Razia
-
Paris Olympics 2024: పతకమేదైనా తల్లికి బంగారమే
పోటీ అనేది ఆట వరకే పరిమితం. ఆ తరువాత అంతా మనం మనం’ అని చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా... స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి పాకిస్తాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ గురించి, అర్షద్ నదీమ్ తల్లి రజీయా పర్వీన్ నీరజ్ చోప్రా గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన మాటలు క్రీడా స్ఫూర్తికి అద్దం పట్టాయి.స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెల్చుకున్నాడు. అయితే ఆయన గెలుచుకున్న రజతం చాలామందికి సంతోషాన్ని ఇవ్వలేదు. అద్భుత శక్తిసామర్థ్యాలు ఉన్న, ఎంతో ఘన చరిత్ర ఉన్న నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సొంతం చేసుకోకపోవడం చాలామందిని నిరాశ పరిచింది.మరోవైపు పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ స్వర్ణం గెలుచుకున్నాడు.‘అర్షద్ నదీమ్ కూడా నా కుమారుడిలాంటివాడే’ అని స్పందించింది నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి. ఆ అమ్మ మాటను ప్రపంచం మెచ్చింది.పాకిస్తాన్‌కు చెందిన క్రీడాకారుడిని సరోజ్ దేవి మెచ్చుకోవడం కొద్దిమందికి నచ్చకపోయినా, వారిని ఉద్దేశించి నీరజ్ చోప్రా వివరణ ఇచ్చినా...స్థూలంగా ఆమె మాటలు అర్షద్ నదీమ్ గెలుచుకున్న బంగారం పతకం కంటే విలువైనవి.‘మా వాడు బంగారం పతకంతో వస్తాడనుకుంటే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది’ అని నిట్టూర్చలేదు సరోజ్ దేవి.‘రజతం అయినా బంగారం అయినా ఒక్కటే. ఇద్దరూ నా బిడ్డలే’ అన్నది.ఆమె మాటలు ప్రధాని నరేంద్ర మోదీకీ నచ్చాయి. ఆమె సహృదయతను ప్రశంసించారు.మరో వైపు చూస్తే... ‘నీరజ్ నా కుమారుడిలాంటివాడు. అతడి కోసం ప్రార్థిస్తాను. నీరజ్ ఎన్నో పతకాలు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటోంది అర్షద్ నదీమ్ తల్లి రజియా పర్వీన్.‘నా బిడ్డ తప్ప ఇంకెవరైనా బంగారు పతకం గెలుచుకోగలరా!’ అని బీరాలు పోలేదు. ఒకవైపు కుమారుడి చారిత్రక విజయానికి సంతోషిస్తూనే మరోవైపు నీరజ్ చో్ప్రా ప్రతిభను వేనోళ్ల పొగిడింది. పాకిస్తాన్, పంజాబ్‌లోని ఖనేవాల్ జిల్లాకు చెందిన అర్షద్ నదీమ్ కుటుంబం నీరజ్ చో్ప్రాను తమ ఇంటికి ఆహ్వానించింది.పోటీలకు అతీతంగా అర్షద్, నీరజ్‌లు ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి,.‘ఆటకు సంబంధించి ఎలా ఉన్నా మేము మంచి స్నేహితులం, అన్నదమ్ములం... అని అర్షద్ నాతో ఎన్నోసార్లు చె΄్పాడు’ అంటుంది రజియా పర్వీన్.‘నీరజ్ మా కుటుంబంలో ఒకరు. అతను పాకిస్తాన్‌కు వస్తే ఎయిర్ పోర్ట్ నుంచి మా ఇంటికి ఊరేగింపుగా తీసుకువస్తాం’ అంటున్నాడు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అర్షద్ నదీమ్ సోదరుడు షాహీద్ అజీమ్.ఇద్దరు మిత్రులునీరజ్ చోప్రాకు కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవడం అంటే ఇష్టం. పండగలు వస్తే చాలు మిఠాయిల పని పట్టాల్సిందే. ఆ తరువాత బరువు పని పట్టాల్సిందే.‘ఆటగాడికి కుటుంబ మద్దతు చాలా ముఖ్యం’ అంటాడు నీరజ్. ‘ఆటల్లో తొలి అడుగు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు కుటుంబం నాకు మద్దతుగా ఉంది. నా వెనుక నా కుటుంబం ఉన్నది అనే భావన ఎంతో శక్తిని ఇస్తుంది’ అంటాడు నీరజ్. ‘నేను’ అనే అహం నీరజ్‌లో కనిపించదు. ఎదుటివారి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేడు. ముఖాముఖీగా, మీడియా ముఖంగా అర్షద్ నదీమ్‌ను ఎన్నోసార్లు ప్రశంసించాడు నీరజ్ చోప్రా. అందుకే అతడంటే నదీమ్‌కు చాలా ఇష్టం.ఇక నదీమ్ గురించి చె΄్పాలంటే అతడు ఇంట్రావర్ట్. తక్కువగా మాట్లాడుతాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన నదీమ్‌కు ఆర్థిక భారం ఎన్నోసార్లు అతడి దారికి అడ్డుగా నిలబడేది. స్నేహితులు, సన్నిహితులు అతడి విదేశీ టోర్నమెంట్లకు సంబంధించి ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చేవారు. టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి నదీమ్‌కు పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. పాత జావెలిన్తోప్రాక్టిస్ చేయడం కష్టంగా ఉంది’ అంటూ సాగిన నదీమ్ సోషల్ మీడియా పోస్ట్ ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. నీరజ్ చో్ప్రా కూడా అర్షద్ నదీమ్‌కు మద్దతుగా మాట్లాడాడు. -
