ఎన్నికలకు సిద్ధం
మెదక్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీ సిద్ధంగా ఉందని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014 మార్చిలో జరుగుతాయని భావిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు తమ సర్వే ప్రారంభించారని తెలిపారు. మొత్తం ఐదువిడతల్లో ఇప్పటికీ మూడు విడతల సర్వే పూర్తయినట్లు చెప్పారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, మేధావులను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్‌పార్టీ విజయవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, అమలు తీరుతెన్నులను తెలుసుకున్నారన్నారు.
అలాగే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉత్సాహ పడుతున్న అభ్యర్థుల పనితీరు, వారికి ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, సేవా భావం తదితర అంశాలను పరిశీలించారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీకి అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ, విద్యార్థి విభాగాలను చైతన్యవంతం చేసేందుకు బృహత్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ హ వా కొనసాగుతుందన్నారు. పార్టీ టికెట్ ఎవరికొచ్చినా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తారన్నారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో ఎన్నికల యుద్ధం కొనసాగుతుందన్నారు.
ప్రజాదర్బార్‌కు భారీ స్పందన
మెదక్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజాదర్బార్‌కు భారీ స్పందన లభించింది. ఈసందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ శశిధర్‌రెడ్డికి విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్‌శ్రీకర్, దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.