సామర్లకోటలో నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ప్రెస్
సామర్లకోట రైల్వేస్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లవలసి ఉంది. తునిలో రత్నావళి ఎక్స్ప్రెస్కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పవర్ సమస్య వచ్చి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. రైలు ఎప్పుడు కదిలేదీ లేనిదీ సమాచారం అధికారులు స్పష్టంగా చెప్పటం లేదు.