కృషి: ఇప్పపూల లడ్డు పసుపు మసాలా పానీయం
అడవి నుంచి దూరమయ్యాం.. పల్లె నుంచి పట్టణవాసంలో కరెన్సీ కోసం నిత్యం కసరత్తులు చేస్తున్నాం. కానీ, అడవి పంచే ఔషధం.. పల్లె ఇచ్చే పట్టెడన్నమే మనకు అమ్మ చేతి గోరుముద్దంత ప్రేమను అందిస్తుంది. అలాంటి ప్రేమకు వారధిగా నిలుస్తున్నారు గుంటూరు వాసి షేక్ రజియా. ఛత్తీస్‌గడ్‌లోని అటవీ ప్రాంతాల్లో గిరిజనుల స్థావరాలను వెతుక్కుంటూ వెళ్లి వారి ఆహారపు అలవాట్లు తెలుసుకుని, ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్’ పేరుతో సంస్థను నెలకొల్పి అక్కడి మహిళల చేత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయిస్తున్నారు. వాటికి పట్టణాల్లోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ విలువనూ.. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలనూ పెంచుతున్నారు. ఆరేళ్లుగా రజియా చేస్తున్న ఈ కృషి గురించి అడిగితే ఆమె ఎన్నో అడవి ముచ్చట్లను ఆనందంగా పంచుకున్నారు. ‘‘జగ్దల్పూర్లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ మెయిన్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి దంతెవాడ, బస్తర్‌లోనూ మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆదివాసీలున్న చోటును వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడి ఒక యూనిట్‌ని తయారు చేస్తాను. అలా ఇప్పటివరకు పదికి పైగా యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆదివాసీల ఆహార ఉత్పత్తులను నాణ్యంగా తయారు చేయిస్తుంటాను. వాటిని పట్టణవాసులకు మార్కెటింగ్ చేస్తుంటాను. వీటిలో.. మహువా (ఇప్పపూల) లడ్డూ, టీ పొడి, కుకీస్, పసుపు మసాలా, చింతపండు సాస్, ఇన్స్టంట్ చింతపండు రసం పౌడర్, చాక్లెట్స్, తేనె, సేంద్రియ బియ్యం, కారం, బెల్లం.. ఇలా 22 ఉత్పత్తులు ఉన్నాయి. ఆంధ్రా నుంచి ఛత్తీస్గడ్ మా నాన్నగారు గుంటూరులో ఉండేవారు. వ్యాపారరీత్యా ఛత్తీస్‌గడ్‌లో స్థిరపడ్డారు. అమ్మ, ఇద్దరు తమ్ములు, బాబాయ్ కుటుంబ సభ్యులు ..అందరం కలిసే ఉంటాం. అలా నా చదువు అంతా అక్కడే సాగింది. మైక్రోబయాలజీలో డిగ్రీ చేశాను. స్వచ్ఛమైన అడవి సౌందర్యం గురించి నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ అడవి బిడ్డల జీవనశైలి మీద నా చూపు ఉండేది. నా చదువులో భాగంగా మొక్కల పరిశోధనకు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి, గిరిజనులను కలిశాను. అప్పుడు అక్కడి గ్రామాల్లో కొంతమంది మహిళలు మహువా (ఇప్పపూల) లడ్డూలను తయారుచేస్తున్నారు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఇప్పపూలలో ఉండే పోషకాలను అడిగి తెలుసుకున్నాను. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఇప్పపూలలో తలనొప్పి, విరేచనాలు తగ్గించే సుగుణాలు ఉన్నాయి. చర్మ, కంటి సమస్యలతో సహా చాలా వ్యాధులకు ఔషధంగా వాడచ్చు. వంటకాలకు సహజమైన తీపిని అందిస్తాయి. దీంతో పోషకాహార నిపుణులు, మరికొంత మంది సాంకేతి నిపుణులు, ఆరుగురు గిరిజన మహిళలతో కలిసి అన్ని అనుమతులతో 2017లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ ప్రారంభించాను. సవాళ్లను ఎదుర్కొంటూ... ముందు ఈ బిజినెస్‌కి ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. ‘ఎందుకు కష్టం. ఉద్యోగం చూసుకోక’ అన్నారు. బ్యాంకులను సంప్రదిస్తే లోన్ ఇవ్వలేదు. మహువా లడ్డూలను రుచిగా తయారు చేయడంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. చాలా మంది ‘ఎందుకు ఇదంతా వృథా... ఇది ఫెయిల్యూర్ బిజినెస్’ అన్నారు. దీనికి కారణం లేకపోలేదు. చాలాకాలంగా మన దేశంలో ఇప్పపూలను మద్యం తయారీలోనే వాడతారని తెలుసు. ఆదివాసీలే వీటిని ఉపయోగిస్తారు మనకెందుకు అనే అభిప్రాయమే ఉంది. వీటిలోని సానుకూల కోణాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. అనుమతి కోసం చాలా మంది అధికారులను సంప్రదించాను. 