Ravindra Nath Reddy
-
చంద్రబాబుకు చెంప పెట్టు
-
అపోహలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు
కమలాపురం: ఫోర్టిఫైడ్ బియ్యం బలవర్ధకమైన ఆహారం అని, అవగాహన రాహిత్యంతోనే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. రెండు వారాలుగా ఫోర్టిఫైడ్ బియ్యంపై జరుగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లకు తెరదించడం కోసం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి అర్జున్ రావ్ అధ్యక్షతన శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పెండ్లిమర్రి మండలం, రేపల్లెలో గడపగడపకు వెళితే ఒకే ఓ మహిళ ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేస్తున్నారని తన దృష్టికి తీసుకొచ్చిందని, అవి ప్లాస్టిక్ కాదు ఫోర్టిఫైడ్ బియ్యం అని వివరంగా చెప్పగా ఆమె అర్థం చేసుకుందన్నారు. అయితే టీడీపీ నాయకులకు నిరక్షరాస్యులైన మహిళలకు ఉన్నంత అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. అవగాహన రాహిత్యంతోనే వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం బలవర్ధకమైన అని నిరూపించడం కోసమే ఇంత మంది అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. తర్వాత కూడా ప్లాస్టిక్ బియ్యం అని ఎవరైనా చెబితే వారిపై సివిల్సప్లై అధికారులు కేసులు నమోదు చేస్తారన్నారు. ప్రజల్లో ఉన్న రక్తహీనతను నివారించడానికే ప్రధాన మంత్రి దేశమంతా ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ బియ్యం తయారు చేయాలంటే టన్నుకు రూ.57వేలు ఖర్చు అవుతుందని, అయినా ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి అన్ని రాష్ట్రాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. అలాగే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో రెండేళ్లు గడువున్నా ఇప్పుడే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి:సీకేదిన్నె జెడ్పీటీసీ సీకే దిన్నె జెడ్పీటీసీ నరేన్ రామాంజుల రెడ్డి మాట్లాడుతూ ప్రజా చైతన్య యాత్రలు చేసే ప్రతి పక్ష నాయకులు ప్రజలను చైతన్య పరచాలే గాని తప్పుదోవ పట్టించరాదన్నారు.ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్లాస్టిక్ బియ్యం అని ప్రజల్లో అపోహలు సృష్టించిన టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి జిల్లాలోని 5.40లక్షల రేషన్ కార్డుదారులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి,అపోహలు తొలగించడానికి వచ్చిన శాస్త్రవేత్తలు,ప్రొఫెసర్లకు కృతజ్ఞతలైనా చెప్పాలన్నారు. వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రెండు వారాలుగా ఫోర్టిఫైడ్ బియ్యంపై నియోజకరవ్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. వాటిని తెరదించడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ సునీత, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ షమీమ్ బస్ట్, వర్థిరెడ్డి రోజా రాణి, సుబ్బారెడి మాట్లాడారు. భోజనం చేసిన ఎమ్మెల్యే: సదస్సు ప్రాంగణంలోనే పోర్టిఫైడ్ బియ్యంతో చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తిన్నారు. ఇది బలవర్ధకమైన ఆహారం అని నిరూపించారు. జారుకున్న టీడీపీ నాయకులు ఫోర్టిఫైడ్ బియ్యంపై కమలాపురం టీడీపీ ఇన్చార్జి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి తదితర నాయకులు రెండువారాలుగా రాద్ధాంతం చేశారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయని దుష్ప్రచారం చేశారు. అ యితే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం అవి ప్లాస్టిక్ బియ్యం కాదని, బలవర్ధకమైన పోషకాహార విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యం అని వివరిస్తూ వచ్చారు. అయినప్పటికీ వినని ప్రతిపక్ష నాయకులు సవాళ్లకు దిగారు. వీరికి దీటుగా అధికారపక్షం నాయకులు ప్రతిసవాళ్లు విసిరా రు.ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలిగే విధంగా ఎమ్మెల్యే గురువారం అన్ని పక్షాలను ఆహ్వానించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రారంభమైన పది నిమిషాలకే తమ దుష్ప్రచారం ఎదురుతన్నిందని టీడీపీ నాయకులకు అర్థమైంది. అక్కడే చాలాసేపు ఉంటే ప్రజల్లో అపహాస్యం పాలవుతామని గ్రహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వారి సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తుండటంతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. దీంతో అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. సూక్ష్మ పోషకాలు జోడించిన రైస్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ12 లాంటి సూక్ష్మ పోఠషకాలు త క్కువ పరిమాణంలో బి య్యంతో జోడించడాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. అనీమియా(రక్తహీనత) సైలెంట్ కిల్లర్. దీనిని అధిగమించాలంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ12 అవసరం.ప్రభుత్వాలు చాలా పరిశోధనలు చేసి ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేసి అందిస్తున్నారు. – ఎం. అరుణ, ప్రొఫెసర్, పద్మావతి మహిళా వర్సిటీ అవగాహన సదస్సు హర్షణీయం ప్రజలకు ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం హర్షణీయం. విదేశాల్లో పాలు మొదలుకొని ప్రతి ఆహార పదార్థం పోర్టిఫైడే. చిన్నారులు, గర్భిణులు, బాలింతలే కాకుండా ప్రతి ఒక్కరూ పోర్టిఫైడ్ రైస్‌ను ఆహారంగా తీసుకోవాలి. –డా. ఎ. మంజుల, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీ యూనివర్శిటీ, తిరుపతి ప్రతి ముగ్గురిలో ఒకరికి అనీమియా ప్రతి ముగ్గురిలో ఒకరికి అనీమీయా ఉంది. దీనిని నివారించడంలో భాగంగా సూక్ష్మ పోషకాలను ప్రభుత్వం బియ్యంతో జోడించి పంపిణీ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియక వీటిని ప్లాస్టిక్ బియ్యం అంటున్నారు. అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించడం శుభపరిణామం. –డా.జావలి ప్రసూన, మెడికల్ ఆఫీసర్, పెద్దచెప్పలి పీహెచ్సీ ఫోర్టిఫైడ్ ఆలోచన 1994లోనే ఉద్భవించింది ఫోర్టిఫైడ్ ఆలోచన 1994లోనే ఉద్భవించింది. ఆ సమయంలో చేసిన సర్వేల్లో అనీమియా, జింక్ లోపాలు లేకపోవడంతో అది మరుగున పడింది. పదేళ్ల తర్వాత చేసిన సర్వేల్లో రోగాలన్నీ ఉన్నట్లు గుర్తించారు. ఫోర్టిఫైడ్ బియ్యం బలవర్ధకమైన ఆహారం. –డా. శ్రీనివాసాచారి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్,కడప భారత్‌ను డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది ప్రతి నలుగురిలో ఒకరికి అనీమియా ఉందని భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. జిల్లాలో చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీనిని తరిమికొట్టాలి. లేకపోతే ప్రాణ నష్టం జరగుతుందని గ్రహించిన భారత్ ప్రజలకు ఫోర్టిఫైడ్ బియ్యం అందించాలనే ఆలోచనకు వచ్చింది. –డా. ప్రశాంతి, కేవీకే కడప -
'అప్పుడే అబద్ధం ఆడి ఉంటే...'
