recycling plant
-
ప్లానెట్ 3 ఆర్: పాలిథిన్ ఫ్యాషన్
మనం పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నైజిరియాకు చెందిన అడెజోక్ లసిసి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. చిన్నప్పటినుంచి లసిసికి చుట్టూ ఉన్న పరిసరాలను ఆసక్తిగా, నిశితంగా పరిశీలించే అలవాటు. తరచూ ప్లాస్టిక్, గుడ్డ ముక్కల వ్యర్థాలను రోడ్లపక్కన పడేయడం, దాని ఫలితంగా డ్రైనేజీలు పూడిపోయి నీళ్లుపోవడానికి వీలు లేక ఎక్కడికక్కడ మురుగు నీరంతా నిలిచిపోవడం... అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకునేది. క్రమేణా వయసుతోపాటు ఆలోచనలు కూడా పెరిగి పెద్దయ్యాయి. దాని ఫలితమే డిగ్రీ పూర్తయ్యాక ఏకంగా రీసైక్లింగ్ కంపెనీ పెట్టి ప్లాస్టిక్‌తో ఫ్యాషనబుల్ ఉత్పత్తుల డిజైనింగ్! ప్లాస్టిక్ వ్యర్థాలను చూస్తూ పెరిగిన లసిసికి ఎలాగైనా దానికి పరిష్కారం కనుగొనాలన్న కుతూహలం పెరిగింది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క ఆలోచిస్తుండేది. డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటికి వచ్చింది. అప్పటికీ ఇంటి పరిసరాల్లో ఎటువంటి మార్పులూ కనిపించలేదు. కాలుష్య సమస్య మరింత ఎక్కువైంది. ఇలా అనుకుంటుండగానే వాటర్ ప్యాకెట్ల వ్యర్థాలు టన్నులకొద్ది పేరుకు పోవడం గమనించింది. వీటితో ఏం చేయాలి అనుకున్న సమయంలో లసిసి తల్లి దగ్గర నేత పని నైపుణ్యాలు నేర్చుకుని వాటర్ ప్యాకెట్లతో వస్త్రాన్ని రూపొందించింది. దీంతో ఏదైనా తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ నైజీరియాలో వాటర్ ప్యాకెట్స్ తయారీలో నైలాన్ ను వాడుతారు. ఈ ప్లాస్టిక్‌ను రీ సైకిల్ చేయడం కంటే కొత్తగా తయారు చేయడానికి ఖర్చు తక్కువ. అందువల్ల పారిశ్రామిక వర్గాలు కొత్త వాటర్ ప్యాకెట్స్‌ను తయారు చేస్తాయి. అవి టన్నుల కొద్దీ చెత్తలో పేరుకు పోతుంటాయి. వీటిని రీసైకిల్ చేయడమే లక్ష్యంగా ‘ప్లానెట్ 3ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) కంపెనీని ప్రారంభించింది లసిసి. ప్లానెట్ 3 ఆర్ వాడిపడేసిన వాటర్ ప్యాకెట్లను వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తుంది. దీనికోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డస్ట్‌బిన్ లను ఏర్పాటు చేసింది. ఆ చుట్టుపక్కల వారంతా దానిలో ప్లాస్టిక్‌ను పడేయడం వల్ల సేకరణ సులభం అయింది. ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను శుభ్రం చేసి ఎండబెట్టి, తరవాత దారాలుగా కత్తిరించి మగ్గం మీద వస్త్రంగా నేస్తుంది. దీని తయారీలో తొంబై శాతం ప్లాస్టిక్, పదిశాతం గుడ్డముక్కలను వినియోగిస్తుంది. ఇలా తయారైన బట్టతో చెప్పులు, బూట్లు, స్కూలు బ్యాగ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ డ్రెస్‌లుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక మహిళలు, పిల్లలకు ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన కూడా కల్పిస్తుంది. కొన్ని వందలమంది వికలాంగ యువతీ యువకులకు రీసైక్లింగ్‌పై శిక్షణ ఇచ్చింది. నైజీరియా, ఆఫ్రికా దేశాల్లో ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహిస్తోంది. లసిసి చేస్తోన్న పర్యావరణ కృషికి గాను ఆమెను అనేక అవార్డులు కూడా వరించాయి. రోజుకి అరవై మిలియన్ల వాటర్ ప్యాకెట్లు! ‘‘నైజిరియాలో రోజుకి యాభై నుంచి అరవై మిలియన్ల నీటిప్యాకెట్లు అవసరమవుతాయి. అరలీటరు వాటర్ ప్యాకెట్లను వీధుల్లోని షాపులు, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు. ఇప్పటికీ కూడా 39 శాతం మందికి సరైన మంచి నీటి సదుపాయం లేదు. అందువల్ల వాటర్ ప్యాకెట్లపై ఎక్కువమంది ఆధారపడుతున్నారు. వాటర్ ప్యాకెట్లు దాహం తీరుస్తున్నప్పటికీ వాడి పడేసిన తరువాత అవి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఏడాదికి లక్షా ముప్పైవేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఒక్క వాటర్ విభాగం నుంచి వస్తోంది. దీన్ని తన చిన్నతనం నుంచి నిశితంగా గమనించిన లసిసి కాలుష్యానికి పరిష్కారం వెతుకుతూ ప్లానెట్ 3 ఆర్ ను నెలకొల్పింది. -
చెత్త నుంచి సంపద
-