2018లో ఒక ఐఎఎస్ ఆఫీసర్ రెండు నెలల ప్రోగ్రామ్‌కు అనుమతి ఇచ్చారు. లడ్డూల నాణ్యత పెంచడానికి చాలా ప్రయోగాలు చేశాం. మహువా లడ్డూల తయారీ మార్కెటింగ్ చేస్తే రెండు లక్షల రూపాయల లాభం వచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేర్చుకునేవారికి శిక్షణాలయం బస్తర్ ఫుడ్ ఫర్మ్ని ఇన్స్టిట్యూట్లా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆదివాసీల ఆహారాలు ఏవున్నాయో వాటిని బయటి ప్రపంచానికి చూపించాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతం లండన్ కంపెనీతో కలిసి పని చేయబోతున్నాం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెటింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఈ బిజినెస్ మోడల్‌గా రాబోయే తరానికి తెలియాలి. ఈ ఆలోచనతోనే ఆసక్తి గలవారు ఒక ఏడాది పాటు ఈ కోర్సు ప్రత్యక్షంగా నేర్చుకునేలా రూపొందించాను. నేర్చుకోవాలంటే ఇక్కడ చాలా పని ఉంది. మరో రెండేళ్లలో ఇన్స్టిట్యూట్ సిద్ధం అవుతుంది. ఇప్పటికే స్టూడెంట్స్ గ్రూప్స్‌గా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆసక్తిగలవారు నేర్చుకోవడానికి మా సంస్థను సంప్రదిస్తున్నారు’’ అని ఆనందంగా వివరించారు రజియా. పల్లెవాసుల మధ్య పని చేయాలని, కొత్త మార్గాలను అన్వేషించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ, అనుకున్నంతగా ఆచరణలో పెట్టలేరు. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ పల్లెకు–పట్టణానికి వారధిగా నిలుస్తున్న రజియా లాంటివారు యువతరానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సమస్యలను అధిగమిస్తూ! ‘ఈ కన్సల్టెన్సీ మీద కొంత ఆదాయం వస్తుంది. దానిని పని చేస్తున్న మహిళలకే పంచుతాం. ఇక్కడి మహిళలకు పని వచ్చు కానీ మార్కెటింగ్ తెలియదు. ఊరు దాటి బయటకు వెళ్లలేరు. చదువుకున్న వారికి పట్టణ వాతావరణం గురించి తెలియదు. వారి ప్రతిభకు మేం సపోర్ట్‌గా ఉన్నాం. నక్సలైట్స్ సమస్యలూ వస్తుంటాయి. అడవుల్లోని మారుమూల పల్లెలకు వెళ్లినప్పుడు ఒక్కోసారి ఫుడ్ దొరకదు. అక్కడి ఆదివాసీలు త్వరగా అర్థం చేసుకోరు. వారి భాష మనకు రాదు. వాళ్ల భాషల్లోనే విషయం చెప్పాలన్నా కొంచెం సమస్యే. కానీ, వాటిని అధిగమిస్తేనే ఏదైనా చేయగలం. ఒక్కసారి వారికి అర్థమైతే మాత్రం మనమంటే ప్రాణం పెట్టేస్తారు. అంతబాగా చూసుకుంటారు. వాళ్లదగ్గర ఉన్న ప్రతిభను పట్టణానికి పంచే పనిని చేస్తున్నాను.’ పల్లెకు–పట్టణానికి వారధి ‘ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్‌కి అనుకూలంగా ఉందనుకుంటే అక్కడకు మా యూనిట్ కూడా మారుతూ ఉంటుంది. నా టీమ్ మెంబర్స్ పది మంది ఎప్పుడూ నాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మెట్రో సిటీస్‌లో ప్రమోషన్స్ కోసం చురుగ్గా ఉండాలి. అందరికీ పల్లె ఉత్పత్తులు ఇష్టమే. కానీ, అందరికీ అవి లభించేదెలా? అందుకే, నేను పల్లెకు–పట్టణానికి వారధిగా మారాను. నేను చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల యుఎస్ వెళ్లడానికి ఫెలోషిప్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో కలిసి పని చేశాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఉత్పత్తులకు మరింత ఎక్స్పోజర్ పెరిగింది. మంచి పేరు వచ్చింది.’ – నిర్మలారెడ్డి -
