real estate mafia
-
రియల్ దందాలకు కేంద్రంగా మారిన రాజమండ్రి
-
భూమి ధరలకు రెక్కలు
1 నుంచి భారీగా భూముల విలువ పెంపు రిజిస్ట్రేషన్ల ఆదాయంతో ఇక కాసుల పంట గురువారం జోరందుకున్న క్రయవిక్రయాలు విశాఖపట్నం : భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే ల్యాండ్ బ్యాంక్ పేరిట ప్రభుత్వం చేపడుతున్న సేకరణకు తోడు రియల్ ఎస్టేట్ మాఫియా వల్ల భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెంచనుండడంతో సామాన్యులు గజం భూమి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా రెండేళ్లకొకసారి మార్కెట్ విలువను ప్రభుత్వం సవరిస్తుంది. రాష్ర్ట విభజన నేపథ్యంలో గతేడాది పెంచలేదు. దీంతో ఈ ఏడాది 20 నుంచి 30 శాతం పెంపునకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ విలువను బట్టి వంద శాతం కూడా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకం భారీగా పెరగనుంది. ఫలితంగా ఇళ్ల స్థలాల విలువ, వ్యవ సాయ భూముల విలువ రెట్టింపయ్యే అవకాశముంది. ప్రస్తుతం విశాఖలో ప్రభుత్వ లెక్కల ప్రకారం గజం 15వేల నుంచి రూ.70వేల వరకు ఉంది. మార్కెట్ విలువను బట్టి నగర పరిధిలో 20 నుంచి 80 శాతం వరకు పెరగనుండగా, గ్రామీణ ప్రాంతంలో 20 నుంచి 30 శాతం వరకు పెరగనున్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం మేర పెరిగే అవకాశముంది. ఆగ స్టు 1 నుంచి భూముల విలువ పెరగనున్న నేపథ్యంలో పెంపుభారం నుంచి ఉపసమనం పొందేందుకు క్రయవిక్రయ దారులు క్యూ కట్టారు. రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ గురువారం కిటకిటలాడాయి. ప్రతీరోజు జిల్లాలోని 15సబ్రిజిస్ట్రేషన్కార్యాలయాల ద్వారా జరిగే లావాదేవీల ద్వారా సర్కార్‌కు కోటి నుంచి కోటిన్నర వరకు ఆదాయం వస్తుంది. అలాంటిది పుష్కరాలు ముగిసిన మర్నాడు నుంచి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. రోజుకు 20 నుంచి 50 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. గురువారం ఒక్కరోజే దాదాపు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సరాసరిన 50 నుంచి 120 వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి. జీవీఎంసీ పరిధిలోని ఆటోనగర్, అక్కయ్యపాలెం, పూర్ణమార్కెట్, టర్నర్‌చౌల్ట్రీ, గోపాలపట్నం, గాజువాక, భీమిలిలతో పాటు నర్సీపట్నం, చోడవరం తదితర రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్ని కిటకిటలాడాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాకు రూ.350కోట్లు లక్ష్యంగా నిర్ధేశించగా..రాష్ర్ట విభజన, హుద్‌హుద్ తుఫాన్ల ప్రభావంతో రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల మందగించాయి. దీంతో కేవలం రూ.285 కోట్లకు మించి ఆదాయాన్ని ఆర్జించలేకపోయింది. ఆర్ధిక లోటును సాకుగా చూపి రిజిస్ట్రేషన్ శాఖకు కూడా లక్ష్యాలను సర్కార్ రెట్టింపు చేసింది. 2015-16లో రూ.457కోట్లుగా లక్ష్యాన్ని నిర్ధేశించారు. జాతీయ విద్యాసంస్థలకు తోడు భారీ ఎత్తున పరిశ్రమలు విశాఖకు తరలిరానున్నాయన్న సర్కార్ వ్యూహాత్మక ప్రచారంతో ఇక్కడ భూముల రేట్లు అమాంతం పెరగడంతో క్రయవిక్రయాల జోరు కూడా పెరిగింది. ఈ కారణంగానే గడిచిన నాలుగు నెలల్లో రూ.157కోట్ల ఆదాయన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఆర్జించింది. -
దంతపురి.. రియల్టర్ల సిరి
సరుబుజ్జిలి:అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా సిద్ధంగా లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా వస్తున్న ప్రాజెక్టులను సొమ్ము చేసుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. అందిన చోటల్లా భూములను ఏదో విధంగా స్వాధీనం చేసుకొని లే అవుట్ల పేరుతో తెగనమ్మేస్తున్న రియల్టర్ల దృష్టి ఇప్పుడు ప్రముఖ బౌద్ధారామంగా విలసిల్లుతున్న దంతపురిపై పడింది. ఫలితంగా ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కారణమేమిటంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రాజెక్టులు ప్రకటించాయి. వీటిలో టూరిజం కారిడార్‌తోపాటు శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు వరకు ఉన్న బౌద్ధ క్షేత్రాలను కలుపుతూ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే.. ఇన్నాళ్లూ ఎవరికీ కనిపించని సరుబుజ్జిలి మండలంలోని దంతపురి క్షేత్రంపై రియల్టర్ల దృష్టి పడింది. రొట్టవలస గ్రామ సమీపంలో ఉన్న దంతపురి బౌద్ధారామాలతో ప్రముఖ పురావస్తు పర్యాటక కేంద్రంగా పేరొందింది. అయితే ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఇంతకాలం ఇది అభివృద్ధికి నోచుకోలేదు. బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రతిపాదన వల్ల ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతుందో లేదో గానీ.. భూముల ధరలకు మాత్రం రెక్కలొస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడికొచ్చి భూములను కొనుగోలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజుల్లోనే దంతపురి పరిధిలోని సర్వే నెంబర్ 1 నుంచి 69 పరిధిలో సుమారు 150 ఎకరాలు భూములను ఇతర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేశారు. వీటిని లే అవుట్లు వేసి, ప్లాట్లుగా విభజించి అమ్ముకునేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగింది. ఎన్నడూ పెద్దగా ధరల పలకని భూములు సైతం ప్రస్తుతం సెంటు రూ.లక్ష పలుకుతున్నాయి. నిబంధనలకు పాతర పురావస్తు శాఖ అధీనంలో ఉన్న భూముల్లో క్రయ విక్రయాలు, వాటిలో నిర్మాణాలు చేపట్టరాద ని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రియల్ వ్యాపారుల ధాటికి ఇవి కొట్టుకుపోతున్నాయి. రైతుల నుంచి భూములు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి ఒకే సర్వే నెంబర్‌తో విక్రయించి, రిజిస్ట్రేషన్లు కూడా చేయించేందుకు లోపాయికారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దంతపురిలో గౌతమ బుద్ధుని విగ్రహం, మరికొన్ని స్థూపాలు ఉన్న ప్రదేశం మినహా మిగిలిన భూములు ఇతరుల ఆధీనంలో ఉండటం రియల్టర్లకు అనుకూలంగా పరిణమించింది. ప్రస్తుతం భూముల క్రయవిక్రయాలు పెరగడం వల్ల పురాతత్వ సంపదకు ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దళారుల రంగ ప్రవేశం ఇతర ప్రాంతాల రియల్ వ్యాపారులు రంగప్రవేశం చేయడం, భూములకు డిమాండ్ పెరగడంతో కొందరు దళారుల అవతారం ఎత్తుతున్నారు. ఒప్పందాలు కుదిర్చి ఇటు రైతులు, అటు వ్యాపారుల నుంచి కమీషన్లు దండుకుంటున్నారు. ముఖ్యంగా దంతపురి సమీపంలోని పెద్దపాలెం గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇటువంటి వ్యవహారాలు జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగిగా తన పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ రికార్డులను సైతం తారుమారు చేసి వ్యాపారులకు అనుకూలంగా వ్యవహారాలు చక్కబెట్టడం ద్వారా భారీగా కమీషన్లు కొట్టేస్తున్నట్లు సమాచారం. పురావస్తు, రెవెన్యూ అధికారులు దీనిపై స్పందించి భూములను సర్వే చేసి, పరిరక్షించకపోతే ప్రభుత్వ భూములు కరిగిపోవడమే కాకుండా అపురూపమైన పురాతత్వ సంపద ఉనికి కోల్పోయే ప్రమాదముంది. -
నాలాపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను
నాలాపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్నుపడింది. కబ్జాకు పథక రచన చేస్తోంది. వీరి పన్నాగం విజయవంతమైతే.. నీటితో కళకళలాడాల్సిన 5 కుంటల ఉనికి సమీప భవిష్యత్తులో ప్రశ్నార్థకం కానుంది. దీంతో ఇక్కడి పంట పొలాలు ఎడారిగా మారి.. వందలాది రైతుల జీవనాధారం ఛిద్రమయ్యే పరిస్థితి నెలకొంది. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రియల్టర్ల అక్రమాలతో నాలా నామరూపాల్లేకుండా కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. ఇటీవలే ప్రారంభమైన నాలా కబ్జా వ్యవహారాన్ని తక్షణం అడ్డుకోకపోతే ఎంతో మంది రైతుల ఉపాధికి ప్రమాదం వాటిల్లడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటే ముప్పు పొంచి ఉంది. కుంటలు మూసుకుపోతే జాలర్ల జీవితాలపై కూడా పెను ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలంలోని రాయ్‌పోల్ గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న