ravishanker prasad
-
సిమీ, ఐసిస్‌పై ఎందుకు మాట్లాడరు?
న్యూఢిల్లీ: సంఘ్ ముక్త భారత్‌కు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునివ్వటంపై కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఐసిస్, సిమీ, లష్కరే వంటి సంస్థల గురించి నితీశ్ ఎప్పుడూ మాట్లాడలేదెందుకని ప్రశ్నించారు. 60 ఏళ్ల పాలనలో దేశాన్ని కులం, మతం, అవినీతితో భ్రష్టు పట్టించిన పార్టీతో చేతులు కలిపేందుకు నితీశ్ అర్హుడని వెంకయ్య విమర్శించారు. ప్రధాని పేదరికం, అవినీతి, నిరుద్యోగ విముక్త భారత్ నిర్మిద్దామనుకుంటే దీనికి సహాయం చేయాల్సిందిపోయి.. ఆరెస్సెస్ విముక్త భారత్‌పై విపక్షాలు వ్యాఖ్యానించటం సిగ్గుచేటని రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. -
'ఎందుకింత రాద్ధాంతం'
సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్న పరిణామాలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..దేశంలో ఎన్నో పెద్ద సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇలాంటి నిరసనలు తెలుపలేదని.. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జన్సీ విధించినప్పుడు, ఏడాదిన్నర క్రితం జరిగిన ముజఫరాబాద్ అల్లర్ల సమయంలోకూడా మౌనంగా ఉన్నవారు ఇప్పుడు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ఈ ఘటనలపై మాట్లాడారనీ అయినప్పటికీ ఈ ఘటనలపై విమర్శలు ఆపకపోవడం విచారకరమని రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పురస్కారాలు పొందిన పరిశోధకులు, రచయితలపై తమకు గౌరవం ఉందనీ.. వారి సేవలను, ప్రతిభను గుర్తిస్తూ ఇచ్చిన పుస్కారాలుగా వాటిని చూడాలన్నారు. కాగా దాద్రీ ఘటన, కన్నడ రచయిత కాల్బుర్గి హత్యల నేపథ్యంలో రచయితలు, సాహితీవేత్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. రచయితలు, సాహితీ వేత్తలతో పాటు అనువాదకులు సుమారు 27 మంది తమకు లభించిన సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్ రచయిత్రి దలిప్ కౌర్ ఏకంగా తనకు లభించిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేశారు.