Red Rice
-
Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
రక్తశాలి బియ్యం దాని ప్రత్యేకమైన ఎరుపు రంగు, గొప్ప పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యాభిలాషులైన వినియోగదారులకు దీని విలువ తెలుసు. సాంప్రదాయకంగా దీన్ని కేరళలోని వయనాడ్ జిల్లాలోని సహజమైన, జీవవైవిధ్య వాతావరణంలో పెంచుతారు. ఇది తరచుగా ఈ ప్రాంతపు వ్యవసాయ వారసత్వానికి హ్నంగా చెబుతుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు ప్రకృతి వ్యవసాయ దారులు పండిస్తున్నారు. రక్తశాలి అనే పేరు సంస్కృత పదం నుం వచ్చింది. ‘రక్త’ అంటే రక్తం. ‘శాలి’ అంటే బియ్యం. రక్తశాలి జిగురు లేనిది. గ్లూటెన్ సెన్సిటివ్ వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. దాని అధిక పోషక, ఔషధ లక్షణాల కారణంగా ఆరోగ్య ప్రయోజనాభిలాషులకు ఇది చాలా విలువైనది.విశేష పోషకాలురక్తశాలి పోషకాలతో కూడిన ఆహారం. వంద గ్రాముల ముడి బియ్యం.. 363.49 కిలో కేలరీల శక్తిని అందిస్తుంది. ్ర΄ోటీన్ (8.96 గ్రా.), పిండి పదార్ధం (71.18 గ్రా.), కొవ్వు (4.77 గ్రా.), జింక్ 15.75 మి.గ్రా., ఐరన్ (0.99 మి.గ్రా.) కలిగి ఉంటుంది. ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాల నిపుణులు చెబుతున్నారు.రక్తశాలి బియ్యాన్ని పాలిష్ చేయకుండా ముడి బియ్యం వండుకొని తింటారు. ఇది ముఖ్యంగా రక్తహీనత ఉన్న మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ఇది రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దీన్ని ఆహారంగా తీసుకుంటుంటే రక్తం హెచ్చుతగ్గులను స్థిరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది.అంకితభావంతో కూడిన సేంద్రియ/ప్రకృతి రైతుల సంరక్షణలో సాగవుతున్న అరుదైన రకాల్లో ఇదొకటి. ఆయుర్వేదంలో శరీర త్రిదోషాల(వాత, పిత్త, కఫ) సమతుల్యం చేయగలదన్న గుర్తింపు పొందింది. కాలేయం, మూత్రపిండాలు, నాడీ రుగ్మతలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందని, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీన్ని సిఫార్సు చేస్తున్నారు.110 రోజుల ఖరీఫ్ పంటరక్తశాలి వరి పంట ప్రధానంగా కేరళలో వర్షాధార వ్యవసాయంలో సాగవుతోంది. సేంద్రియ పద్ధతుల్లో, పర్యావరణహిత పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జూన్/జూలై నుండి నవంబర్/డిసెంబర్ వరకు ‘శాలి’ సీజన్లో పండిస్తారు. దాదాపు 110 రోజుల పంట. జాగ్రత్తగా నీటి నిర్వహణ అవసరం. అయితే, అననుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని దిగుబడి నిస్తుంది. సారవంతమైన ఎర్ర ఒండ్రు నేలల్లో రక్తశాలి వరి బాగా పెరుగుతుంది. తగినంత వర్షపాతంతో కూడిన ఉష్ణమండల తేమ వాతావరణం దీనికి అనువైనది. అధిక నాణ్యత గల స్థానికంగా సాగయ్యే రక్తశాలి విత్తనాలను ఎంచుకుంటే మంచి దిగుబడి రావటంతో పాటు తెగుళ్ళు, పురుగుల బెడద ఉండదు. ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయిఔషధ విలువలు, పోషకాల కారణంగా రక్తశాలి బియ్యానికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, దీని సాగు విస్తృతం కాక΄ోవటానికి అనేక సవాళ్లు ఆటకంగా ఉన్నాయి. రక్తశాలి సాగు, వినియోగం పెరగడానికి ఎదురవుతున్న సవాళ్లు... ఈ సవాళ్లలో నాణ్యమైన విత్తనాల లభ్యత ఒకటి. విత్తన బ్యాంకులు లేదా కమ్యూనిటీ విత్తన నిధుల ఏర్పాటు ద్వారా రక్తశాలి వంటి అపురూప దేశీ విత్తనాల లభ్యతను పెంచవచ్చు. ఖర్చులు తగ్గించడానికి, నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రైతుల విత్తన సహకార సంఘాలను ప్రోత్సహించాలి. రక్తశాలి దిగుబడి