ravindra singh
-
దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు!
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాడు రాజస్థాన్‌కు చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువకుడు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చక్కని వాగ్ధాటి, అగర్గళమైన, చురుకైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు. బార్మర్- పశ్చిమ రాజస్థాన్, ముఖ్యంగా బార్మర్-జైసల్మేర్-బలోత్రా నియోజకవర్గం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర బిందువుగా మారింది. ఇది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 1.9 మిలియన్ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 7 లక్షల మంది జాట్లు, 2.5 లక్షల రాజ్‌పుత్ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికల రణరంగం ముక్కోణపు పోటీని చూస్తోంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేరామ్ బేనివాల్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి పోటీలో ఉండటంతో అందిరి దృష్టి ఈ నియోజక వర్గంపై పడింది. ఆకట్టుకునే ప్రసంగాలు బార్మర్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయాన్ని రుచి చూసిన రవీంద్ర, ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాంప్రదాయ ద్విముఖ భావాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా భాటి ప్రజాదరణ ఆయన సొంత నియోజకవర్గానికి మించి విస్తరించింది. ఈయన ఆకర్షణ, ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించాయి. ప్రచారం ముమ్మరం కావడంతో భాటి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక పర్యటనను ప్రారంభించారు. రవీంద్ర భాటి బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడానికి అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. అదేవిధంగా హైదరాబాద్‌లోనూ ప్రజాదరణ లభించింది. ఆయన విమానాశ్రయానికి రాకముందే జనాలను ఆకర్షించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకున్నప్పుడు అతని పేరు కొన్ని మైళ్ల వరకు ప్రతిధ్వనించింది. రవీంద్ర భాటి నేపథ్యం రవీంద్ర సింగ్ భాటి బార్మెర్లోని దుధోడా అనే గ్రామానికి చెందిన రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించిన రవీంద్ర భాటి తన పాఠశాల విద్యను ప్రభుత్వ స్కూల్లో పూర్తి చేశారు. జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీలో 2019 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రవీంద్ర భాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ నుంచి మొదట టికెట్‌ను కోరినప్పటికీ, చివరికి తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతని విజయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విశ్వవిద్యాలయం 57 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకున్న మొదటి స్వతంత్ర అభ్యర్థిగా రవీంద్ర సింగ్ బాటీ నిలిచాడు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో భాటి రాజకీయ పథం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ఎదుర్కొని భాటి విజయం సాధించారు. సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్‌సభ బరిలో నిలిచారు. #संबोधन pic.twitter.com/4CU0fnZTwe — Ravindra Singh Bhati (@RavindraBhati__) April 9, 2024 -
టీఆర్ఎస్లోకి రవీందర్ సింగ్ రీ ఎంట్రీ
-
ఉపరాష్ట్రపతి, కేటీఆర్‌లు మెచ్చిన పథకం..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు చేసేందుకు శ్రీకారం చుట్టిన కరీంనగర్ నగరపాలక సంస్థపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్’అంటూ కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ ప్రవేశపెట్టిన పథకంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్, మేయర్ రవీందర్‌సింగ్‌కు అభినందనలు’అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లను ప్రశంసించారు. పేదలకు ఎంతగానో ఉపయోగపడే పథాకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. ఇక అన్ని ప్రాంతాల్లోనూ ఈ పథకం సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తామని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. ఇక సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ రవీందర్ సింగ్ ఈ పథకం గురించి వివరించారు. శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అంత్యక్రియలను కూడా నగరపాలక సంస్థ బాధ్యతగా చేపడుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబాల్లో అంత్యక్రియలకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అప్పుల కోసం కాళ్లావేళ్లా పడటం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. అందుకే ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా వారి వారి సంప్రదాయాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు మంజూరు చేశామని, రెండు వ్యాన్లు, ఫ్రీజర్లు కూడా కొనుగోలు చేస్తున్నామని, పార్థివదేహాలను కాల్చేవారికి కట్టెలు, కిరోసిన్, పూడ్చిపెట్టే వారికి గొయ్యి తవ్వడం వంటివి సమకూర్చుతామని వివరించారు. జూన్ 15వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దాతలు కమిషనర్ అకౌంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చని, సీఎస్ఆర్ ద్వారా సేవ చేయాలనుకునే వారు తమతో కలసి పనిచేయాలని కోరారు. -