సాకలామెకుంట ప్రధాన నాలాను కొంతమంది రియల్టర్లు మూసివేసేందుకు యత్నిస్తున్నారు. నాలాకు కొనసాగింపుగా ఉన్న కాల్వను ఇప్పటికే పెద్దపెద్ద బండరాళ్లతో దిగ్బంధనం చేశారు. సాకలామెకుంట నాలాను మూసేస్తే.. ఈ నాలా నుంచి పారే నీటితోనే నల్ల కంచె, ఎర్ర కంచె, మొగుళ్లవంపు కుంట, దిల్వానికుంట, పెద్దకుంట తదితర కుంటల్లోకి చుక్క నీరు కూడా చేరదు. మారిన రూపురేఖలు కిలో మీటర్ల మేర ఉన్న నాలా స్వరూపం ప్రస్తుతం పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. నాలా పరీవాహక ప్రాంతంలో తీవ్రంగా శ్రమిస్తే తప్ప దీని ఉనికిని కనిపెట్టడం సాధ్యం కాదు. ప్రారంభంలో 20 అడుగుల పొడవు ఉండే నాలా ప్రస్తుతం 2 అడుగుల మేర కుంచించుకుపోయింది. 15 అడుగులు మేర ఉండాల్సిన నాలా 5 అడుగుల వరకు కుదించుకుపోయింది. ఓ వైపు నాలా మూసివేతలు మరోవైపు కొరవడిన నిర్వహణ లోపం.. భారీ వర్షాలు కురిసినా వీటిలోంచి నీరు పారని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన జలాశయం తట్టిఖానా చెక్‌డ్యాం వరకు ఉన్న నీటి కుంటలకు నీరందించే ప్రధాన నాలాను చెడగొట్టి రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు కొంతమంది అడ్డుకొని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తులు నాలాను ఆధునికీకరించే పనులు చేపట్టారు. అయితే నాలాకు అంతర్గతంగా ఉన్న కాల్వను మాత్రం యథేచ్ఛగా మూసివేసే కార్యక్రమం కొనసాగుతోంది. దీన్ని యథాతథంగా పునరుద్ధరిస్తే స్థానిక రైతులకు ఊరట కలుగుతుంది. అధికారుల స్పందనపైనే రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎటువంటి సమాచారం అందలేదు.. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. నాలా కబ్జాకు సంబంధించి మాకు ఎలాంటి సమాచాం అందలేదు. కబ్జా వివరాలు వీఆర్వోలు చూసుకోవాలి. నాలా వివరాలు విలేజ్ మ్యాప్‌లో ఉంటాయి. సర్వేనంబర్ తదితర అంశాలు రెవెన్యూ రికార్డుల్లో ఉంటాయి. అయినా కూడా మేం పరిశీలిస్తాం. నాలాల మూసివేతకు సంబంధించి ఎలాంటి వివరాలు తమ దృష్టికి రాలేదని తహసీల్దార్ వెంకట ఉపేందర్‌రెడ్డి అన్నారు. ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మాఫియాను అణచండి
పోలీసు అధికారులకు సీఎం క్లాస్ సమాజ ద్రోహులతో జత కట్టొద్దు ‘రియల్’ మాఫియాతో సంబంధాలొద్దు పేదలకు న్యాయం చేయాలన్నదే లక్ష్యం జూదం, వ్యభిచారాన్ని అదుపు చేయండి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రియల్ ఎస్టేట్ మాఫియాతో సంబంధాలు వద్దు. అదనపు డీజీపీలు జిల్లా ఇన్చార్జి బాధ్యతలను స్వీకరించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించలేకపోతే ఎస్పీ, ఐజీలు బాధ్యతలు వహించాలి.... మంగళవారం ఇక్కడ డీజీపీ కార్యాలయంలో జరిగిన వార్షిక పోలీసు అధికారుల సమావేశంలో సీఎం చేసిన దిశా నిర్దేశం. పదవి చేపట్టిన తర్వాత తొలి సారి ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. బాపూజీ కోరుకున్న విధంగా మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా సంచరించే వాతావరణాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. సమాజ ద్రోహులతో జట్టు కట్టవద్దని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు వద్దని హితవు పలికారు. ధనవంతులు పోలీసులతో కలసి పేదలను హింసించడం మంచిది పద్ధతి కాదన్నారు. పేదలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మట్కా, జూ దం, వేశ్యా వాటికలు, అక్రమ క్లబ్బులు, సింగిల్ నంబర్ లాటరీలను 24 గంటల్లోగానే అదుపు చేయవచ్చన్నారు. అయితే ఎందుకు అలా జరగడం లేదని ప్రశ్ని స్తూ, ప్రతిపక్షాలు దీనిపై శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయని తెలిపారు. కాగా పోరాటాల సందర్భంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆత్మహత్యలు లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెబుతూ, వీటిని నివారించడానికి ఆత్మహత్యల నిరోధక దళాన్ని ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఈ సమావేశంలో హోం మంత్రి కేజే. జార్జ్, డీజీపీ లాల్‌రుకుం పచావ్ పాల్గొన్నారు.