రావూస్ స్కూల్‌పై కేసు నమోదు
హైదరాబాద్: బీహెచ్ఈఎల్ ప్రాంతంలోని రావుస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. యూనిఫాం వేసుకురాలేదని ఓ ఐదో తరగతి విద్యార్థినిని బాలుర మూత్రశాల వద్ద నిలబెట్టిన సంఘటనపై బాలిక తండ్రి రామచంద్రాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు జువైనల్ జస్టిస్ యాక్టు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్, పీఈటీపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.