RCB Team
-
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
-
ఐపీఎల్ RCB ప్రోమోలో రష్మిక.. వీడియో వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రముఖ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్ 17కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు పేరులో చిన్న మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం RCB తమ జట్టు పేరును ఇంగ్లీషులో (Royal Challengers Bangalore) అని రాస్తోంది. ఇకపై (Royal Challengers Bengaluru) అని మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే విషయాన్ని చెబుతూ ఇప్పటికే పలు వీడియోలను RCB విడుదల చేసింది. తాజాగా రష్మిక మందన్న కూడా ఆర్సీబీ కోసం ఒక ప్రోమోను విడుదల చేసింది. అందులో రష్మిక మందన్న మేకప్ వ్యాన్ లోపలికి వెళ్తుంది. ఆ వ్యాన్ లోపల అద్దంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని రాసి ఉంది. అది చూసిన రష్మిక రాయల్ ఛాలెంజర్స్‌ను మాత్రమే ఉంచి బెంగళూరు అనే పదాన్ని తుడిచిపెట్టేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియో ఒకటి రిషబ్ శెట్టి కూడా గతంలో విడుదల చేశారు. 16 ఏళ్లుగా జట్టు పేరు మార్చాలని అక్కడి స్థానికులు ఆర్సీబీని కోరుతున్నారు. స్థానిక అభిమానుల కోరికమేరకు ఆర్సీబీ ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 19న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్లో పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మార్చి 22న CSK, RCB మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. -
అసలే మ్యాచ్ ఓడిపోయిన కోహ్లీకి BCCI షాక్
-
RCB బ్యాటింగ్ పై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్
-
డివిలియర్స్ కి పిల్లలంటే ఎంత ప్రేమో చూడండి
-
6 మ్యాచ్‌లు 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు..
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్లో కర్ణాటక ఆటగాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) యువ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ దుమ్మురేపుతున్నాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. సోమవారం కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సీజన్లో నాలుగో సెంచరీ బాది.. టీమిండియాలో స్థానం కోసం దూసుకొస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో పడిక్కల్ 119 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి మరో ఓపెనర్, కర్ణాటక కెప్టెన్ సమర్థ్ (22 ఫోర్లు, 3 సిక్స్‌లతో 192) విధ్వంసం తోడవడంతో కర్ణాటక 80 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గతేడాది ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన పడిక్కల్.. సూపర్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకొన్నాడు. ఆ సీజన్లో పడిక్కల్ 15 మ్యాచ్‌ల్లో 124 స్ట్రైక్ రేట్‌తో 473 పరుగులు సాధించి, ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న అనుభవంతో అతను ప్రస్తుత దేశవాళీ సీజన్లో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత సీజన్లో వరుసగా 52, 97, 152, 126*, 145*, 101 స్కోర్లు సాధించి పడిక్కల్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో పడిక్కల్ మొత్తం 673 పరుగులు సాధించి.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా తయారవుతన్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్
