ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలపై నేడు సమీక్ష
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఉద్యోగ గుర్తింపు ఎన్నకల నిర్వహణపై యాజమాన్యం ఉద్యోగ సంఘాల నాయకులతో గురువారం సమీక్ష నిర్వహించనుంది. గుర్తింపు సంఘం కాలపరిమితి దాటిన క్రమంలో ఉద్యోగ సంఘాల వినతుల మేరకు ఇటీవల జరిగిన ఎన్బీసీ సమావేశంలో యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించిన విషయం విదితమే. ఈ క్రమంలో గురువారం పరిపాలనా భవనం ఎన్నికల నిర్వహణ అంశంపై అన్ని యూనియన్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు హెచ్ఆర్ అధికారులు తెలిపారు. ఒక్కో యూనియన్ నుంచి ఇద్దరు ముఖ్య నాయకులు యూనియన్‌కు సంబంధించిన పత్రాలతో హాజరుకావాలని కోరారు.