ఒక్క సంతకం
అత్యాచారానికి బలైన ఆడబిడ్డల పరిహారంలో జాప్యం జరగడం అంటే అది మళ్లీ ఇంకో అత్యాచారం జరిగినంత దారుణం! ప్రతిదీ హక్కుల కార్యకర్తలే చూసుకోలేరు. అత్యాచార బాధితులకు తక్షణం పరిహారం అందించేందుకు ఫైళ్లను త్వరత్వరగా క్లియర్ చేయడం కోసం ప్రభుత్వ అధికారులు కూడా హక్కుల కార్యకర్తల్లా వ్యవహరించాలి. అది వారి వృత్తిధర్మం మాత్రమే కాదు. నైతిక బాధ్యత కూడా. సంతకం చేతిలో పనే కదా. నాలుగేళ్ల క్రితం రజియా వయసు 13 ఏళ్లు. మానసికంగా ‘భిన్నమైన’ అమ్మాయి. ఉండడం ఉత్తరాఖండ్‌లోని ఒక కుగ్రామంలో. ‘నాలుగేళ్ల క్రితం’ అంటూ విషయాన్ని మొదలు పెట్టడానికి కారణం ఉంది. 2014లో రజియాపై అత్యాచారం జరిగింది. ఆమె తమ్ముడికి పాఠాలు చెప్పేందుకు ఇంటికి వచ్చే 17 ఏళ్ల యువకుడు ఆ దుశ్చర్యకు ఒడిగట్టాడు. రజియాకు మాటలు కూడా సరిగా రావు. ఆమె తల్లిదండ్రులకు మాటలు వచ్చుగానీ, న్యాయం కోసం పోరాడ్డం రాదు. వారి తరఫున ‘లతిక రాయ్ ఫౌండేషన్’.. కోర్టులో కేసువేసింది. బాలికలు, మహిళల సంక్షేమంగా కృషి చేస్తుండే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ.. లతిక రాయ్ ఫౌండేషన్. సంస్థ ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఉంది. రెండేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు రజియాపై అత్యాచారం చేసిన యువకుడిని జైలు పంపించింది. రజియాకు రెండు లక్షల రూపాయలను నష్టపరిహారంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది జరిగింది 2016లో. అయితే యువకుడి జైలు శిక్ష వెంటనే అమలైంది కానీ, బాధితురాలికి మరో రెండేళ్ల వరకు నష్టపరిహారం అందలేదు! లతిక తర్వాతి పోరాటం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మొదలైంది. రజియా కేవలం అత్యాచార బాధితురాలు మాత్రమే కాదు. అత్యాచారానికి గురైన మానసిక వికలాంగురాలు కూడా. అయితే పరిహారాన్ని తక్షణం రాబట్టడం కోసం ‘వైకల్యం’ అనే కారణాన్ని అధికారులకు చూపలేదు లతిక. కోర్టులు న్యాయం చేసినప్పటికీ, అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల రజియా లాంటి ఎందరో బాలికలు, మహిళలు తమకు దక్కవలసిన పరిహారాన్ని పొందలేకపోతున్నారని ఒక నివేదికను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అలాగే ఒక వీడియోను రూపొందించి బాధిత బాలికలు, మహిళలు ఎలాంటి దీనావస్థలో ఉన్నారో చూపించింది. ఫలితంగా 2018 ఏప్రిల్‌లో రజియాకు పరిహారం లభించింది. అమె ఒక్కరికే కాదు, మరో 22 మంది లైంగికహింస బాధితులకు పరిహారం అందజేసే ఫైళ్లు త్వరత్వరగా కదిలాయి. ఒకవిధంగా వీళ్లంతా అదృష్టవంతులు అనుకోవాలి. హక్కుల సంస్థ కల్పించుకోబట్టి పని జరిగింది. మరి అలాంటి సంస్థల దృష్టికి రానివారి మాట ఏమిటి? ‘‘అధికారులే హక్కుల సంస్థ కార్యకర్తలుగా పనిచేయాలి’’ అని లతికఫౌండేషన్ ఆకాంక్షిస్తోంది. పరిహారం వచ్చినందువల్ల కోల్పోయింది తిరిగి రాదు. కానీ గౌరవప్రదమైన జీవితానికి ఆ మాత్రపు ఆర్థిక సహాయమైనా ఉపయోగపడుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా లతిక కోఆర్డినేటర్ ఒకరు రజియా తరఫున జరిగిన ఈ న్యాయపోరాటం గురించి వెల్లడించారు. అయితే బాధితురాలి అసలు పేరును బయటపెట్టలేదు. రజియా అన్నది మారుపేరు. -
తెలివైన బోస్
స్కూల్ అయిపోగానే సైకిలేస్కొని ఎక్కడా ఆగకుండా ఇంటికొచ్చేసి, రాగానే అమ్మ ముందు వాలిపోయాడు బోస్ – ‘‘అమ్మా! నేనొచ్చేశానూ’’ అంటూ. ‘‘వచ్చావు బాబూ! కానీ ఏం చేసొచ్చావు?’’ అనుమానంగా అడిగింది అమ్మ. ‘‘ఉహూ! నేనెవర్ణీ ఏం చెయ్యలేదమ్మా! సత్యరాజ్‌ని, పాపారావుని కూడా..’’ అమాయకంగా సమాధానమిచ్చాడు బోస్. ‘‘నీకు తెలివితేటలు లేకపోవడం కూడా ఒకందుకు మంచిదేరా! అమ్మను ఎప్పటికీ మోసం చెయ్యలేవు.’’ బోస్‌ను దగ్గరికి తీస్కొని చెప్పింది అమ్మ. బోస్‌కు వయసైతే పెరిగింది కానీ, బుద్ధి చాలా చిన్న వయసులోనే ఆగిపోయింది. ఇంత వయసొచ్చినా అల్లరి చేస్తాడంటూ నాన్నతో సహా చుట్టుపక్కల వాళ్లంతా బోస్‌ను తిడుతూ ఉంటారు. బోస్‌కు ఫ్రెండ్ అయినా, గైడ్ అయినా అన్నీ అమ్మే. బోస్ తమ్ముడు చందు అకడమిక్స్‌లో టాప్ ఉంటాడు. నాన్నేమో దేశంలోనే పెద్ద సైంటిస్ట్‌లలో ఒకరు. ‘‘బోస్‌ను చదువు మాన్పించొచ్చు కదా! వాడి బుద్ధి ఎప్పటికీ పెరగదు.’’ అని నాన్న గొడవ పెడుతూ ఉన్నా, అమ్మ మాత్రం బోస్‌ను బడికి పంపించడం మానదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. బోస్ గురించి ప్రత్యేకంగా కలిసి మాట్లాడాలని స్కూల్ ప్రిన్సిపాల్ అమ్మను పిలిపించాడు. బోస్‌ను ఇంకా స్కూల్లో ఉంచడంలో అర్థం లేదన్నాడాయన. గతం, భవిష్యత్‌ల పట్టింపే లేకుండా వర్తమానంలో బతకడమే బోస్ జీవితమని, అతణ్ని స్కూల్లో వేయడమంటే బంధించడమన్నట్టే అని చెప్పాడు – ‘‘ఇంకా ఇక్కడే ఉండి తను చేసేదేమీ లేదు. తనని దాటిపోతున్న పిల్లల్ని చూసి బాధపడటం తప్ప. ఏవైనా చిన్న చిన్న బాధ్యతలు అప్పజెప్పండి. లేదా హాయిగా, అలా స్వేచ్ఛగా వదిలేయండి!’’.ప్రిన్సిపాల్ మాటలనే తల్చుకుంటూ బయట మైదానంలో తనకోసం ఎదురుచూస్తూ కూర్చున్న బోస్ దగ్గరికొచ్చింది అమ్మ. అమ్మ చేతిలోని రిపోర్ట్‌ను లాక్కొని చూశాడు. కాసేపు ఏం మాట్లాడలేదు. ‘‘నేను బాగానే చదివానమ్మా!’’ అన్నాడు. అమ్మ బోస్‌ను దగ్గరకు తీసుకొని అతని తలనిమిరి ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బోస్ స్కూల్‌కి ఇంకెప్పుడూ వెళ్లలేదు. ఇంట్లోనే ఉండి ఆడుకుంటున్నాడు. ఫ్రెండ్స్ అందరూ స్కూల్‌కు వెళ్లిపోతున్నారని ఒక్కడే కూర్చుని ఏవేవో బొమ్మలు ముందేసుకొని వాటికి కబుర్లు చెబుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. బోస్‌ని ఏదైనా ఇన్స్టిట్యూషన్లో పెడదామని నాన్న ఆలోచన చేశాడు. ‘‘వాడ్ని పిచ్చాసుపత్రిలో పెడతారా?’’ అని అమ్మ గొడవ చేసింది. అందరూ పడుకున్నాక ఒక్కతే గార్డెన్లో ఏడుస్తూ కూర్చుంది. అమ్మను చూసి బోస్ ఆమె దగ్గరకొచ్చి, ‘‘అమ్మా!’’ అని పిలిచాడు. ‘‘బాబూ! నువ్వింకా పడుకోలేదా?’’ అని కళ్లు తుడుచుకుంది అమ్మ. అమ్మ ఒళ్లో పడుకున్నాడు బోస్. ‘‘నేను ఏదైనా పనిచేస్తానమ్మా! బాగా కష్టపడి పనిచేసి నాన్నంత పెద్ద సైంటిస్ట్ అవుతా’’ అన్నాడు. మళ్లీ బోసే – ‘‘చదువుకోకున్నా బాగా పనిచేస్తే సైంటిస్ట్ అవ్వొచ్చు కదమ్మా!’’ అనడిగాడు. ‘‘నువ్వు ఏం కావాలంటే అది కావొచ్చు నాన్నా!’’ అని బోస్ నుదుటిపై ముద్దు పెట్టి దగ్గర తీసుకుంది అమ్మ. బోస్ ఉద్యోగంలో చేరాడు. తమ కాలనీలోనే ఉండే ఓ క్యాంటీన్లో ఫుడ్ డెలివరీ చేసే చిన్న ఉద్యోగం. బోస్ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు.అక్కడే అతనికి ఒకమ్మాయి పరిచయమైంది. రజియా. పియానో టీచర్ ఆమె. ముందు ఆంటీ అని పిలిచాడు. తర్వాత టీచర్ అని పిలవడం మొదలుపెట్టాడు. ఉద్యోగం బోస్‌ను ఎప్పటికప్పుడు బిజీగా ఉంచేది. తాను జాయిన్ అయ్యాక ఆ క్యాంటీన్‌కు మరిన్ని లాభాలు కూడా తెచ్చిపెట్టాడు. ఎప్పుడైనా బోర్ కొట్టినట్టు ఫీలయితే ఒక్కడే ఆడుకునేవాడు బోస్. ఒకరోజు అలాగే ఒంటరిగా కూర్చుని ఉన్న అతని దగ్గరికొచ్చి, ‘‘ఫ్రెండ్! ఒక్కడివే ఆడుకుంటున్నావేం? ఎందుకు బ్యాడ్ మూడ్లోఉన్నావు?’’ అనడిగింది రజియా. అతనేం మాట్లాడలేదు. ‘‘హలో! ఎందుకు బ్యాడ్ మూడ్‌లో ఉన్నావు?’’ మళ్లీ అడిగింది.‘‘చందు తన ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తున్నాడు. నన్ను రావొద్దన్నాడు. నా క్లాస్మేట్స్ కూడా ఎవ్వరూ నాతో డిన్నర్‌కి రారు. పార్టీలకు రారు. వాళ్ల పేరెంట్స్‌తో వెళతారు.’’ ‘‘నన్ను కూడా ఎవ్వరూ డిన్నర్‌కి తీసుకెళ్లరు. పోనీ నన్ను డిన్నర్‌కి తీసుకెళ్లడానికి నీకు వీలవుతుందా?’’ సరిగ్గా బోస్ మాట్లాడినట్టే అమాయకంగా మాట్లాడుతూ అడిగింది రజియా.బోస్ ఉత్సాహంగా ఆమె వైపు చూశాడు. ఆ వెంటనే, ‘‘జోక్!’’ అన్నాడు.‘‘కాదు నిజం.’’ అని చెప్పి రజియా బోస్‌ను డిన్నర్‌కు తీసుకెళ్లింది. ‘‘నువ్వే నా బాయ్‌ఫ్రెండ్‌వి.’’ అని చెప్పి డేట్‌కి కూడా తీసుకెళ్లింది. రోజులు గడుస్తున్నాయి. రజియా ఇప్పుడు బోస్కి బెస్ట్‌ఫ్రెండ్. ఆమెకు లెక్కలేనన్ని కబుర్లు చెబుతూ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. టీచర్ అని పిలవడం దగ్గర్నుంచి ఫ్రెండ్ అనే మాటకు వచ్చేశాడు. భవిష్యత్ భయాల్లేని బోస్ జీవితం ఒకరోజు ఎవ్వరూ ఊహించని మలుపు తీసుకుంది. అది స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుగుతున్న రోజు. బోస్ నాన్నతో పాటు ఆ కన్వెన్షన్ ఏరియాలో ఉండే సైంటిస్టులంతా హాజరయ్యారు. వైభవంగా జరుగుతున్న వేడుక వద్దకు పోలీసులు వచ్చి అప్పుడే ఎగరేసిన జెండాలో పెద్ద బాంబు ఉందని చెప్పారు. దగ్గర్లో ఉన్న 150 గజాల్లో ఉన్న ఏ ఒక్క బిల్డింగూ మిగలదు. ఆ బిల్డింగ్ లోపల గొప్ప సైంటిస్టులు ఉన్నారు. వాళ్లంతా కళ్లముందు చనిపోతున్నా చూస్తూ ఊరుకోవాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు. ఇరవై కేజీల జెండాను ఎవరైనా కొద్దిదూరం మోసుకెళితే సైంటిస్టులను కాపాడుకోవచ్చు. ‘‘సైంటిస్టులను చంపడానికి ఇది పాకిస్తాన్ చేసిన కుట్ర. ఎవరైనా ప్రాణత్యాగం చేస్తే తప్ప వాళ్లు మనకు మిగలరు.’’ రీసెర్చ్‌సెంటర్ పెద్దాయన అందరికీ ఈ మాట చెప్పి ఎవరైనా ముందుకొస్తారేమోనని చూశాడు. ఎవ్వరూ రాలేదు. అక్కడున్న చాలామందికి బోస్ ఒక్కడే ఈ పని చేయదగ్గ వాడని అనిపించింది. అతని జీవితం ఇక్కడితోనే ఆగిపోయినా ఫర్వాలేదనుకున్నారంతా. అమ్మను ఒప్పించారు. బోస్కి బాంబువిషయం చెప్పకుండా జెండా మోసుకు వెళ్లమని మాత్రం చెప్పారు. ‘‘అమ్మా! చాలా నొప్పిగా ఉంటుందా అమ్మా’’ అనడిగాడు బోస్.‘‘అమ్మ కోసం ఈ పని చెయ్యి..’’ అంది అమ్మ. బోస్ జనగణమన పాడుతూ జెండాని ఎత్తుకొని పెద్దాయన చెప్పినంత దూరం పరిగెత్తాడు. ఆ తర్వాత బోస్ ఎవ్వరికీ కనిపించలేదు. బోస్ చేసిన గొప్పలు చెబుతూ అతని పేరుమీద ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఎవ్వరూ చేయలేని సాహసం బోస్ చేశాడని కొనియాడారందరూ.కానీ ఆ రోజు అక్కడున్న వారెవ్వరికీ తాను చనిపోతాడని తెలిసినా బోస్ ఈ సాహసం చేశాడని తెలియదు, రజియా చెప్పేవరకూ. -
ఎయిడ్స్ రోగికి వైద్యం నిరాకరణ!
► ఆశ్రయం ఇవ్వడానికి బంధువుల నిరాకరణ ► స్థానికుల చొరవతో ఆస్పత్రికి.. మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి వైద్యులు ఓ రోగికి వైద్యం చేసేందుకు నిరాకరించారు. ఇటు బంధువులూ.. అద్దె ఇంటి వారు దగ్గరకు రానివ్వలేదు. తొర్రూ రు మండలంలోని కంఠాయపాలెం కు చెందిన మహ్మద్ పాషా, రజి యాలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పాషా సుతారీ మేస్త్రీ. ఈ కుటుంబం జిల్లా కేంద్రంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. రజియాకు హెచ్ఐవీ ఉన్నట్లు వరంగల్ ఎంజీ ఎం వైద్యులు నిర్ధారించారు. 15 రోజుల క్రితం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, హెచ్‌ఐవీతోపాటు టీబీ కూడా ఉందని చెప్పారు.. దీంతో ఆమెను హన్మకొండ భీమారంలో టీబీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వారు పట్టించుకోలేదు. దీంతో ఆ కుటుంబం అద్దె ఇంటికి తిరిగి వచ్చింది. అయితే, అద్దె ఇంటి యజమాని రజియా వ్యాధిగురించి తెలిసి ఇంటికి రానివ్వలేదు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు అడ్మిట్ చేసుకోమని చెప్పారు. స్వగ్రామంలోని సోదరుడి ఇంటికి వెళ్లినా.. ఆశ్రయం లభించలేదు. తిరిగి మహబూబాబాద్‌కు వచ్చిన పాషా పట్టణ శివారులో రోడ్డు పక్కన రజియాను పడుకోబెట్టాడు. రాత్రంతా తన పిల్లలతో జాగరణ చేశాడు. దీంతో స్థానికులు 108 సమాచారం అందించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రజి యాను అడ్మిట్ చేసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిని వచ్చి వివరాలు సేకరించారు. -
దుబాయ్ నుంచి అమ్మ కోసం..