ఒకటి కాదు... రెండు కాదు... బెంగళూరు ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడింది. ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. కోహ్లి పట్టుదల, డివిలియర్స్ మెరుపులు రాయల్ చాలెంజర్స్‌కు తొలి విజయాన్ని అందించాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్లు కాస్త మెరుగనిపించారు. బ్యాటింగ్‌లో టాపార్డరే విజయందాకా లాక్కొచ్చింది. ఆఖర్లో స్టొయినిస్ ధనాధన్ ఒత్తిడిని జయించేలా చేసింది. బెంగళూరును గెలిపించింది. మొహాలి: హమ్మయ్య బెంగళూరు కూడా పాయింట్ల పట్టికలో గెలుపు కాలమ్‌ను భర్తీ చేసింది. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడినా అందని విజయం ఏడో మ్యాచ్‌లో దక్కింది. శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ జట్టు 8 వికెట్లతో పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (64 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. చహల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (38 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో అదరగొట్టారు. సుడి‘గేల్’ ఆఖరిదాకా... టాస్ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ పరుగులు ప్రారంభించేందుకు దిగింది. ఉమేశ్ తొలి ఓవర్లో 2 పరుగులే ఇచ్చాడు. తర్వాత సైనీ ఓవర్లో బౌండరీతో గేల్ పరుగుల ప్రవాహానికి తెరలేపాడు. మూడో ఓవర్‌ను ఉమేశ్ వేయగా 4, 6తో 14 పరుగులు రాబట్టాడు. ఇక హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగ్‌కు దిగితే బౌండరీలకు గేట్లెత్తినట్లుగా బాదేశాడు గేల్. ఈ ఆరో ఓవర్లో 4, 6, 4, 0, 6, 4తో ఏకంగా 24 పరుగుల్ని పిండుకున్నాడు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు 60/0. ఇందులో గేల్ ఒక్కడివే 48 కావడం విశేషం. శుభారంభం దక్కిన కింగ్స్ ఇన్నింగ్స్‌కు చహల్ తన తొలి ఓవర్ (ఇన్నింగ్ 7వ)లో బ్రేక్ వేశాడు. మొదటి బంతికి సిక్సర్ కొట్టిన రాహుల్ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీంతో 66 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చినా... ఎంతోసేపు నిలువలేకపోయాడు. గేల్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తన రెండో ఓవర్లో చహల్... మయాంక్‌నూ ఔట్ చేశాడు. అచ్చు రాహుల్ లాగే సిక్స్ కొట్టి మరుసటి బంతికే మయాంక్ (15; 1 ఫోర్, 1 సిక్స్) ఔటయ్యాడు. ఈ దశలో గేల్ నెమ్మదించాడు. పరుగుల వేగం తగ్గింది. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఆ తర్వాతి ఓవర్లోనే సర్ఫరాజ్ ఖాన్ (15; 1 ఫోర్, 1 సిక్స్)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో స్యామ్ కరన్ (1) మొయిన్ అలీ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అలా 113 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. అనంతరం గేల్‌కు మన్దీప్ సింగ్ జతయ్యాడు. మరో వికెట్ పడకుండా ఇద్దరు పరుగుల వేగం పెంచారు. చివరి ఓవర్లో ఆఖరి బంతికి ఫోర్ కొట్టడంతో గేల్ సరిగ్గా 99 స్కోరు చేసి సెంచరీకి పరుగు దూరంలో అజేయంగా ఆగిపోయాడు. ధాటిగా మొదలైంది... ఎలాగైనా గెలవాలన్నా కసో లేక మిడిలార్డర్‌పై అపనమ్మకమో గానీ... కోహ్లి, పార్థివ్ పటేల్ ద్వయం బెంగళూరు ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టింది. పార్థివ్ ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. రెండో ఓవర్లో కోహ్లి రెండు, పార్థివ్ మరో ఫోర్ కొట్టారు. మూడో ఓవర్లో ఈ సారి కోహ్లి ఒక బౌండరీ బాదితే... పార్థివ్ రెండు బాదాడు. 3 ఓవర్లలో రాయల్ చాలెంజర్స్ స్కోరు 36/0. నాలుగో ఓవర్ వేసిన అశ్విన్... పార్థివ్ (9 బంతుల్లో 19; 4 ఫోర్లు)ను ఔట్ చేసి ఈ జోడీని విడగొట్టాడు. తర్వాత డివిలియర్స్ వచ్చిరాగానే 2 ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లేలో బెంగళూరు వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. కోహ్లి, డివిలియర్స్ ఫిఫ్టీ–ఫిఫ్టీ కోహ్లి, డివిలియర్స్ ఇద్దరు క్రీజ్‌లో పాతుకుపోవడంతో పంజాబ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ముఖ్యంగా డివిలియర్స్ పాదరసంలా పరుగెత్తాడు. దీంతో సింగిల్స్ వచ్చే చోట బెంగళూరు రెండేసి పరుగుల్ని చకచకా సాధించింది. 