కడప కార్పొరేషన్: గత శాసనసభ ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక్క అబద్ధం ఆడి ఉంటే 175 సీట్లు తమకు వచ్చి ఉండేవని ఆ పార్టీ ఎమ్మెల్యే, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అబద్ధం ఆడకుండా నిజాయితీగా ఉండడం వల్లే వైఎస్ జగన్ నేడు ప్రతి పక్షంలో ఉన్నట్టు చెప్పారు. మంగళవారం కడపలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ తరఫున టేబుల్ ఫ్యాన్ గుర్తుతో ఉన్న పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు టేబుల్ ఫ్యాన్ గుర్తు వచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారంటే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు టేబుల్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు విధానాలు ఆర్టీసీని దివాలా తీసేలా ఉన్నాయని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. -
కలెక్టరుపై లోకాయుక్తలో ఫిర్యాదు
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్సార్ జిల్లా కలెక్టరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. కలెక్టరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. కలెక్టర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. అదే విధంగా అధికారుల పట్ల ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జిల్లాకు వస్తున్నపుడు కనీసం సమాచారం కూడా అందిచడం లేదని వాపోయారు. కలెక్టరుకు ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదన్నారు. ప్రతి పనికీ కమిషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. బ్రిటీష్ హయాంలో కూడా ఇలాంటి కలెక్టరు లేరని.. ఆయనపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కలెక్టర్ అవినీతికి పాల్పడ్డారని సస్పెండ్ చేసిన చంద్రబాబు ఏ విధంగా వైఎస్ఆర్ జిల్లాకు నియమించారని ప్రశ్నించారు. -
'ప్రాజెక్టులకోసం అవిశ్రాంత పోరాటం'
కడప: ఉద్యమనేతలు, సహచర ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష సభ్యుల సూచన మేరకు దీక్షను విరమిస్తున్నానని, మెట్ట ప్రాంతం ఉన్నతి కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని వైఎస్ఆర్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. 'గాలేరు-నగరి'కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా ఆయన వీరపునాయుని పల్లెలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో అఖిలపక్ష నేతల సూచనతో గురువారం ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయలసీమకు జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ జీవనాధారమని, వాటి కోసం అన్ని పక్షాలతో కలిసి అవిశ్రాంత పోరాటం చేస్తామన్నారు. కాగా ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వ స్పందన లేకపోవడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు గురువారం జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాయి. -
'అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది'
అనంతపురం: మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చే సత్తా ఆయన తనయుడు వైఎస్ జగన్ కు మాత్రమే ఉందన్నారు. జగన్ సీఎం అయిన మరక్షణమే డ్వాక్రా రుణాలను మాఫీ చేయడమే కాకుండా, వంట గ్యాస్ పై రూ.100 సబ్సిడీ అమలు చేస్తారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వసనీయతను కోల్పోయారన్నారు. -
నమ్మించి నిండా ముంచారు
హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు జనాన్ని నమ్మించి మోసం చేశారని, వారు సమైక్య ద్రోహులని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. హిందూపురంలో మంగళవారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తామని, బిల్లును అడ్డుకుంటామని కల్లబొల్లి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి చివరికి టీబిల్లు వచ్చిన తొలిరోజు అసెంబ్లీకి గైర్హాజరయ్యారని అన్నారు. రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమించాలని వైఎస్సార్ సీపీ సూచించినా.. పెడచెవిన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించి అశోక్‌బాబు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దిక్సూచిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కాంక్షతో విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి అలుపెరగకుండా వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తూనే ఉందన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఏకమై వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. ప్రజల మనసుల్లో నుంచి జననేత జగన్మోహన్రెడ్డిని దూరం చేయడానికి ఎత్తులు వేస్తున్నారని, ఎన్ని కుట్రలు పన్నినా వారి ఆటలు సాగవన్నారు. మోసం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలను బంగాళాఖాతంలో ముంచాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూపురం పట్టణానికి తాగునీటిని అందించడానికి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి రూ.660 కోట్లు వెచ్చించి శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారన్నారు. ఈ పనుల్లో కూడా మంత్రి రఘువీరారెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడటంతో ఇంకా చాలా గ్రామాలకు నీరు సరిగా అందడం లేదన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ హిందూపురంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తాగునీరిచ్చి అపర భగీరథుడిగా నిలిచారన్నారు. ఇప్పుడు ప్రజలకు వైఎస్ రుణం తీర్చుకునే సమయం అసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు నవీన్‌నిశ్చల్, ఇనాయతుల్లా, మీసాల రంగన్న తదితరులు మాట్లాడారు. సభలో టీ బిల్లు ప్రతులు చింపివేసి నిరసన తెలిపారు. -
ఐదవ రోజుకు చేరిన శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ ఆమరణ దీక్షలు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డిలు చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరింది. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్ర నాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేతల బ్లడ్‌షుగర్, సోడియం లెవల్ తగ్గాయని, దీక్షను ఇంకా కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అమర్నాథ్రెడ్డిల చేపట్టిన ఆమరణ దీక్షలు 2వ రోజుకు చేరాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం, రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాలను సమైక్యాంధ్రవాదులు కొనసాగిస్తున్నారు.