ఏపీలో రీసైక్లింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్న రిలయన్స్
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వాటర్ బాటిళ్లకు, ఇతర ప్లాస్టిక్ వస్తువులకు వాడే పాలిథిలిన్ టెరాఫ్తలెట్(PET) రీసైక్లింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు బుధవారం (ఆగస్టు 4) రోజున ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసైకిల్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ తయారీ కేంద్రాన్ని శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా, ఆర్ఐఎల్ కోసం ప్రత్యేకంగా రీసైకిల్ చేసిన పీఎస్ఎఫ్-రెక్రాన్ గ్రీన్ గోల్డ్, పెట్ ఫ్లాక్స్ వాష్-లైన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించనుంది. అంతేకాకుండా తయారీ కేంద్రాన్ని శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా ఆపరేట్ చేయనుందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రీసైక్లింగ్ సామర్ధ్యాన్ని రెండింతలకు పెంచాలని భావిస్తోంది. 5 బిలియన్ పోస్ట్-కన్స్యూమర్ పెట్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడంతో దేశవ్యాప్తంగా 90శాతం రీసైక్లింగ్ రేటును సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. రిలయన్స్ పెట్రో కెమికల్స్ సీవోవో విపుల్ షా మాట్లాడుతూ.. రిలయన్స్ పెట్ బాటిళ్ల రీసైక్లింగ్ విస్తరణ అనేది రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ దృష్టిలో భాగంగా ఉందన్నారు. శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా సంస్థకు తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో, నిర్వహించడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన మద్దతును తెలుపుతుందని పేర్కొన్నారు. -
వ్యర్థం.. కానుంది ‘అర్థం’!
నగరంలో నాలాలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం వాటిల్లో నీరు పారే దారి లేకుండా పేరుకుపోయిన వ్యర్థాలు. ఈ వ్యర్థాల్లో కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీ అండ్ డీ) వేస్ట్ ఎక్కువగా ఉంటోంది. నాలాల సమస్యే కాదు.. రోడ్లపైనే వేస్తుండటం ప్రమాదాలకు కారణమవుతోంది. నడిచే బాటలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి త్వరలో సీఅండ్‌డీ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. ఈ రీసైక్లింగ్ నుంచి వెలువడే ఉత్పత్తులను వివిధ అవసరాలకు వినియోగించవచ్చు. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం ఉండటంతో జీహెచ్ఎంసీ దీనిపై దృష్టి సారించింది. నగరంలో రోజుకు 2 వేల మెట్రిక్ టన్నుల సీఅండ్‌డీ వేస్ట్ వెలువడుతున్నట్లు అంచనా. దీని రీసైక్లింగ్‌కు 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేసే నాలుగు ప్లాంట్లకు టెండర్లు పిలిచారు. వీటిని దక్కించుకున్న రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ సంస్థ (హైదరాబాద్ సీఅండ్‌డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్) 2 ప్రాంతాల్లో పనులు చేపట్టింది. జీడిమెట్ల ప్లాంట్ దాదాపు పూర్తయింది. శుక్రవారం ప్లాంట్ పనితీరును జీహెచ్ఎంసీ ఇంజనీర్లు, రాంకీ ప్రతినిధులు వివరించారు. ప్రాజెక్ట్ వ్యయం రూ.15 కోట్లు.. ►జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ప్రభుత్వం 17 ఎకరాల స్థలం కేటాయించగా, 2018, జనవరి నుంచి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.15 కోట్లు. ►శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు. ►వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్.. ఇలా రెండు విభాగాలుగా పనులు చేస్తున్నారు. రీసైక్లింగ్‌తో ఇటుకలు, పేవర్ బ్లాక్‌లు తయారు చేస్తారు. వ్యర్థాలను క్రషింగ్ ద్వారా కంకరగా, కోర్, ఫైన్ ఇసుకగా మారుస్తారు. ఈ కంకరను రోడ్ల లెవెల్ ఫిల్లింగ్‌కు, ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీగా, ల్యాండ్ స్కేపింగ్ పనులకు వాడొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్, యాప్ అందుబాటులోకి బిల్డర్లు, ప్రజలు సీ అండ్ డీ వేస్ట్‌ను తరలించేందుకు సంబంధిత నంబర్‌కు ఫోన్ చేస్తే సంస్థ వాహనాల ద్వారా తరలిస్తారు. ప్లాంట్ ప్రారంభమయ్యాక టోల్‌ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040–21111111, మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ పోర్టల్ ద్వారా సమాచారమిచ్చినా తరలిస్తున్నారు. దీనికిగాను ప్రస్తుతం టన్నుకు రూ.256 వసూలు చేస్తున్నారు. ప్లాంట్ ప్రారంభమయ్యాక టన్నుకు రూ.342 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యర్థాలను సొంతంగానే తరలిస్తే ఖర్చు తగ్గుతుంది. అయితే వీటిని తరలించే వాహనాలు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ ఎం ప్యానెల్ జాబితాలో నమోదై ఉండాలి. లేకపోతే భారీ జరిమానాతోపాటు వాహనాలనూ సీజ్ చేస్తారు. ప్రయోజనాలు... ►ఎక్కడ పడితే అక్కడ సీఅండ్‌డీ వ్యర్థాలుండవు. ►రీసైక్లింగ్‌తో పేవర్ బ్లాక్‌లు, కెర్బ్ స్టోన్లు, ఇసుక, ఇటుకలు తదితరమైనవి ఉత్పత్తి చేసి పునర్వినియోగించడం వల్ల సహజ వనరులు వృథాకావు. ఠి కాలుష్యం తగ్గుతుంది. కలెక్షన్ పాయింట్ల ఏర్పాటు... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో నిర్మాణ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి వివిధ రకాల మెటీరియల్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో జీడిమెట్లలో సీ అండ్ డీ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు బల్దియా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాంకీ ఎన్విరో బయోమెడికల్ వేస్ట్ బిజినెస్ హెడ్ ఎ.సత్య తెలిపారు. సీ అండ్ డీ వేస్ట్ సేకరించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేస్తామన్నారు. -
ఆర్ఏఎస్ పద్ధతి బాగుంది
బాలానగర్ (జడ్చర్ల): రీ–సైక్లింగ్ ఆక్వా సిస్టం (ఆర్ఏఎస్) బాగుందని మేఘాలయ మత్స్యశాఖ మంత్రి కురమన్ ఉరియా అన్నారు. సోమవారం బాలానగర్ మండలం గుండేడ్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు విశ్వనాథరాజు తక్కవ నీటితో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేపలను ఎలా పెంచాలనే దానిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా, ఇదే పద్ధతిని గౌహతి వద్ద అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ, మేఘాలయ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఐతిమోలాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
పాత టీవీలో భారీ నగదు చూసి...
కష్టార్జితం పొరపాటున చేయి జారిపోతే.. అది ఎప్పటికైనా మనచేతికి అంది తీరుతుందని అన్న పెద్దలమాట అక్షరాలా నిజమైన అరుదైన సంఘటన ఇది. ఎపుడో 30ఏళ్ల క్రితం దాచి పెట్టిన నోట్ల కట్టలు తిరిగి అనూహ్యంగా ఓ పెద్దాయన చెంతకు చేరాయి. దీంతో ఆశ్చర్యం, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం ఆయన వంతు అయింది. వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన వ్యక్తి (68) ఇంట్లో వాళ్లకి తెలియకుండా 30ఏళ్ల క్రితం సుమారు లక్ష కెనడా డాలర్లను టీవీ డబ్బాలో దాచి పెట్టాడు. కానీ ఆసంగతి మర్చిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ టీవీని ఓ స్నేహితుడికి కానుకగా ఇచ్చాడు. అలా.. అలా.. ఆ టీవీ చివరకి ఓ రీక్లింగ్ యూనిట్‌కు చేరడంతో కథ పెద్ద మలుపు తిరిగింది. గత నెలలో రీసైక్లింగ్ ప్లాంట్ కి చేరిన ఈ టీవీ తెరిచిన కార్మికురాలు విస్తుపోయారు. 76,560 డాలర్లు( సుమారు రూ.67లక్షలు) విలువగల నోట్ల కట్టల్ని కొనుగొన్నారు. వెంటనే సమాచారాన్ని యాజమాన్యానికి చేరవేశారు. ఉత్తర టొరంటో, ఒంటారియా,బారీలోని ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్ ప్లాంట్ జీప్ యజమాని వెంటనే పోలీసులను సంప్రదించింది. అలాగే తమ ఉద్యోగి నిజాయితీని ప్రశంసించింది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే తన కుటుంబానికి వారసత్వంగా ఈ సొమ్మును అందించాలనుకున్న ఆయన డబ్బుతో పాటు కొన్ని డాక్యుమెంట్లను కూడా జతచేశాడట. వీటి ఆధారంగానే పోలీసులు నిజమైన యజమాని అడ్రస్ తెలుసుకొని సొమ్మును అతనికి అందజేశారు. 50 డాలర్ల నోట్ల కట్టలు చూసి పోలీసులకు సమాచారం అందించామని ప్లాంట్ జనరల్ మ్యానేజర్ రిక్ డే ఛాంప్స్ తెలిపారు.