RDO vinayakam
-
13 మండలాల్లో వంద శాతం సర్వే
– తక్కువ శాతం మైదుకూరు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లో – జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం ప్రొద్దుటూరు టౌన్: జమ్మలమడుగు డివిజన్లోని 16 మండలాల్లో 13 మండలాలు ఇప్పటికే వంద శాతం సర్వే పూర్తి చేశాయని జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ చాంబర్లో ఆర్డీఓ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. డివిజన్ పరిధిలో మొత్తం 2,37,412 గృహాలు ఉన్నాయన్నారు. 16 మండలాలకు సంబంధించి లక్షా 60వేల 377 గృహాలు ఉన్నాయని, వీటిలో 8,800 గృహాలు సర్వేలో పెండింగ్ ఉన్నాయని తెలిపారు. మొత్తం 96 శాతం మండలాల్లో సర్వే పూర్తి చేశామని వివరించారు. ప్రొద్దుటూరు మండలంలో 5వేల గృహాలు, దువ్వూరులో 1800, వేంపల్లిలో 2వేల గృహాల సర్వే చేయాల్సి ఉందని, మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. మున్సిపాలిటీల పరిస్థితికి వస్తే జమ్మలమడుగు 65 శాతం, పులివెందుల 42 శాతం, ప్రొద్దుటూరులో 27శాతం, మైదుకూరులో 13 శాతం మాత్రమే సర్వే జరిగిందన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఇప్పటికి 14వేల గృహాలు సర్వే పూర్తయ్యాయని, మరో 26వేల గృహాలు సర్వే చేయాల్సి ఉందని పేర్కొన్నారు. బుధవారం నుంచి 85 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో ఉంటారని తెలిపారు. ఇతర మండలాల నుంచి 48 మందిని సర్వేకి నియమించామన్నారు. రూరల్ పరిధిలో మొత్తం 478 మంది ఎన్యుమరేటర్లు, మున్సిపాలిటీల పరిధిలోని 199 మంది ఎన్యుమరేటర్లు విధుల్లో ఉన్నారని చెప్పారు. -
భూమి సమస్యలు పరిష్కరించుకోండి: ఆర్డీవో
వేముల (వైఎస్సార్ జిల్లా): భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే మీ ఇంటికి మీ భూమి సదస్సులో పరిష్కరించుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం రైతులకు విజ్ఞప్తిచేశారు. సోమవారం వేములలో జరిగిన 'మీ ఇంటికే మీ భూమి' సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల సమస్యలు పరిష్కారం కాక రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, అందుకే ప్రభుత్వం మీ ఇంటికే మీ భూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి
సంక్రాంతి సంబరాలలో ఆర్డీఓ వినాయకం చాపాడు: సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం పేర్కొన్నారు. చాపాడు సమీపంలోని శ్రీచైతన్యభారతీ, విజ్ఞాన భారతీ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా ఆదివారం సంక్రాంతి సంబరాలను జరిపారు. ఈ సంబరాలకు హాజరైన ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో వాస్తవికత ఉంటుంద న్నారు. వీరి వల్లనే ఇంకా సంస్కృతి, సంప్రదాయాలు బతికి ఉన్నాయన్నారు. అనంతరం పలువురు వక్తలు సంక్రాంతి సంబరాల విశిష్టతపై ప్రసంగించారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన పలు రకాల క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంటు వి.జయచంద్రారెడ్డి, రూరల్ సీఐ పురుషోత్తమరాజు, ఎస్ఐ గిరిబాబు, ప్రొద్దుటూరు వైవీయూ ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి, సీబీఐటీ, వీబీఐటీ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాండురంగన్వ్రి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి కళ: మూడు రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిందా అనే విధంగా చాపాడు సమీపంలోని సీబీఐటీ-వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలలో ఆది వారం గ్రామీణ సంప్రదాయం ఉట్టిపడేలా కళ్లకు కట్టినట్లుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రైతులుగా.. అల్లరి చే సే కొంటెవాళ్లుగా.. సంప్రదాయ వస్త్రాలతో అచ్చతెలుగు ఆడపడుచుల్లా.. హరిదాసుల్లా.. ఇలా వివిధ వేషధారణలతో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు.