Record date
-
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
ఎల్అండ్టీ నుంచి భారీ డివిడెండ్?
ముంబై: మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించనుంది. బుధవారం(28న) సమావేశంకానున్న కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. 28న నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్) ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. బుధవారం బోర్డు ప్రకటించనున్న ప్రత్యేక డివిడెండ్‌కు నవంబర్ 5 రికార్డ్ డేట్‌గా నిర్ణయించినట్లు తాజాగా తెలియజేసింది. ఇంతక్రితం 2008 మార్చిలో ఎల్అండ్టీ ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ఎలక్ట్రికల్, ఆటోమేషన్ బిజినెస్‌ను ష్నీడర్ ఎలక్ట్రిక్‌కు ఆగస్ట్‌లో విక్రయించింది. ఈ విక్రయం పూర్తికావడంతో ప్రత్యేక డివిడెండ్ యోచన చేపట్టి ఉండవచ్చని ఈ సందర్భంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం రికార్డ్ తేదీ ఈ నెల 17
⇒ 10 ఎస్‌బీబీజే షేర్లకు 28 ఎస్బీఐ షేర్లు ⇒ 10 ఎస్బీటీ, ఎస్‌బీఎమ్ షేర్లకు చెరో 22 ఎస్బీఐ షేర్లు న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అనుబంధ బ్యాంక్‌ల విలీనానికి మరో అడుగు ముందుకు పడింది. అనుబంధ బ్యాంక్‌ల షేర్ల స్వాపింగ్‌కు రికార్డ్ డేట్‌గా ఈ నెల 17ను ఎస్బీఐ నిర్ణయించింది. ఏప్రిల్ 1 కల్లా అన్ని ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంక్‌లు విలీనం కానున్న విషయం తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే) వాటాదారులు ప్రతి పది షేర్లకు గాను 28 ఎస్బీఐ షేర్లను పొందుతారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్(ఎస్బీటీ) వాటాదారులు ప్రతి పది షేర్లకు గాను 22 ఎస్బీఐ షేర్లను పొందుతారు. ఈ విలీనం తర్వాత ఈ ఎస్బీఐ అనుబంధ బ్యాంక్‌లు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవుతాయి. ఎస్బీపీ, ఎస్‌బీహెచ్‌లు ఎస్బీఐకి పూర్తి అనుబంధ బ్యాంక్‌లు కావడం వల్ల వీటికి షేర్ల స్వాపింగ్ ఉండదు. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంక్‌లు–స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్(ఎస్బీటీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా(ఎస్బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)లు విలీనం కానున్న విషయం తెలిసిందే.