ్ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ హరినాథ్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిలు మంఖాల్ గ్రామంలో నరేష్ నిర్వహిస్తున్న ఆరో నంబర్ రేషన్ దుకాణ ంలో తనిఖీలు చేశారు. దుకాణంలో స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా లేవు, నిర్వాహకులు సమయ పాలన పాటించడం లేదని గుర్తించారు. దీంతో రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు.
అదేవిధంగా గ్రామంలోని 19వ నంబర్ రేషన్ డీలర్ కప్పల సుగంధ పేరు మీద ఉన్న దుకాణాన్ని అదే గ్రామానికి చెందిన బాకీ దాసు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమయపాలన, రిజిస్టర్లు సక్రమంగా పాటించడం లేదని తనిఖీలో వెల్లడి కావడంతో ఈ దుకాణాన్నీ సీజ్ చేశారు. రెండు దుకాణాలకు చెందిన స్టాక్ రిజిస్టర్లు, దుకాణాల తాళాలు మహేశ్వరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాబురావు, వీఆర్వో రాములకు అప్పగించారు. రేషన్ దుకాణాల్లోని సరుకుల స్టాక్ వివరాలను ఆర్ఐ బాబురావు, వీఆర్వో రాములు నమోదు చేసుకున్నారు.