10 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 88/1. ఇద్దరు సమన్వయంతో ఆడటంతో భారీషాట్లు కొట్టకుండానే బెంగళూరు అవసరమైన రన్‌రేట్‌ను సాధిస్తూ వచ్చింది. 11వ ఓవర్లో కోహ్లి 37 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటే 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మెరుపుల్లేకపోయినా పరుగులు మాత్రం చేస్తుండటంతో పంజాబ్ బౌలర్లకు ఎటూ పాలుపోలేదు. ఈ ద్వయాన్ని పడగొట్టలేక, పరుగుల్ని నియంత్రించలేక విలవిల్లాడారు. ఇలా చూస్తుండగానే రాయల్ చాలెంజర్స్ 15 ఓవర్లలో 126/1 స్కోరు చేసింది. ఇక ఆఖరి 5 ఓవర్లలో ‘బెంగ’తీరే విజయానికి 48 పరుగులు కావాలి. 16వ ఓవర్ వేసిన షమీ... కోహ్లి వికెట్ తీశాడు. దీంతో 85 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ ఓవర్లో 4 పరుగులు, 17వ ఓవర్లో 6 పరుగులు రావడంతో చేయాల్సిన రన్‌రేట్ ఒక్కసారిగా పెరిగింది. 18 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన దశలో అండ్రూ టై వేసిన 18వ ఓవర్లో స్టొయినిస్ 2 ఫోర్లు, డివిలియర్స్ సిక్స్ బాదాడు. దీంతో 18 పరుగులు రాగా, డివిలియర్స్ 35 బంతుల్లో ఫిఫ్టీ చేసుకున్నాడు. షమీ 19 ఓవర్లో 14 పరుగులిచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్లో 6 పరుగులు అవసరమైతే స్టొయినిస్ (16 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) 4, 2తో మరో 4 బంతులు మిగిలుండగానే ముగించాడు. -
విరాట్ కోహ్లి రెస్టారెంట్లో సరదాగా ఆర్సీబీ జట్టు
-
కోహ్లి రెస్టారెంట్లో పసందైన విందు
న్యూఢిల్లీ : ఇటీవల హైదరాబాద్‌లో మహ్మద్ సిరాజ్ ఇంట్లో సందడి చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు.. గురువారం రాత్రి కెప్టెన్ విరాట్ కోహ్లి రెస్టారెంట్లో సరదాగా గడిపారు. ఐపీఎల్లో భాగంగా బెంగళూరు జట్టు శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో తలపడనుంది. అందుకోసం బెంగళూరు ఆటగాళ్లు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. కోహ్లికి దక్షిణ ఢిల్లీలో నూయేవా రెస్టారెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది తన హోం టౌన్‌కు విచ్చేసిన ఆటగాళ్లకు కోహ్లి తన రెస్టారెంట్లోనే పసందైన విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో జట్టు సభ్యులు ఏబీ డివిలియర్స్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, టిమ్ సౌతి, మోయిన్ అలీ, యుజువేంద్ర చహల్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా పాల్గొన్నాడు. రెస్టారెంట్‌కు వచ్చిన ఆర్సీబీ ఆటగాళ్లతో ఫొటోలు దిగేందుకు అక్కడి కస్టమర్లు ఉత్సాహం కనబర్చారు. కోహ్లి సేన కూడా వారితో అంతే సరదాగా గడుపుతూ.. ఫొటోలకు పోజులిచ్చారు. తన జట్టు సభ్యులు తన రెస్టారెంట్‌కు విచ్చేసిన ఫొటోలను కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లి సేన తమ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. శనివారం ఢిల్లీతో తలపడే మ్యాచ్‌లో గెలిస్తేనే బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. With @abdevilliers17 at @nueva.world 🤙 A post shared by Virat Kohli (@virat.kohli) on May 10, 2018 at 10:26am PDT The RCB boys sure know how to have Fun! #RCBAtNUEVA @RCBTweets @imVkohli @ABdeVilliers17 @yuzi_chahal @nueva_world @mohammadsiraj #AshishNehra @y_umesh @chriswoakes @shammibatra24 #ROYALCHALLENGERSBANGALORE pic.twitter.com/iumiEruC9e — Nueva (@nueva_world) May 10, 2018 -
రైజర్స్ పవర్...
