15 నిమిషాల దూరంలో బ్యాంకు! | Have bank accounts for all by Jan 2016: RBI panel | Sakshi
Sakshi News home page

15 నిమిషాల దూరంలో బ్యాంకు!

Published Wed, Jan 8 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM

15 నిమిషాల దూరంలో బ్యాంకు!

15 నిమిషాల దూరంలో బ్యాంకు!

ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని నచికేత్ మోర్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్యానెల్  మంగళవారం సూచించింది. దిగువస్థాయి ఆదాయ వర్గాల కోసం ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ ప్యానెల్ సిఫారసు చేసింది. 2016 నాటికి పౌరులంతా బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలన్న లక్ష్యం నెరవేరడానికి ఇది ముందడుగని మోర్ ప్యానెల్ సూచించింది. దేశంలో ఏ పౌరుడికైనా కేవలం 15 నిముషాల నడక దూరంలో నగదు విత్‌డ్రా, చెల్లింపు, డిపాజిట్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు తేవాలని ప్యానల్ అభిప్రాయపడింది. చిన్న వ్యాపారాలు, దిగువస్థాయి ఆదాయ గృహస్తులకు సంబంధించి సమగ్ర ఆర్థిక సేవలపై ఏర్పాటయిన ఈ కమిటీ ఆయా అంశాలకు సంబంధించి పలు సిఫారసులు సమర్పించింది.
 
 ఆర్‌బీఐ గవర్నర్‌గా సెప్టెంబరు 4న బాధ్యతలు స్వీకరించిన రఘురామ్ రాజన్... అదేరోజు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఈడీ నచికేత్ మోర్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయింది. ఆర్థికాభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడానికి సంబంధించి కమిటీ పలు సూచనలు చేసింది. కొత్త బ్యాంకుల కోసం 25 కంపెనీలు చేసిన దరఖాస్తులను ఆర్‌బీఐ పరిశీలిస్తున్న నేపథ్యంలో నచికేత్ మోర్ బృందం సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
 ముఖ్యాంశాలు...

  •  2016 జనవరి 1కి 18 ఏళ్లు నిండిన వారందరికీ భద్రతాపూర్వక, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఖాతా అందుబాటులో ఉండాలి.
  • ‘పేమెంట్స్ బ్యాంకులు’ ఏర్పాటు చేయాలి.  చిన్న వ్యాపారులకు, దిగువస్థాయి గృహస్తులకు చెల్లింపు, డిపాజిట్ పథకాల వంటి ప్రత్యేక సేవలందించడం ఈ బ్యాంకుల  ధ్యేయంగా ఉండాలి.
  • ఆయా వర్గాలకు గరిష్టంగా రూ.50,000 వరకూ రుణ సౌలభ్యతను కల్పించగలగాలి. ఈ తరహా బ్యాంకులకు కనీస మూలధనం రూ.50 కోట్లుగా ఉండాలి.
  •  ఆధార్ కార్డు ద్వారా తేలిగ్గా బ్యాంక్ ఖాతా ప్రారంభించగలిగే పరిస్థితిని తేవాలి.
  •  వ్యవసాయ రుణ వ్యవస్థలో సమగ్ర మార్పులు రావాలి. ఈ రం గానికి బేస్‌రేటుకన్నా తక్కువ వడ్డీకి రుణాలివ్వడాన్ని ఎత్తేయాలి.  ఏ ప్రయోజనమైనా.. ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement