Recruitment of teacher posts
-
మైనారిటీ డిక్లరేషన్ అమలేది?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ‘మైనారిటీ డిక్లరేషన్’ఎప్పుడు అమలు చేస్తారని మైనారిటీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మైనారిటీల సంక్షేమం, అభివద్ధికి ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్ అమలు చేస్తుందని ప్రకటించింది. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీడబ్యుసీ సభ్యులు నాసీర్, షకీల్ అహ్మద్, కర్ణాటక మంత్రి జమీరుద్దీన్ అహ్మద్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీతో కలిసి హైదరాబాద్‌లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మైనారిటీలపై హమీల వర్షం గుప్పించారు. అధికారంలోకి వచ్చి సరిగ్గా 11 నెలలు దాటినా.. ఏ ఒక్కటి కూడా ఊసెత్తక పోవడంతో మైనారిటీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ⇒ మైనారిటీ సంక్షేమ బడ్జెట్ రూ.4,000 కోట్లకు పెంచుతామని ప్రకటించినా.. మొదటి ఏడాది 2024–25లో కేవలం రూ. 3,003 కోట్లకు పరిమితమైంది. ⇒ నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని డిక్లరేషన్‌లో వెల్లడించినా మొత్తం బడ్జెట్లోనే వాటా కేవలం రూ.432 కోట్లకు పరిమితమైంది. ⇒ అబ్దుల్ కలాం తౌఫా–ఎ–తలీమ్ పథకం కింద ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు అందించాల్సిన ఆర్థికసాయం కాగితాలకు పరిమితమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ ఉర్దూ డీఎస్సీ ప్రకటించండి కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ హమీ మేరకు ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ–2024లో ఉర్దూ మీడియానికి మొత్తం 1,183 పోస్టులు కేటాయించినా, ఎస్సీ, ఎస్టీ ఇతరత్రా రిజర్వేషన్ కేటగిరి కారణంగా అర్హులైన అభ్యర్ధుల లేక సుమారు 666 పోస్టులు భర్తీకి నోచుకోలేదని విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఎప్పటి మాదిరిగానే ఈసారి డీఎస్సీలో కూడా ఉర్దూ మీడియం రిక్రూట్మెంట్లో సగానికి పైగా పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పడిపోయాయి. ప్రభుత్వం డీఎస్సీలు నిర్వహిస్తున్నా, ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఖాళీల భర్తీ మాత్రం పూర్తిస్థాయిలో జరగడం లేదన్న విమర్శలు వ్యక్తవుతున్నాయి. దీంతో ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్టులన్నింటిని డీ–రిజర్వేషన్ ద్వారా ఓపెన్ కేటగిరీ కింద చేర్చి, ఖాళీలతో కలిపి స్పెషల్ డీఎస్సీ తక్షణమే ప్రకటించాలంటున్నారు. మరోవైపు డీఎస్సీ–2024 మెరిట్ అభ్యర్ధులు మాత్రం రెండవ జాబితా ప్రకటించి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు రవీంద్రభారతిలో అవార్డుల అందజేత భారతరత్న, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబు ల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఉర్దూ అకాడమీ, టెమ్రీస్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జరగనున్న మైనారిటీ సంక్షేమ దినోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ నేషనల్ అవార్డు 2019– 2023, మగ్దూమ్ అవార్డు–2024, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021–23 లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాల్గొంటారు. పెండింగ్‌లో గౌరవ వేతనాలు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా మసీదుల ఇమామ్, మౌజమ్‌లు, దర్గాల ఖాదీమ్‌లు, చర్చిల పాస్టర్ల గౌరవ వేతనాల పెంపు సంగతేమోగానీ ...వేతనాల పెండెన్సీ పెరిగిపోతుందని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని ఇమామ్, మౌజమ్‌లు డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు పరిరక్షణ, ఆక్రమణకు గురైన ఆస్తుల స్వా«దీనం, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయిస్తామన్న హాదమీ కనీసం ప్రణాళికలను కూడా నోచుకోలేదు. -
డీఎస్సీ ప్రక్రియ నిలిపివేయలేం: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన డీఎస్సీ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. డీఎస్సీ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఉపాధ్యాయుల నియామకం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము ఇప్పటికప్పుడు జోక్యం చేసుకోలేమంది. హడావుడిగా పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటే ఎలా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోలను ఇప్పుడు సవాలు చేశారని గుర్తు చేసింది. మధ్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకొచ్చి ఉండాల్సిందని తెలిపింది. ఉపా«ద్యాయ పోస్టుల భర్తీ, వారి అర్హతలు తదితర విషయాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హతలు కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని, ఈ విషయంలో అన్ని స్కూళ్లను ఒకే రకంగా చూసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పాఠశాలల్లో వివిధ ఉపాధ్యాయ పోస్టుల మార్గదర్శకాల జీవోలు 11, 12 కు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల పాఠశాలల్లో ఇంగ్లిష్ నైపుణ్యం ఉన్న వారిని టీచర్లుగా నియమించడం లేదని, వారికి ఇంగ్లిష్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం లేదని తెలిపారు. రెసిడెన్షియల్, మోడల్, గురుకుల పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లీషు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇలా వివక్ష చూపడానికి వీల్లేదన్నారు. అర్హులైన టీచర్లను నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే నియామకాలు... రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఉపాధ్యాయులుగా ఎంపికైన తరువాత రెండేళ్లు వారికి నైపుణ్య తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పిటిషనర్ గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియంను సవాలు చేశారని, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడాన్నే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎన్సీటీఈ నిబంధనలకు అనుగుణంగా నియామకాలు చేస్తున్నామని తెలిపారు. ఈ దశలో ఇంద్రనీల్ జోక్యం చేసుకుంటూ, డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయితే తమ వ్యాజ్యం నిరర్ధకమవుతుందని, అందువల్ల ఆ ప్రక్రియ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. -
డీఎస్సీపై త్వరలో ప్రకటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటనపై త్వరలో స్పష్టత వస్తుందని, ఇందుకు సంబంధించి జూలై–ఆగస్ట్‌లో కార్యాచరణ చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సిన టీచర్ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు. నివేదికను సీఎంకు వివరించి ఆయన తదుపరి ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
తీపి కబురు: త్వరలో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ–2020పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. డీఎస్సీ కంటే ముందు టెట్‌ను నిర్వహిస్తామన్నారు. ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2018 డీఎస్సీకి సంబంధించిన కోర్టు వ్యాజ్యాలన్నింటిని పరిష్కరింపజేసి త్వరగా ఆ పోస్టులన్నిటినీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. అవన్నీ పూర్తయ్యాక టెట్, డీఎస్సీ–2020 నిర్వహణకు చర్యలు చేపడతామన్నారు. టెట్ విధివిధానాలు, సిలబస్‌ను సిద్ధం చేశామని తెలిపారు. నూతన విద్యావిధానానికి, మారుతున్న పాఠశాల సిలబస్‌కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని టెట్ సిలబస్ ఉంటుందని వివరించారు. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలపై నేడు నిర్ణయం ► ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలపై బుధవారం నిర్ణయం తీసుకుంటాం. ► ఈసారి టెన్త్‌లో మార్కులు, గ్రేడ్లు ఇవ్వలేనందున ప్రవేశాలు ఎలా చేపట్టాలన్న దానిపై తుది నిర్ణయానికొస్తాం. ► మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టాలా? లేదా ఇంకా వేరే ఏదైనా మార్గముందా అనేది పరిశీలిస్తాం. ► డీసెట్ రాసి అర్హత సాధించకున్నా, రాయకున్నా స్పాట్ అడ్మిషన్ల పేరిట ప్రవేశాలు పొందిన 2017–2019 బ్యాచ్ అభ్యర్థులకు పరీక్షల నిర్వహణ విషయమై కోర్టు తీర్పుననుసరించి నిర్ణయం తీసుకుంటాం. ఇంటర్ సిలబస్‌ను తగ్గిస్తాం.. ► ఇంటర్మీడియెట్ తరగతులు ఆలస్యమైనందున ముఖ్యాంశాలను వదలకుండా సీబీఎస్ఈ తరహాలో సిలబస్‌ను తగ్గిస్తాం. ► 9, 10, ఇంటర్ విద్యార్థులకు రెగ్యులర్ తరగతులు అక్టోబర్ 5 నుంచి చేపట్టాలని భావిస్తున్నాం. కేంద్రం సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం. ► జగనన్న విద్యా కానుకకు సంబంధించిన అన్ని వస్తువులు ఆయా స్కూళ్లకు చేరాయి. సీఎం ఆదేశాల మేరకు వీటిని నిర్ణీత తేదీన విద్యార్థులకు అందిస్తాం. ► నూతన విద్యావిధానం ప్రకారం.. 2020–21 విద్యాసంవత్సరం నుంచే 5+3+3+4 విధానాన్ని ప్రారంభిస్తున్నాం. ► స్కూళ్లకు అనుబంధంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ముందుగా ఎల్కేజీ, యూకేజీలను ప్రారంభించనున్నాం. ► టీచర్లకు త్వరలోనే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు ఉంటాయి. 25 నుంచి ఎస్జీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ న్యాయ వివాదాల కారణంగా నిలిచిపోయిన 2018 డీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి మంత్రి ఆదిమూలపు సురేశ్ షెడ్యూల్ ప్రకటించారు. – 2018 డీఎస్సీ నోటిఫికేషన్లో 3,524 సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. – ఆ తర్వాత పరీక్షల నిర్వహణ, మెరిట్ జాబితాల రూపకల్పన చేసి 2,203 మంది ధ్రువపత్రాలను ఆయా జిల్లాల విద్యాధికారులు పరిశీలన చేశారు. వ్యాజ్యాల కారణంగా ఆ ప్రక్రియ అప్పట్లో నిలిచిపోయింది. – ఇంకా 1,321 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయాల్సి ఉంది. బుధవారం ఈ పోస్టులకు అర్హత సాధించిన వారి మొబైల్ నెంబర్లకు సంక్షిప్త సందేశాలను పంపిస్తారు. – అనంతరం వారు తమ ధ్రువపత్రాలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు ఈనెల 24న ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. – అదే రోజు ఆయా జిల్లాల్లోని 3, 4 కేటగిరీలు, ఇతర మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలోని ఖాళీల జాబితాను డీఈవో ఆఫీస్ పోర్టళ్లలో ప్రదర్శిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి అదే రోజున నియామక ఉత్తర్వులు అందిస్తారు. – ఈనెల 28న తమకు కేటాయించిన స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది. – కాగా ఇప్పటికీ పలు వ్యాజ్యాల కారణంగా నిలిచిపోయిన మరికొన్ని కేటగిరీలకు సంబంధించిన మొత్తం 949 పోస్టులను కూడా కోర్టు కేసుల పరిష్కారం అనంతరం నియామకాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోస్టుల్లో 374 స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, లాంగ్వేజ్ పండిట్స్–తెలుగు) పోస్టులు, 486 పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, 89 ప్రిన్సిపాల్స్ పోస్టులున్నాయి. -
ఎట్టకేలకు టీఆర్టీలకు మోక్షం