లీగ్‌లో... సన్‌రైజర్స్ ఎంతచేసినా గెలిచేలా ఉంది...! రాయల్ చాలెంజర్స్ ఏం చేసినా గెలిచేలా లేదు..! పరుగుల వరద పారే ఐపీఎల్లో తక్కువ స్కోర్లతో తమకు ఉన్న బంధాన్ని సన్‌రైజర్స్ మళ్లీ ప్రదర్శించింది. 146 పరుగులు చేసి కూడా ఆ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. తమకు అలవాటైన రీతిలో మరోసారి సాధారణ లక్ష్యాన్ని కాపాడుకొని వరుసగా ఐదో విజయంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ దిశగా అడుగులు వేయగా... బ్యాటింగ్ బలగం మళ్లీ ముంచడంతో ఓటమి పాలైన బెంగళూరు దాదాపుగా ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్నట్లే. 18 బంతుల్లో 25 పరుగులు, చేతిలో 5 వికెట్లు... ఐపీఎల్ ప్రమాణాలపరంగా చూస్తే ఇది సునాయాసంగా చేయాల్సిన స్కోరు. కానీ బెంగళూరు చేతులెత్తేసింది. ఒకే బౌండరీతో 19 పరుగులు మాత్రమే చేయగలిగింది. భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్ కలిసి ప్రత్యర్థిని కట్టిపడేయడంతో ఆర్సీబీకి మరో ఓటమి తప్పలేదు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (39 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, షకీబ్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. సిరాజ్, సౌతీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 141 పరుగులే చేసి ఓడిపోయింది. కోహ్లి (30 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), గ్రాండ్‌హోమ్ (29 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. విలియమ్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కీలక భాగస్వామ్యం... తొలి రెండు ఓవర్లలో 10 పరుగులు రాబట్టిన సన్‌రైజర్స్‌ను మూడో ఓవర్లో సౌతీ దెబ్బ తీశాడు. అతను వేసిన చక్కటి బంతికి హేల్స్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో సన్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం సిరాజ్ కూడా తొలి ఓవర్లోనే ధావన్ (13)ను వెనక్కి పంపాడు. మనీశ్ పాండే (5) తన వైఫల్యాన్ని కొనసాగించడంతో హైదరాబాద్ స్కోరు 3 వికెట్లకు 48 పరుగుల వద్ద నిలిచింది. ఈ దశలో విలియమ్సన్, షకీబ్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసినా... బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగుల వేగం మందగించింది. ఎట్టకేలకు ఐదు బంతుల వ్యవధిలో 2 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి విలియమ్సన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఉమేశ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి విలియమ్సన్ అవుట్ కావడంతో మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కేన్, షకీబ్ 47 బంతుల్లో 64 పరుగులు జోడించారు. మరికొద్ది సేపటికే షకీబ్‌ను సౌతీ వెనక్కి పంపించాడు. ఇక ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ అంతా వరుస పెట్టి విఫలం కావడంతో రైజర్స్ భారీ స్కోరు సాధించలేకపోయింది. 22 పరుగుల వ్యవధిలో హైదరాబాద్ చివరి 6 వికెట్లు పడ్డాయి. 19వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 20వ ఓవర్లో మూడు వికెట్లు చేజార్చుకుంది. ఇందులో కోహ్లి చేసిన రెండు రనౌట్లు ఉన్నాయి. తొలి 10 ఓవర్లలో 61 పరుగులు చేసిన హైదరాబాద్, తర్వాతి పది ఓవర్లలో 85 పరుగులు రాబట్టింది. సీజన్లో రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే రెండో సారి. కోహ్లి మినహా... సాధారణ లక్ష్య ఛేదనలో కోహ్లి ఉన్నంత సేపు మినహా బెంగళూరు ఆట తడబడుతూనే సాగింది. భువనేశ్వర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన పార్థివ్ పటేల్ (13 బంతుల్లో 20; 4 ఫోర్లు), షకీబ్ వేసిన ఓవర్లోనూ వరుసగా మరో రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికే అతను ఎల్బీగా వెనుదిరిగాడు. షకీబ్ ఓవర్లో కోహ్లి వరుసగా 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చింది. అయితే రైజర్స్ అద్భుతమైన బౌలింగ్ ముందు ఇది ఎంతో సేపు సాగలేదు. 