మూడు దశాబ్దాల తర్వాత కన్నతల్లిని వెతుక్కుంటూ ఎడారి దేశం దుబాయ్ నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లు హైదరాబాద్ వచ్చారు. తమ తల్లి జాడ చెప్పండని వారు కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. నగర పోలీసులను ఆశ్రయించి ముప్పై ఏళ్ల క్రితం తమను వదిలి వెళ్లిన తమ తల్లిని వెతకమని అభ్యర్థించారు. తమ వద్ద నున్న తల్లి ఫోటోను, వివరాలను వారికి అందజేశారు. ఈ సంఘటన సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది..1981 డిసెంబర్ 7న హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రజియా బేగం అనే అమ్మాయిని దుబాయ్‌కు చెందిన రషీద్ ఈద్ ఒబేద్ రిఫక్ మస్మారీ అనే అరబ్ షేక్ హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. అనంతరం రజియాను తనతో పాటు దుబాయ్ తీసుకెళ్లాడు. వీరు 7 ఏళ్ల కాపురం తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రజియా హైదరాబాద్ వచ్చేసింది. రజియా, మస్మారీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఆ తర్వాత మస్మారీ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు సవతి తల్లి దగ్గరే పెరిగారు. తండ్రి చనిపోతూ అసలు విషయం చెప్పాడు. ఈమె మీకు సవతితల్లే కానీ కన్న తల్లి కాదు అనీ.. మీ కన్న తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపాడు. దీంతో ఇద్దరు యువతులు కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించారు. అయేషా రషీద్ ఈద్ ఒబేద్(29), ఫాతిమా రషీద్ ఈద్ ఒబేద్(25) అనే ఇద్దరు యువతులు మీడియాతో మాట్లాడుతూ..మా తండ్రి, మా అమ్మకు 1988లో విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి మా అమ్మను చూసే అవకాశం రాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మ కోసం హైదరాబాద్‌కు వచ్చాం. కానీ ఆమె జాడ కనిపెట్టలేకపోయాం. కొంత మంది మిత్రుల సహాయంతో మళ్లీ అమ్మను వెతకటానికి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. మా జీవితంలో ఒక్కసారైనా అమ్మను చూడాలనేదే తమ కోరికన్నారు. ఇద్దరు యువతులు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణను కలిసి తమ అమ్మ జాడ కనిపెట్టాల్సిందిగా అభ్యర్థించారు. -
ఈనాటి బంధం ఏనాటిదో!
హృదయం: ఆ పెద్దావిడ కథ విని జాలిపడి, ఏదో డబ్బులిచ్చి పంపేయాలని చూడలేదు రజియా. ఆమెను తీసుకుని ఇంటికి బయల్దేరింది. అయితే కుటుంబసభ్యులు ఆమె భారం మనకెందుకన్నట్లు చూశారు.రోడ్డుమీద దీనస్థితిలో ఓ ముసలావిడ కనిపిస్తుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. జాలిపడి పది రూపాయలు ఇస్తాం. ఒక్క నిమిషం బాధపడి, కాస్త ముందుకు కదలగానే ఆ ముసలావిడ ఆలోచనల్ని పక్కన పెట్టేసి మన ప్రపంచంలోకి మనం వచ్చేస్తాం. కానీ ఆ ముసలావిడను ఇంటికి తీసుకెళ్లాలని, తిండి పెట్టాలని, ఆమెకో ఇల్లు కట్టించాలని, కుటుంబంతో, సమాజంతో పోరాడి, ఆమెకో బతుకునివ్వాలని ఎంతమందికి అనిపిస్తుంది? అయితే కేరళకు చెందిన రజియా బీవికి అలా అనిపించింది. మృత్యువు అంచుల్లో ఉన్న చెల్లమ్మను ఆమె ఇలాగే కాపాడింది. ఓ దర్శకుడు సినిమా తీసి, జాతీయ అవార్డు గెలిచే స్థాయిలో ప్రేరణ కలిగించిన ఈ ఇద్దరు మిత్రుల కథేంటో తెలుసుకుందాం రండి. 