ravva
-
పేదరికాన్ని జయించి భాషా సాహిత్యాలలో రాణించిన ఆచార్య రవ్వా శ్రీహరి
నల్లగొండ జిల్లా వెల్వర్తి లోని పేద చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టిన (1943) ఒక కుర్రవాడు యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి సంస్మృత విద్యా పీఠంలో చేరడమే విశేషమైతే అందులోని అంతా బ్రాహ్మణ సహ విద్యార్థులతో పోటీపడి ఉన్నత స్థానంలో నిలవడం మరో విశేషం. కష్టపడి డీవోఎల్, బివోఎల్, బిఏ, ఎంఏ వంటి ఎన్నో మెట్లు ఎక్కి డాక్టరేట్ కూడా చేసి (1973), హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం లో బహుకాలం బోధనచేసి, ద్రావిడ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు కాగలిగాడు (2002), ఉత్తమ పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సంస్కృతంలో,తెలుగులో భాషా సాహిత్యాలపై ఎన్నో పరిశోథనాత్మకమైన రచనలు చేసి 'మహా మహోపాధ్యాయ' అనిపించుకున్న మహనీయుడు ఆచార్య రవ్వా శ్రీహరి ఇక లేరు అన్న వార్త వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులనే కాదు నా లాంటి ఎంతో మంది వారి అభిమానులను కూడా శోక సాగరంలో ముంచింది. అన్నమయ్య పదకోశాన్ని తయారుచేసిన, శ్రీహరి నిఘంటువు రూపొందించిన, నల్లగొండ జిల్లా మండలికాలు అక్కడి ప్రజల భాషపై ఎన్నో గ్రంధాలు రచించిన అంతటి గొప్ప పండితుడు. వరంగల్ కు చెందిన, సహకార శాఖలో నా సీనియర్ అయిన డాక్టర్ ఏ.సురేంద్ర కుమార్ గారి ద్వారా మా అన్న కీశే వేముల పెరుమాళ్ళు గారి ప్రసిద్ధ గ్రంథం 'తెలంగాణ జాతీయాలు' పుస్తకం గురించి విని తెప్పించుకొని చదివి ప్రశంసించడం ఇంకా గొప్ప విషయం. 2005లో 'మానవతా పరిమళాలు' పేరుతో మా అన్నగారి స్మారక సంచిక ప్రచురించి నప్పుడు దానికి సందేశం పంపుతూ ' రాజకీయ రంగంలో ఉంటూ ప్రజాహిత కార్యాల్లో తలమునకలౌతూ కూడా భాషా, సాహిత్య రంగాల్లో కృషి చేయడం ప్రశంసనీయం. పెరుమాళ్ళు గారి 'తెలంగాణ జాతీయాలు' అన్న గ్రంధం భాషా రంగంలో వారు చేసిన కృషికి అద్దం పడుతుంది.తెలంగాణ భాష ప్రత్యేకతను విశిష్ట తను చాటుతుంది కూడా ' అని అభినందించారు. అంతేకాదు 12 సెప్టెంబర్ 2009 నాడు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ గ్రంధావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -వేముల ప్రభాకర్, రచయిత , రిటైర్డ్ ప్రభుత్వ అధికారి -
రవ్వా శ్రీహరి కన్నుమూతపై సీఎం జగన్ సంతాపం
సాక్షి, గుంటూరు: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి(80) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, సంస్కృత భాషల్లో పండితుడు, సాహితీవేత్త అయిన రవ్వా శ్రీహరి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు సీఎం జగన్. మరోవైపు రవ్వా శ్రీహరి మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, రచయితలు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు అని సాహితీవేత్తలు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ యూనివర్సిటీ వీసీగా పని చేశారు ఆచార్య రవ్వా శ్రీహరి. టీటీడీలోనూ ఆయన కొంతకాలం పని చేశారు. తెలంగాణ నల్లగొండ జిల్లా వెల్వర్తిలో ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించారు శ్రీహరి. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశాడు. హైదరాబాద్ మలకపేట యశోద ఆసుపత్రి ఎదురుగా వున్న జడ్జెస్ కాలనీలోని రుక్మిణి అపార్టుమెంట్లో ఆయన నివాసం ఉంది. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి
శీతాకాలం పగలు తక్కువ.. రాత్రి ఎక్కువ. రాత్రి వేళల్లో చలి ఎక్కువ. భోజనం బరువుగా ఉండకూడదు. అలాగని తక్కువ తింటే పోషకాలందవు. కొద్దిగా తిన్నా సరే... అది సమతులంగా ఉండాలి. ఆహారాన్ని దేహం వెచ్చగా ఒంటబట్టించుకోవాలి. అందుకే... ఇది ట్రై చేసి చూడండి. పాంజిరి కావలసినవి: ►సన్నగా తరిగిన బాదం – కప్పు ►యాలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు ►దోస గింజలు – పావు కప్పు ►తర్బూజ గింజలు – పావు కప్పు ►పిస్తా పప్పు – పావు కప్పు (తరగాలి) ►వాము – అర టీ స్పూన్ ►ఎండు కొబ్బరి తురుము – కప్పు ►అల్లం తరుగు లేదా శొంఠి పొడి– 2 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు– కప్పు (చిన్న పలుకులు) ►తామరగింజలు – కప్పు ►వాల్నట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – 3 టేబుల్ స్పూన్లు ►నెయ్యి– 3 టేబుల్ స్పూన్లు. ప్రధానమైన పదార్థాలు: ►సూజీ రవ్వ – కప్పు ►నెయ్యి – ఒకటిన్నర కప్పు ►గోధుమ పిండి – రెండున్నర కప్పులు ►బెల్లం పొడి – ఒకటిన్నర కప్పు. తయారీ: ►మందంగా ఉన్న బాణలిలో నెయ్యి వేడి చేసి తామర గింజలు (మఖానియా) వేయించాలి. ►వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాణలిలో జీడిపప్పు, వాల్నట్, బాదం, తర్బూజ, దోసగింజలు, పిస్తా, కొబ్బరి తురుము, కిస్మిస్ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►ఇందులో అల్లం తరుగు లేదా శొంఠి, వాము, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు ప్రధాన దినుసులను వేయించాలి. ►మరొక బాణలిలో నెయ్యి వేడి చేసి గోధుమ పిండి వేసి సన్నమంట మీద వేయించాలి. ►గోధుమ పిండి వేగి మంచి వాసన వస్తున్న సమయంలో సూజీ రవ్వ వేసి కలుపుతూ వేయించాలి. ►రవ్వ కూడా దోరగా వేగిన తర్వాత బెల్లం పొడి వేసి కలపాలి. ►ఇందులో ముందుగా వేయించి సిద్ధంగా ఉంచిన గింజల మిశ్రమాన్ని వేసి కలిపితే పాంజిరి రెడీ. ►దీనిని కప్పులో వేసుకుని పొడిగా స్పూన్‌తో తినవచ్చు. పాలిచ్చే తల్లులకు ప్రయోజనకరం ►పిల్లలు కింద పోసుకోకుండా మొత్తం తినాలంటే మరికొంత నెయ్యి వేసుకుని లడ్డు చేయాలి. ►ఇది ఉత్తరభారతదేశంలో బాలింతకు తప్పనిసరిగా పెట్టే స్వీట్. ►పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం. చదవండి: Kismis Doughnuts: మైదాపిండి, పంచదార.. కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా! Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా -
Ganesh Chaturthi Recipes: రవ్వ పూర్ణాలు ఇలా తయారు చేసుకోండి!
బొజ్జ గణపయ్యకు ప్రీతికరమైన రవ్వ పూర్ణాలు ఇలా తయారు చేసుకోండి. రవ్వ పూర్ణాలు కావాల్సిన పదార్థాలు: ►బొంబాయి రవ్వ- 2 కప్పులు ►యాలకుల పొడి- 1 టీస్పూన్ ►కార్న్‌ఫ్లోర్- 1/4 కప్పులు ►పంచదార- 2 1/2 కప్పులు ►నెయ్యి- 1/2 కప్పు ►మైదాపిండి- 1 1/2 కప్పు ►బియ్యం పిండి- 1/4 కప్పు తయారు చేసే విధానం: ►బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి. ►3 వంతులు ఉడికిన తర్వాత పంచదార, పంచదార యాలకుల పొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. ►మైదా కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకోవాలి. ►చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి. ఇవి కూడా ట్రై చేయండి: Bread Jamun Recipe: బ్రెడ్ జామూన్ ఇంట్లోనే తయారీ ఇలా! Kalakand Laddu Recipe: దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా! -
చమురు మీకు.. కన్నీరు మాకా..
