rebrand
-
ట్విట్టర్ పక్షులకు వీడ్కోలు చెప్పేస్తా
న్యూయార్క్: ట్విట్టర్.. ఈ సోషల్ మీడియా వేదిక గురించి తెలియని నెటిజన్లు ఉండరు. నీలి రంగు ట్విట్టర్ పిట్ట అందరికీ సుపరిచితమే. ఈ పిట్ట ఇకపై కనిపించదు. ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని, బిలియనీర్ ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటించారు. తమ యాప్ లోగోను మార్చనున్నట్టు ఆదివారం వెల్లడించారు. ట్విట్టర్‌ను రీబ్రాండ్ చేయనున్నట్టు తెలియజేశారు. చైనాకు చెందిన వియ్‌చాట్ తరహాలో అన్నింటికీ పనికొచ్చే ‘ఎక్స్’ యాప్‌ను రూపొందించాలని ఆయన కొంత కాలంగా యోచిస్తున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా వేదికగానే కాకుండా ఆన్లైన్ చెల్లింపులకు, ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి పనికొస్తుంది. చాలా రకాల సేవలు అందించేలా ఎక్స్ యాప్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్విట్టర్‌ను త్వరలో ‘ఎక్స్’ యాప్‌గా రీబ్రాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘త్వరలోనే మేం ట్విట్టర్ బ్రాండ్‌కు.. ఆ తర్వాత క్రమంగా నీటి రంగు ట్విట్టర్ పక్షులకు వీడ్కోలు పలుకనున్నాం’ అని ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఎక్స్ యాప్‌నకు కొత్త లోగోను సూచించాలని ఆయన కోరారు. ఎలాన్ మస్క్ గత ఏడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. సంస్థలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ బిజినెస్ పేరును ఎక్స్ కార్పొరేషన్‌గా మార్చారు. ట్విట్టర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎక్స్ కార్పొరేషన్లో చట్టబద్ధంగా విలీనమైంది. -
Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్
ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్‌ను రీస్టార్ట్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్ ఫర్ హర్’ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్‌ఫామ్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా... రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్ రీస్టార్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నేహా హెచ్ ఆర్‌లో ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలలో పనిచేసింది. 2010లో తన కెరీర్‌కు బ్రేక్ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్ రీస్టార్ట్ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు. ‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్ ఫర్ హర్’ అనే ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసింది నేహా. ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్ ఫర్ హర్’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్ ఫర్ హర్ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్ ఫర్ హర్’ వెంచర్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసింది నేహా. ‘హర్ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్ ఎసెట్... మొదలైన సంస్థలు ఫండింగ్ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్ ఎసెట్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిధి గుమాన్. -
‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా రామ్కీ ఎన్విరో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమగ్ర పర్యావరణ నిర్వహణ సర్వీసులు అందించే రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ పేరు మారింది. ’రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా దీన్ని రీబ్రాండ్ చేస్తున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ గౌతమ్ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశీయంగా తమ తొలి ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. వాహనాల స్క్రాపింగ్‌కు సంబంధించి తమ తొలి ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్ (ఈఎల్వీ) రీసైక్లింగ్ ప్లాంటు .. న్యూఢిల్లీలో వచ్చే ఆరు నెలల్లో ఏర్పాటవుతోందని గౌతమ్ రెడ్డి తెలిపారు. అలాగే ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా ఈఎల్వీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన వివరించారు. వీటి ఏర్పాటుకు ఒక్కో దానికి రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ‘ప్రస్తుతం భారత్ .. రీసైక్లింగ్ కోసం ఈ–వ్యర్థాలను యూరప్‌నకు ఎగుమతి చేస్తోంది. మేము హైదరాబాద్‌లో ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం. ఇది రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రిఫైనింగ్ ప్రక్రియలో మదర్‌బోర్డులను ప్రాసెస్ చేసి .. బంగారం, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలను రాబడతాం‘ అని ఆయన చెప్పారు. రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు .. రాబోయే మూడేళ్లలో రూ. 5 వేల కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేయనున్నట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికైతే పబ్లిక్ ఇష్యూకి వెళ్లే యోచనేదీ లేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు దాదాపు రూ. 3,000 కోట్లుగాను, లాభాలు సుమారు రూ. 550 కోట్ల స్థాయిలోను ఉండగలవని అంచనా వేస్తున్నట్లు గౌతమ్ రెడ్డి వివరించారు. భారత్, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో.. కంపెనీ ఏటా 6–7 మిలియన్ టన్నుల మేర ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేస్తోంది. -
వారికోసం సరికొత్త హంగులతో మారుతి
న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారతదేశంలోని రిటైల్ నెట్‌వర్క్‌ను రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మారుతి సుజుకి ఎరీనా అంటూ కస్టమర్లను తమ డైనమిక్ న్యూ వరల్డ్‌కి ఆహ్వానిస్తోంది. మారుతున్న డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ ప్రాధాన్యతల నేపథ్యంలో తమ మోడ్రన్ కస్టమర్లకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మాస్ మార్కెట్ మోడల్స్‌ను విక్రయిస్తున్న మారుతి షోరూంలు ఇప్పుడు ‘మారుతి సుజుకి ఎరీనా’ చైన్ క్రిందకి రానున్నాయి. ప్రస్తుతం నెక్సా రిటైల్ చైన్ కింద ప్రీమియం ఉత్పత్తులను విక్రయిస్తుంస్తోంది. ఇకపై మారుతి షోరూం లను ‘మారుతి సుజుకి ఎరీనా’ పేరుతో నిర్వహించనుంది. కంపెనీ "ట్రాన్స్ఫర్మేషన్ 2.0’’ లో ఇది భాగమని మారుతి సుజుకి ఇండియా ఒక ప్రకటన లో తెలిపింది. ఈరీ బ్రాండింగ్ దశలా వారీగా ఉంటుందని, రాబోయే రెండు మూడేళ్లలో మొత్తం ప్రక్రియ పూర్తికానుందని మారుతి ఎండీ, డైరెక్టర్ ,సీఈవో కెనిచీ అయుకవా విలేకరులతో చెప్పారు. మార్చి, 2018 నాటికి 80 మారుతి సుజుకి ఎరానీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. భారతదేశంలో దాదాపు 75 శాతం కారు కొనుగోలుదారులు కొనుగోలుపై నిర్ణయం తీసుకోవటానికి ముందుగా ఆన్లైన్ పరిశోధన చేస్తున్నట్లు మారుతి పేర్కొంది. కాగా ప్రస్తుతం, మారుతి 1,683 నగరాల్లో 2,050 షోరూమ్‌లను కలిగి ఉంది. ప్రతి నెలలో 1.26 లక్షల వినియోగదారులతో ప్రతిరోజు తొమ్మిది కార్లను విక్రయిస్తోంది. 2020 నాటికి రెండు లక్షల కార్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోవాలనే కంపెనీ పథకాలు రచిస్తోంది.