RBI Panel
-
కస్టమర్‌కు అనుకూలంగా సేవలు ఉండాలి
ముంబై: బ్యాంకులు కస్టమర్‌కు ప్రాధాన్యం ఇస్తూ, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్బీఐకి ప్యానెల్ సిఫారసు చేసింది. మరణించిన ఖాతాదారు వారసులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతించాలని, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్ తదితర సూచలను ప్యానెల్ చేసిన వాటిల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంకుకు సంబంధించి ఏ శాఖలో అయినా, ఏ నెలలో అయినా సమర్పించేందుకు అనుమతించాలని, దీనివల్ల రద్దీని నివారించొచ్చని పేర్కొంది. ఆర్బీఐ నియంత్రణలోని సంస్థల పరిధిలో వినియోగదారు సేవా ప్రమాణాల సమీక్షపై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. గతేడాది మే నెలలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో అద్యక్షతన ఈ కమిటీని నియమించడం గమనార్హం. సూచనలు.. ఇంటి రుణాన్ని తీర్చివేసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తిరిగి రుణ గ్రహీతకు స్వాధీనం చేసే విషయంలో నిర్ధేశిత గడువు ఉండాలి. గడువులోగా ఇవ్వకపోతే బ్యాంక్/ఎన్బీఎఫ్సీపై జరిమానా విధించాలి. డాక్యుమెంట్లు నష్టపోతే, వాటిని తిరిగి పొందే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు అయ్యే వ్యయాలను బ్యాంకులే పెట్టుకోవాలి. కస్టమర్లకు సంబంధించి రిస్క్ కేటగిరీలను సూచించింది. వేతన జీవులు అయితే వారికి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, వారిని హై రిస్క్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులను తక్కువ రిస్క్ వారిగా కేటాయించొచ్చని సూచించింది. కస్టమర్లతో వ్యవహారాలు నిర్వహించే సిబ్బంది, వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా నిర్ణీత కాలానికోసారి తప్పనిసరి శిక్షణ పొందాలని కూడా పేర్కొంది. -
చిన్న బ్యాంకులకు తగినంత సమయం ఇవ్వాలి
మైక్రో ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుకూలంగా ఆర్బీఐ ప్యానల్ సూచనలు ముంబై: చిన్న ఆర్థిక బ్యాంకుల ఏర్పాటుకు అనుమతి పొందిన సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ)కు అనుకూలంగా ఆర్బీఐ ప్యానల్ గురువారం పలు సూచనలు చేసింది. ఎంఎఫ్ఐలు, ఎన్బీఎఫ్సీ సంస్థలు ప్రస్తుత కార్యాలయాలను బ్యాంకు శాఖలుగా మార్పు చేసేందుకు మూడేళ్ల సమయం ఇవ్వాలని సూచించింది. ఆర్బీఐ చిన్న ఆర్థిక బ్యాంకుల ఏర్పాటుకు పది సంస్థలకు ఇటీవలి కాలంలో సూత్రప్రాయ అనుమతులు జారీ చేసింది. వీటిలో ఎనిమిది సూక్ష్మరుణ సంస్థలు కాగా, ఒకటి ఎన్బీఎఫ్సీ సంస్థ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఆర్బీఐ అంతర్గత కార్యచరణ బృందం(ఐడబ్ల్యూజీ) ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐ సంస్థల అభిప్రాయాలను తీసుకుని ఆర్బీఐకి ఓ నివేదిక సమర్పించింది. దీన్ని ఆర్బీఐ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్యానల్ సిఫారసులు ♦ సూక్ష్మరుణ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న శాఖలను బ్యాంకు శాఖలుగా మార్చేందుకు తగినంత సమయం అవసరమని ఐడబ్ల్యూజీ అభిప్రాయపడింది. రిస్క్‌ను పరిమితం చేసుకునేందుకు వీలుగా వాటి శాఖలన్నింటినీ ఒకే సారి కాకుండా క్రమానుగతంగా చిన్న బ్యాంకు శాఖలుగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ♦ ఈ సంస్థలు లెసైన్స్ పొందే నాటికి తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంది. అయితే, సూక్ష్మ రుణ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ ప్రస్తుత కార్యకలాపాలను మూసివేయడానికి లేదా వాటిని బ్యాంకు శాఖలుగా మార్చేందుకు మూడేళ్ల సమయం ఇవ్వాలి. అప్పటి వరకు ప్రస్తుత శాఖలనే బ్యాంకింగ్ ఔట్లెట్స్గా పరిగణించాలి. ♦ {పస్తుత నిబంధనల ప్రకారం మొత్తం శాఖల్లో 25 శాతం శాఖలను బ్యాంకుల్లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, దీన్ని కూడా వెంటనే అమలు చేయరాదు. ఎలక్ట్రానిక్ కియోస్క్, ఏటీఎంలు/సీడీఎం/బీఎన్ఏలను సైతం బ్యాంకింగ్ ఔట్లెట్లుగా ఈ నిబంధనల కింద పరిగణనలోకి తీసుకోవాలి. -
పెద్ద యూసీబీలను రెగ్యులర్ బ్యాంకులుగా మార్చండి