‘రవ్వ’ క్షేత్రం వద్ద ఎస్.యానాం వాసుల ఆందోళన ఊరిలో ప్రతి వారికీ ఉపాధి కల్పించాలని డిమాండ్ మద్దతుగా నిలిచిన వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు పలువురు నాయకులు సహా వంద మంది అరెస్టు ఉప్పలగుప్తం : రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న చమురు వెలికితీత తమ జీవితాలకు వెతలనే మిగిల్చిందని ఎస్.యానాం వాసులు ఆక్రోశించారు. కేజీ బేసిన్లో చమురు సహజవాయు నిక్షేపాలు వెలికితీస్తున్న రవ్వ చమురు క్షేత్రం వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చమురు సంస్థ కార్యకలాపాల వల్ల గ్రామంలో బడుగు, బలహీనవర్గాల వారికి జీవనోపాధి కరువైందని, రాను రాను వ్యవసాయం కనుమరుగై రైతు కూలీలు, పర్రభూముల్లో మత్స్య సంపద తగ్గిపోయి మత్స్యకారులు పస్తులుండే పరిస్థితి దాపురించిందని ఆందోళనకు సారథ్యం వహించిన బొక్కా వెంకట సుబ్బారావు, లంకే లక్ష్మణరావు, నల్లి ధర్మరాజు అన్నారు. ఈ విషయమై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేక రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు కలెక్టర్‌ను కలసి తమ డిమాండ్లు తెలియజేశామన్నారు. అయినా పట్టించుకోకపోవడంతో రవ్వ క్షేత్రంలో కార్యకలాపాలను అడ్డుకోవాలనే ఆందోళన చేపట్టామన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు సుమారు మూడు వందల మంది రవ్వ ప్లాంట్ గేట్ ముందు సోమవారం ఉదయం ఆరుగంటల నుంచి ఆందోళన చేపట్టారు. డిమాండ్లు ఇవే.. ‘ఎస్.యానాంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి. లేని పక్షంలో కుటుంబానికి రూ.5 వేల భృతి ఇవ్వాలి. కాలుష్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నందున ప్రతి ఒక్కరికీ కార్పోరేట్ ఆసుపత్రిలో వైద్యానికి హెల్త్ కార్డు ఇవ్వాలి. విద్య వైద్యరంగాలకు ప్రాధాన్యతనిచ్చి గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలి’ అన్న ప్రధాన డిమాండ్లతో ఆందోళన జరిగింది. తమ ఆకాంక్షలపై ఎంపీ, ఎమ్మెల్యే, ఆర్డీఓతో పాటు రవ్వ యాజమాన్య సంస్థ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల మద్దతు ఎస్.యానాం గ్రామస్తుల పోరాటానికి సీపీఎం, ఐద్వా, వ్యవసాయ కార్మికసంఘం, పీడీఎస్ఓ, కాంగ్రెస్‌తో పాటు దళిత సంఘాలు మద్దతుగా నిలిచాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ గ్రామస్తుల వేదనను వినే నాథుడు లేకపోవడం బాధాకరమన్నారు. డివిజన్ కార్యదర్శి మోర్త రాజశేఖర్, వ్యవపాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, పీడీఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, కాంగ్రెస్ నేతలు గెడ్డం సురేష్‌బాబు, జోగి అర్జునరావు, చీకట్ల శ్రీను, దళితనాయకుడు ఇసుకపట్ల రఘుబాబు ఆందోళనకు మద్దతు తెలిపారు. డిమాండ్లు పరిశీలిస్తాం... సెక్షన్ 30 అమల్లో ఉంది డిమాండ్లను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఆందోళన విరమించాలని తహసీల్దారు ఎస్.సుబ్బారావు చెప్పినా ఆందోళనకారులు వినలేదు. నాయకులు, అధికారులు తమ ముందుకే రావాలని భీష్మించారు. డీఎస్పీ ఎల్ అంకయ్య సూచన మేరకు అమలాపురం సీఐ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను లాఠీలతో చెదరగొట్టి పోలీస్వాహనాల్లో ఎక్కించారు. ఈ సందర్భంగా పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. నలుగురు సీఐలు, 12 మంది ఎస్సైలతో పాటు భారీగా మోహరించిన పోలీస్ బలగాలు ఆందోళనకారుల శిబిరాన్ని ఖాళీ చేయించాయి. శేషుబాబ్జీ, కారెం వెంకటేశ్వరరావు, రమణి, రేవు తిరుపతిరావు, మోర్త రాజశేఖర్‌లతో పాటు వందమందిని పోలీస్‌లు అరెస్ట్ చేసి అమలాపురం స్టేషన్‌కు తరలించారు.