సాక్షి, వనపర్తి : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) అభ్యర్థుల నియామకాలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ ఏడాదైనా ప్రభుత్వం బడులు తెరిచే నాటికి నియమాకాలు చేపట్టాలనే వారి డిమాండ్ కొంచెం అటు, ఇటుగా ఫలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను ఆర్టీటీ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు 2017లో టీఆర్టీ పరీక్ష నిర్వహించి, ఇందుకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా.. ఎంపికైన వారికి నియమాక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లు అయోమయ పరిస్థితిలో వారంతా కొట్టుమిట్టాడారు. ఇదే క్రమంలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నా వారు నియమాకాల కోసం రోజుల తరబడి ఎదురుచూపులకు ఫలితం దక్కనుంది. ప్రభుత్వం వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించడంతో ఎన్ని రోజుల ఎదురుచూపుల ఆశలు నేరవేరనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా ఉమ్మడి జిల్లా కేంద్ర కలెక్టర్ చైర్మన్‌గా, జేసీ వైస్ చైర్మన్‌గా, డీఈఓ కార్యదర్శిగా, జెడ్పీసీఈఓ లేదా ఇతర అధికారిని సభ్యులను కమిటీగా ఏర్పాటు చేసి, వారి ద్వారా నియమాకాల ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రోస్టర్, మెరిట్ జాబితా ప్రకారం ప్రభుత్వ పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. నాలుగు కేటగిరీల్లో నియామకాలు టీఆర్టీల నియమకాలను ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా కమిటీలు నాలుగు కేటగిరిల్లో భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులుండి ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన కొత్త జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ పోస్టులు భర్తీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా అభ్యర్థులు కౌన్సెలింగ్ హాజరుకాకపోతే మిగిలిన స్థానాల్లో నియమిస్తున్నట్లు వారికి రిజిష్టర్ పోస్టు ద్వారా సమాచారం అందించనున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 2005 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో సెకండ్ గ్రేడ్ టీచర్స్( ఎస్జీటీ) 1465, స్కూల్ ఆసిస్టెంట్లు 391, ల్వాంగేజ్ పండిట్స్ 113, పీఈటీలు 36 మంది ఉన్నారు. -
కొత్త జిల్లాలతో డీఎస్సీకి సీఎం మొగ్గు!
న్యాయ శాఖ అభ్యంతరం... సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీపై ఇప్పటికీ మల్లగుల్లాలు కొనసాగు తున్నాయి. పాత జిల్లాల పరిధిని పరిగణనలోకి తీసుకోవాలా.. కొత్త జిల్లాలతో డీఎస్సీ నిర్వహించాలా.. అనే విషయమై నెలకొన్న సందిగ్ధం ఇప్పటికీ వీడలేదు. కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణించిందని, వాటి ఆధారంగానే జిల్లా స్థాయిలోని పోస్టులు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. కానీ కొత్త జిల్లా యూనిట్‌గా డీఎస్సీ నిర్వహిస్తే సమస్యలొస్తాయని, న్యాయపర చిక్కులు తప్పవని న్యాయ శాఖ అభిప్రాయపడుతోంది. ఉద్యోగాల భర్తీకి కొత్త జిల్లాలు చిక్కుముడిగా మారాయని అంగీకరిస్తున్న అధికారులు.. సీఎం సూచనల నేపథ్యంలో అటో ఇటో చెప్పేందుకు వెనుకాడుతున్నారు. ప్రధానంగా జిల్లా స్థాయి పోస్టుల భర్తీ ఇరకాటంలో పడిందని, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపర చిక్కులు తప్పవని వారి వాదన. టీచర్ పోస్టుల భర్తీకి ఏ నిబంధనలు పాటించాలి? డీఈవోల పరిధిలో నిర్వహించాల్సి వస్తే కొత్త జిల్లాల ను యూనిట్‌గా ఎంచుకోవాలి.. పాత జిల్లాలను ఎంచుకుంటే ఏ కారణాలు చెప్పుకోవాలి.. పాత జిల్లాల పరిధిని ఎందుకు ఎంచుకున్నారని న్యాయపరంగా చిక్కులొస్తే వివరణలు ఇచ్చుకోవాలి. ఈ సందేహాలు ఒకదానికొకటి ముడిపడి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ, టీఎస్పీఎస్సీ మౌనం వహిస్తున్నాయి. ఆగస్టు 15న లక్షకు మించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం.. మరుసటి రోజే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి, సీఎస్ ఎస్పీ సింగ్‌తో ఆకస్మిక సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. కడియం నేతృత్వంలో ఆగస్టు 16న ఈ తొలి భేటీ జరిగింది. 21న మరోసారి జరగాల్సిన సమావేశం ఇప్పటికీ నిర్వహించలేదు. దీంతో ఇప్పటికే గుర్తించిన 8,792 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందనేది.. అటు విద్యా శాఖ, ఇటు టీఎస్పీఎస్సీ చెప్పలేకపోతున్నాయి.