ఆర్బీఐ ప్యానెల్ సిఫార్సు ముంబై : దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనువుగా పెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను (యూసీబీ) రెగ్యులర్ బ్యాంకులుగా మార్చాల్సిన అవసరముందని ఆర్బీఐ ప్యానెల్ పేర్కొంది. అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను రెగ్యులర్ బ్యాంకులుగా మార్చాలని ఆర్బీఐ ప్యానెల్ సిఫార్సు చేసింది. వీటి వ్యాపార పరిమాణం కనీసం రూ.20,000 కోట్లుగా ఉండాలని సూచించింది. ‘పెద్ద మల్టీ-స్టేట్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికిని కలిగి ఉంటాయి. ఫారెక్స్, మనీ మార్కెట్, పేమెంట్ సిస్టమ్స్ వంటి తదితర కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఒకవేళ అవి విఫలమైతే దాని ప్రభావం మొత్తం యూసీబీ రంగంపై ఉంటుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి యూసీబీలను వాణిజ్య బ్యాంకులుగా మార్చితే సరిపోతుంది’ అని వివరించింది. పేద, మధ్య తరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే విధంగా యూసీబీలను చిన్న బ్యాంకులుగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. యూసీబీలను వాణిజ్య బ్యాంకులుగా మార్చాలని మాత్రమే ప్రతిపాదించామని, అంతేకానీ వాణిజ్య బ్యాంకులు అందించే అన్ని సేవలను యూసీబీలు కూడా అందించటానికి ప్యానెల్ సమ్మతించలేదు. రూ.20,000 కోట్లకు తక్కువ వ్యాపార పరిమాణం కలిగిన చిన్న యూసీబీలు చిన్న ఫైనాన్షియల్ బ్యాంకులుగా మారాలని భావిస్తే ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మూసివేత, విలీనం వంటి అంశాల వల్ల 2008 మార్చి చివరకు 1,770గా ఉన్న యూసీబీల సంఖ్య ఈ ఏడాది మార్చి చివరకు 1,579గా ఉంది. -
15 నిమిషాల దూరంలో బ్యాంకు!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని నచికేత్ మోర్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్యానెల్ మంగళవారం సూచించింది. దిగువస్థాయి ఆదాయ వర్గాల కోసం ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ ప్యానెల్ సిఫారసు చేసింది. 2016 నాటికి పౌరులంతా బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలన్న లక్ష్యం నెరవేరడానికి ఇది ముందడుగని మోర్ ప్యానెల్ సూచించింది. దేశంలో ఏ పౌరుడికైనా కేవలం 15 నిముషాల నడక దూరంలో నగదు విత్‌డ్రా, చెల్లింపు, డిపాజిట్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు తేవాలని ప్యానల్ అభిప్రాయపడింది. చిన్న వ్యాపారాలు, దిగువస్థాయి ఆదాయ గృహస్తులకు సంబంధించి సమగ్ర ఆర్థిక సేవలపై ఏర్పాటయిన ఈ కమిటీ ఆయా అంశాలకు సంబంధించి పలు సిఫారసులు సమర్పించింది. ఆర్బీఐ గవర్నర్‌గా సెప్టెంబరు 4న బాధ్యతలు స్వీకరించిన రఘురామ్ రాజన్... అదేరోజు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఈడీ నచికేత్ మోర్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయింది. ఆర్థికాభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడానికి సంబంధించి కమిటీ పలు సూచనలు చేసింది. కొత్త బ్యాంకుల కోసం 25 కంపెనీలు చేసిన దరఖాస్తులను ఆర్బీఐ పరిశీలిస్తున్న నేపథ్యంలో నచికేత్ మోర్ బృందం సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యాంశాలు... 2016 జనవరి 1కి 18 ఏళ్లు నిండిన వారందరికీ భద్రతాపూర్వక, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఖాతా అందుబాటులో ఉండాలి. ‘పేమెంట్స్ బ్యాంకులు’ ఏర్పాటు చేయాలి. చిన్న వ్యాపారులకు, దిగువస్థాయి గృహస్తులకు చెల్లింపు, డిపాజిట్ పథకాల వంటి ప్రత్యేక సేవలందించడం ఈ బ్యాంకుల ధ్యేయంగా ఉండాలి. ఆయా వర్గాలకు గరిష్టంగా రూ.50,000 వరకూ రుణ సౌలభ్యతను కల్పించగలగాలి. ఈ తరహా బ్యాంకులకు కనీస మూలధనం రూ.50 కోట్లుగా ఉండాలి. ఆధార్ కార్డు ద్వారా తేలిగ్గా బ్యాంక్ ఖాతా ప్రారంభించగలిగే పరిస్థితిని తేవాలి. వ్యవసాయ రుణ వ్యవస్థలో సమగ్ర మార్పులు రావాలి. ఈ రం గానికి బేస్రేటుకన్నా తక్కువ వడ్డీకి రుణాలివ్వడాన్ని ఎత్తేయాలి. ఏ ప్రయోజనమైనా.. ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా ఉండాలి.