28 బంతుల వ్యవధిలో 24 పరుగులు మాత్రమే చేసిన ఆర్సీబీ 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. వోహ్రా (8)ను సందీప్ శర్మ బౌల్డ్ చేయగా, యూసుఫ్ పఠాన్ గాల్లో ఎగిరి ఒంటి చేత్తో పట్టిన అద్భుత క్యాచ్‌కు కోహ్లి వెనుదిరిగాడు. రషీద్ గుగ్లీని డివిలియర్స్ (5) వికెట్ల పైకి ఆడుకోగా... తొలిసారి ఐపీఎల్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన మొయిన్ అలీ (10)ని కౌల్ అవుట్ చేశాడు. ఈ దశలో మన్దీప్, గ్రాండ్‌హోమ్ జట్టును విజయం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వీరు 50 బంతుల్లో 57 పరుగులు జోడించినా లాభం లేకపోయింది. సిరాజ్ జోరు... హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ సొంతగడ్డపై సత్తా చాటాడు. గత ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను... ఈసారి బెంగళూరు తరఫున రైజర్స్పై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. 25 పరుగులకే 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో సిరాజ్ భారీగా పరుగులు ఇచ్చేశాడు. వికెట్ కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. నాలుగో మ్యాచ్‌లో 2 వికెట్లు తీసినా, అది జట్టు విజయానికి పనికి రాలేదు. అయినా సరే సిరాజ్‌పై కెప్టెన్ కోహ్లి నమ్మకముంచాడు. ముంబైతో మ్యాచ్‌లో 19వ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి విజయంలో కీలక పాత్ర పోషించడంతో అతనికి మళ్లీ అవకాశాలు దక్కాయి. సోమవారం మ్యాచ్‌లో తొలి ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్ చక్కటి బంతితో ధావన్‌ను అవుట్ చేశాడు. అతని రెండో ఓవర్లో కూడా 4 పరుగులే వచ్చాయి. మూడో ఓవర్లో షకీబ్ రెండు ఫోర్లు కొట్టినా... ఆఖరి ఓవర్లో రెండు వికెట్లతో అతను సత్తా చాటాడు. తొలి బంతికి యూసుఫ్ పఠాన్, చివరి బంతికి వృద్ధిమాన్ సాహాలను సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇందులో సాహాకు వేసిన బంతి ఏకంగా 146 కిలోమీటర్ల వేగంతో దూసుకు రావడం సిరాజ్ సత్తాకు నిదర్శనం. 2017లో 6 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీసిన సిరాజ్‌కు ఈసారి ఎక్కువ మ్యాచ్‌లలో అవకాశం లభించింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కూడా అతడిని ఆర్సీబీ ఆడిస్తే అతను మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడు. దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లడంతో బెంగళూరు మిగతా మ్యాచ్‌ల్లో ఎక్కువ ప్రయోగాలు చేసే అవకాశముంది. ఫలితంగా సిరాజ్‌కు మరిన్ని అవకాశాలు లభించే చాన్స్ ఉంది. -
మ్యాక్స్ వెల్ అవుట్
మొహాలి: ఐపీఎల్-9లో భాగంగా సోమవారమిక్కడ జరుగుతున్న 39వ లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్టు విజయ్ తెలిపాడు. వరుసగా విఫలమవుతున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ ను తొలగించారు. అతడి స్థానంలో బెహరిద్దీన్ జట్టులోకి వచ్చాడు. గురుకీరత్ సింగ్ స్థానంలో అనురీత్ సింగ్ ను తీసుకున్నారు. బెంగళూరు టీమ్ లో ఒక మార్పు జరిగింది. పర్వేజ్ రసూల్ స్థానంలో అబ్దుల్లా ఇక్బాల్ కు జట్టులో స్థానంలో కల్పించారు. పాయింట్ల పట్టికలో బెంగళూరులో ఏడో స్థానంలో ఉండగా, పంజాబ్ చివరి స్థానంలో కొనసాగుతోంది.