15 ఏళ్ల కిందటి సంగతి. కేరళలోని అంబలపుజ అనే గ్రామంలో పంచాయితీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న 34 ఏళ్ల రజియా బీవి. ఓ రోజు రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. ట్రైన్ కోసం ఎదురుచూస్తుండగా, ఓ ముసలావిడ ప్లాట్‌ఫామ్ అంచుల వద్ద నిలబడి ఉండడం కనిపించింది. తూలి ట్రాక్‌మీద పడిపోతుందేమో అని రజియా ఆమెను వెనక్కి లాగడానికి వెళ్లగానే, ‘నువ్వు నన్ను చావనిచ్చేలా లేవే’ అంటూ కసురుకుంది ఆ ముసలావిడ. అప్పుడర్థమైంది, రైలుబండి రాగానే దూకేయడానికి ఆ ముసలావిడ సిద్ధంగా ఉందని! నెమ్మదిగా ఆమెను మాటల్లో పెట్టింది రజియా. పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె కథేంటో తెలుసుకుంది. ఆమె పేరు చెల్లమ్మ. వయసు 76 ఏళ్లు. పెళ్లయిన ఐదేళ్లకే భర్త చనిపోతే, అక్కడా ఇక్కడా పనిమనిషిగా చేసి, బతుకుబండి లాగింది. ఇక కష్టం చేయలేని స్థితిలో తన తమ్ముడి ఇంటికి వస్తే, వాళ్లు కొన్నాళ్లు ఉంచుకుని ఆమెను బయటికి తరిమేశారు. దీంతో తనకు చావే పరిష్కారమనుకుని రకరకాలుగా ప్రయత్నించి, చివరికి రైలు కింద పడి చావడానికి సిద్ధమైంది చెల్లమ్మ. ఆ పెద్దావిడ కథ విని జాలిపడి, ఏదో డబ్బులిచ్చి పంపేయాలని చూడలేదు రజియా. ఆమెను తీసుకుని ఇంటికి బయల్దేరింది. అయితే కుటుంబసభ్యులు ఆమె భారం మనకెందుకన్నట్లు చూశారు. పైగా వీళ్లది ముస్లిం కుటుంబం. చుట్టూ ఉన్నవాళ్లంతా ముస్లింలే. కానీ చెల్లమ్మ బ్రాహ్మణురాలు. ఆమెకు మాంసాహారం వాసన కూడా పడదు. దీంతో ఆమె అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అయినప్పటికీ, ఉన్నన్ని రోజులు తనింట్లోనే ఆమె పూజలు, పునస్కారాలు చేసుకునే ఏర్పాటు చేసింది. రజియా దీనిపై చుట్టుపక్కల కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఆమెను ఓ హిందూ ఆశ్రమంలో చేర్పించింది రజియా. ఆ ఆశ్రమానికి తనే డబ్బులు కట్టింది. తరచుగా ఆశ్రమానికి వెళ్లి చెల్లమ్మను చూసి వస్తుండేది. అయితే ఆమెను పూర్తిగా ఆశ్రమానికి పరిమితం చేయకూడదని భావించి, ఓ హౌసింగ్ స్కీమ్ కింద, సొంత డబ్బులు కొంత జమచేసి, రెండు గదులున్న ఓ ఇంటిని చెల్లమ్మకోసం కట్టించింది రజియా. అయితే రజియాకు చెల్లమ్మ బినామీ అని, పంచాయితీ డబ్బుల్ని ఆమె వృథా చేస్తోందని కొందరు ఆరోపణలు చేశారు. దీంతో ఓ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తమ బంధం గురించి, చెల్లమ్మ దీనస్థితి గురించి వివరించింది రజియా. ఇద్దరూ ప్రెస్మీట్లో కన్నీటిపర్యంతమయ్యారు. అప్పటికి గానీ రజియా, చెల్లమ్మలది ఎంత గొప్ప బంధమో తెలియలేదు. దీంతో అందరి నోళ్లూ మూతపడ్డాయి. చెల్లమ్మను కొత్త ఇంట్లోకి పంపాక కూడా ఆమెను కంటికి రెప్పలా చూసుకుంది రజియా. ఆమె సొంతంగా వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో తనే ఇష్టమైన వంటకాలు వండి, రోజూ తనకు తీసుకెళ్లేది. రాత్రి తనతోనే పడుకుని ఇంటికి వచ్చేది. చుట్టూ ఉన్న ముస్లిం కుటుంబాలు చెల్లమ్మను ముస్లింగా మార్చి, తనింట్లోనే తీసుకురావచ్చని సలహా ఇచ్చాయి. కానీ రజియా ఒప్పుకోలేదు. చెల్లమ్మకు తమ దేవుళ్ల పట్ల, పూజా పునస్కారాల పట్ల ఉన్న భక్తి శ్రద్ధలెలాంటివో తెలుసు కాబట్టి ఆమెను అలాగే కొనసాగనివ్వాలంది. చెల్లమ్మతో కలిసి రజియా పెట్టిన ప్రెస్‌మీట్ మలయాళ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. వీళ్లిద్దరి గురించి చదివిన బాబు తిరువల్ల అనే దర్శకుడు, ఈ కథతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. రజియాను కలిసి పూర్తి వివరాలు తెలుసుకుని, సినిమాకు తగ్గట్లు కథ సిద్ధం చేశాడు. 2011లో సినిమా మొదలుపెట్టాడు. తర్వాతి ఏడాది ‘తనిచల్లా ఎంజామ్ (నేను ఒంటరిని కాను)’ అనే పేరుతో విడుదలైందా సినిమా. ప్రేక్షకుల గుండెల్ని తట్టిన ఈ ‘తనిచల్లా ఎంజామ్’కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు కూడా లభించింది. తమ కథతో తీసిన సినిమాను తెరమీద చూసుకుని రజియా, చెల్లమ్మ సంబరపడిపోయారు. ‘‘మా ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయే వరకు ఇలాగే కలిసుంటాం’’ అన్నది రజియా మాట. -
భారతీయ యువతులకు ‘మలాలా డే’ అవార్డులు