ఎమ్మెల్యేకు సీజేఐ కథ, జరిమానా
న్యూఢిల్లీ: 23 సంవత్సరాల క్రితం ఓ మేగజిన్‌లో రాసిన ఆర్టికల్‌పై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యేకు ప్రధాన న్యాయమూర్తి భారీగా జరిమానా విధించారు. బీహార్‌లోని ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ 1994లో తనపై నియచక్ర మేగజిన్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన సీజేఐ జేఎస్ ఖెహర్.. ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టులో పిటిషన్ వేయడంపై రవీంద్రను ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇచ్చిన రవీంద్ర.. 2013లో తాను ఆ ఆర్టికల్‌ను చదివానని చెప్పారు. పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... కోర్టు పిటిషన్‌ను తీసుకునేందుకు తిరస్కరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానానికి తృప్తి చెందని న్యాయమూర్తి పిటిషన్ అమూల్యమైన కోర్టు సమయాన్ని వృథా చేసిందని అన్నారు. ప్రజాప్రతినిధి ఉండి చట్టాన్ని దుర్వినియోగం చేయాకూడదని వ్యాఖ్యానించారు. ఏళ్ల తర్వాత పిటిషన్‌ను ఫైల్ చేసినందుకు పిటిషనర్‌కు రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో నివ్వెరపోయిన రవీంద్రసింగ్ జరిమానాను రద్దు చేయాలని కోరారు. రవీంద్ర అభ్యర్ధనపై స్సందించిన సీజేఐ.. తాను విద్యార్థి దశలో ఉన్న సమయంలో హాస్టల్లో జరిగిన ఓ సంఘటను చెప్పారు. హాస్టల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ విద్యార్థికి రూ.25 జరిమానా విధించారని చెప్పారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు తక్కువ జరిమానా విధించింనందుకు సదరు విద్యార్థి వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిపారు. జడ్జి చెప్పిన కథతో కోర్టులో నవ్వులు పూశాయి. ఆ విద్యార్థిలాగే రవీంద్ర కూడా రూ.10 లక్షల జరిమానాకు ఇంకొంచెం ఎక్కువ చెల్లించాలని న్యాయమూర్తి అన్నారు. -
పత్థర్ కా గో్‌ష్
సిటీ స్పెషల్: పత్థర్ కా గోష్.. రాతిపైన వండటమే దీని ప్రత్యేకత. అందుకే దీనికాపేరు వచ్చింది. ఒక్కసారి రుచి చూస్తే చాలు... మళ్లీమళ్లీ కావాలంటారు. మటన్‌తో చేసిన వెరైటీల్లో అత్యంత రుచిగా ఉంటుందని ఈ వంటకాన్ని తిన్నవారెవరైనా చెబుతారు. అరుదైన ఈ హైదరాబాదీ కబాబ్ ఇప్పుడు అంతర్థానమవుతోంది. లేత మాంసాన్ని మాత్రమే ఈ వంటకానికి వినియోగిస్తారు. సన్నగా, వెడల్పుగా కోసిన మాంసం ముక్కలను మసాలా మిశ్రమంలో ఆరు గంటల పాటు నానబెట్టాలి. మిశ్రమం తయారీలో దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, మిరపపొడి, నిమ్మకాయ వాడతారు. రాతిని శుభ్రం చేసేందుకు దానిపైన ఉప్పువేస్తారు. నిప్పు వేడికి ఉప్పు నలుపు రంగు కాగానే శుభ్రమైన బట్టతో తుడుస్తారు. నేరుగా రాతిపైన ముక్కలు వేస్తారు. 15-20 నిమిషాల్లో చక్కగా ఫ్రై అవుతాయి. నూనె వాడే అవసరమే లేదు. కానీ కొన్ని హోటళ్లలో రుచి కోసం ఆలివ్ నూనె, నెయ్యి కూడా వినియోగిస్తున్నారు. ఫ్రై అయినప్పటికీ ముక్కలు మృదువుగా ఉంటాయి. కొత్తదనం కోసం పత్థర్ కా గోష్ రోల్స్ కూడా చేస్తుంటామని టోలిచౌకిలో ఉన్న 4 సీజన్స రెస్టారెంట్ సీనియర్ చెఫ్ సుబల్ పాల్ చెబుతున్నారు. వంటకాన్ని రుచి చూసినవారెవరైనా మళ్లీ కావాలంటారని చెప్పారు. మిక్స్డ్ గ్రిల్ ప్లాటర్‌లో పత్థర్ కా గోష్‌ను చేర్చాలని ఎక్కువ మంది కస్టమర్లు డిమాండ్ చేస్తారని మేనేజర్ రవీందర్ సింగ్ అంటారు. హైదరాబాద్‌తోపాటు లక్నో, పంజాబ్‌లో సైతం ఈ వంటకం దొరుకుతోందని చెప్పారాయన. మాంసం మృదువుగా ఉంటుంది కాబట్టి పెద్ద వయస్కులు ఇష్టంగా తింటారని చెప్పారు. తమ రెస్టారెంట్లో రోజుకు ఎంతకాదన్నా 40 దాకా ప్లాటర్లు, పత్థర్ కా గోష్ 50 ప్లేట్లు అమ్ముడవుతాయని వివరించారు. దివంగత వైఎస్ఆర్కు కూడా తమ రెస్టారెంట్ నుంచి ఈ వంటకాన్ని సరఫరా చేశామన్నారు. రాజకీయ నాయకులు, సినీ తారలు ఎందరో పత్థర్ కా గోష్‌ను అమితంగా ఇష్టపడతారని వివరించారు. మలేసియా, దుబాయ్, ఒమన్, పాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతిథులు ఈ అరుదైన వంటకాన్ని ఆస్వాదిస్తున్నారు. - మహేందర్ -
కార్పొరేటర్ల కేసులో ముగిసిన వాదనలు
నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా గెలిచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం కార్పొరేటర్ల కేసు రసవత్తంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా గెలిచిన నలుగురు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాన్ని నిలిపి వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం వెకేషన్ కోర్టు(ఫ్యామిలీ)లో వాది, ప్రతివాదుల మధ్య తీవ్ర వాదనలు కొనసాగాయి. నలుగురు కార్పొరేటర్లపై గురువారం వెలువడనున్న తీర్పు ఏ విధంగా ఉంటుందోనని న్యాయవాదులు, కక్షిదారులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల మద్దతుదారులతో కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. వాది, ప్రతివాదుల మధ్య వాదనలు విన్న జిల్లా వెకేషన్ కోర్టు(ఫ్యామిలీ) జడ్డి రవీంద్రసింగ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించనున్నట్లు తీర్పు చెప్పారు. వాదోపవాదనలు నిజామాబాద్ నగర పాలకసంస్థ పరిధిలోని 25, 29, 36, 39 డివిజన్లకు చెందిన ఎంఐఎం కార్పొరేటర్లు ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నారని, ఆధార్‌కార్డు ఆధారంగా వీరి ఎన్నిక చెల్లదంటూ చేసిన ఆరోపణలు సరైనవి కావని వారి తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. సాంకేతికపరంగా ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న పరిజ్ఞానంతో కంప్యూటర్లో ఆధార్‌కార్డులో ఉన్నది లేన్నట్లు, లేనిది ఉన్నట్లుగా చూపించవచ్చన్నారు. పిటిషనర్లు కోర్టుకు సమర్పించిన ఆధార్‌కార్డులు నమ్మకశ్యంగా లేవని, రాజకీయంగా కార్పొరేటర్లను దెబ్బతీసేందుకు ఆధార్‌కార్డును అడ్డం పెట్టుకుని వేసిన ఎత్తుగడ్డ అని వాదించారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తేదీ ఇంకా ఖరారు కానప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాన్ని ఎందుకు నిలిపి వేయాలని ప్రతివాదుల తరపున న్యాయవాది కోరుతున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రతివాది తరపున న్యాయవాది అభ్యంతరం చెబుతూ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు కాకున్న, ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందన్నారు. తాము సేకరించిన ఆధార్‌కార్డు అనేది పబ్లిక్ డాక్యుమెంటేషన్. దీనిని ఇంటర్నెట్ ద్వారా ఎవిడెన్స్ యాక్టు ద్వారా తీసుకుని కోర్టుకు సమర్పించామన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుధీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. వాది, ప్రతివాదుల వాదోపవాదాలు విన్న జడ్జి ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయవచ్చా లేదా అనే మధ్యంతర ఉత్తర్వులు శుక్రవారం వెలువరించనున్నట్లు తీర్పు నిచ్చారు. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది తులా గంగాధర్, న్యాయవాది నరేష్, వాది తరపున హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సుజుల్లాఖాన్ వాధించారు. మరో ఇద్దరి కార్పొరేటర్లపై దావా.. ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న నలుగురు ఎంఐఎం కార్పొరేటర్లపై కోర్టులో కేసు కొనసాగుతుండగా, తాజాగా మరో ఇద్దరిపై కోర్టులో దావా దాఖలైంది. 13 డివిజన్లో ఎంఐఎం పార్టీ తరపున పోటీచేసిన మహమ్మద్ యూసఫ్ అలీకి, 37వ డివిజన్లో మీర్ పర్వేజ్ అలీకి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నట్లు వారి సమీప ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయించారు. 13వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచిన ఎండీ జావేద్‌అలీ(సాబెర్అలీ), 37వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దూల్ కరీం బబ్బూలు ఎంఐఎం కార్పొరేటర్లపై దావా వేశారు. వీరి తరపున న్యాయవాది ఆకుల రమేష్ కార్పొరేటర్లపై కోర్డులో దావా వేశారు. గురువారం కోర్డు దావాలను స్వీకరించి రిజిష్ట్రర్ చేసింది. దీంతో ఈ కార్పొరేటర్లకు త్వరలో నోటీసులు జారీ కానున్నాయి. వీరితో కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ల సంఖ్య ఆరుకు చేరింది. కేసులో మరికొందరు.. అధిక సంతానం కలిగి ఉండి ఎన్నికలో పోటీచేసి గెలిచిన వారిపై వారి సమీప ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నటు తెలిసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన అభ్యర్థులు తమపై గెలిచిన అభ్యర్థుల వివరాలు సేకరించే పనుల్లో పడ్డారు. ఎంఐఎం పార్టీకి చెందిన వారే కాకుండా ఇతర పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులపై సమీప ప్రత్యర్థులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందులో టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరి పోటీచేసి కార్పొరేటర్‌గా గెలిచిన మహిళా కార్పొరేటర్‌పై సమీప కాంగ్రెస్ అభ్యర్థి కోర్టులో దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇలా మరికొందరు ఉండవచ్చనే వారి సమీప ప్రత్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.