సిమీ, ఐసిస్‌పై ఎందుకు మాట్లాడరు?
న్యూఢిల్లీ: సంఘ్ ముక్త భారత్‌కు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునివ్వటంపై కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఐసిస్, సిమీ, లష్కరే వంటి సంస్థల గురించి నితీశ్ ఎప్పుడూ మాట్లాడలేదెందుకని ప్రశ్నించారు.
60 ఏళ్ల పాలనలో దేశాన్ని కులం, మతం, అవినీతితో భ్రష్టు పట్టించిన పార్టీతో చేతులు కలిపేందుకు నితీశ్ అర్హుడని వెంకయ్య విమర్శించారు. ప్రధాని పేదరికం, అవినీతి, నిరుద్యోగ విముక్త భారత్ నిర్మిద్దామనుకుంటే దీనికి సహాయం చేయాల్సిందిపోయి.. ఆరెస్సెస్ విముక్త భారత్‌పై విపక్షాలు వ్యాఖ్యానించటం సిగ్గుచేటని రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.