ఇతర రకాలతో పోల్చితే తక్కువ. ఈ కారణంగా, సేంద్రియ వ్యవసాయంలో అధిక శ్రమ వల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి పోషక, ఔషధ గుణాలు పోకుండా చూసుకుంటూనే దిగుబడి పెంచేందుకు పరిశోధనలు చేపట్టాలి. సేంద్రియ బియ్యం నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్థానిక రైతులతో బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఎక్కువ మంది రైతులు రక్తశాలి బియ్యాన్ని సాగు చేసి విక్రయించేలా ప్రోత్సాహకాలు లేదా సబ్సిడీలను అందించాలి. కొత్త సాగుదారులకు ఉత్తమ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. పంట ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ పనులను సహకార సంఘాలు లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం లేదా అనుసంధానించడం ద్వారా సాగును విస్తరింపచేయవచ్చు. రక్తశాలి బియ్యంతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు సాధారణ ప్రజలకు బాగా తెలియక΄ోవటం లేదా అర్థం చేసుకోకపోవటం వల్ల వినియోగం తక్కువగా ఉంది. సోషల్ మీడియా, స్థానిక ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణులను ఉపయోగించి ఔషధ పోషక ప్రయోజనాలను హైలైట్ చేస్తూ అవగాహన ప్రచారం ప్రారంభించడం అవసరం. వర్క్‌షాప్‌లు, సెమినార్లు లేదా స్థానిక సంతలు నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి.స్థానిక వంటకాల్లో రక్తశాలి బియ్యాన్ని వాడేలా ప్రోత్సహించేలా వంటల ఉత్సవాలు నిర్వహించాలి. ఈ బియ్యంతో తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించే ఆహార ఉత్సవాలను నిర్వహించాలి. మార్కెటింగ్ గొలుసులను, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను అన్వేషించడం ద్వారా మార్కెటింగ్‌ను మెరుగుపరచవచ్చు. రక్తశాలి బియ్యానికి సేంద్రియ ధృవీకరణ కల్పిస్తే సాగుదారులు ప్రీమియం మార్కెట్లలో అధిక ధర పొందేందుకు సహాయపడుతుంది.మరో విశేషం ఏమిటంటే...ఇది కండగల ఎర్ర నేలల్లో వర్షాధారంగా, సేంద్రియంగా సాగుకు అనువైనది. అయితే, దిగుబడి తక్కువ. కేవలం మహిళల ఆరోగ్యంకోసమైనా దీన్ని తిరిగి మన పంట పొలాల్లోకి, మన వంటిళ్లలోకి, పళ్లాలోకి తెచ్చుకోవటం అత్యవసరం. దిగుబడి పెంచే పరిశోధనలు చేపట్టాలి. అయితే, ఔషధ గుణాలు ΄ోకుండా చూడాలి. రక్తశాలి సాగును ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ పథకాల ద్వారా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా నేరుగా దేశంలో మహిళలందరికీ అందేలా చెయ్యాలి!చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో ఇన్ని వేలు పెరిగిదా? కొందామా? వద్దా?ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!విటమిన్లు: మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు (బి విటమిన్లు వంటివి), ఖనిజాలు (ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటివి) రక్తశాలి బియ్యంలో ఉన్నాయి.అధిక ఫైబర్: రక్తశాలి బియ్యంలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. కడుపు నిండిన భావనను కలిగించటం ద్వారా శరీర బరువు నిర్వహణలో సహాయపడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు: అధిక సాంద్రతలో ఎరుపు రంగు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.తక్కువ గ్లైసెమిక్ సూక: ఇది తెల్ల బియ్యం కంటే తక్కువ గ్లైసెమిక్ సూకను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.గుండె ఆరోగ్యం: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.గ్లూటెన్–ఫ్రీ: గ్లూటెన్ అసహనం లేదా సెలియాక్ వ్యాధి ఉన్న వ్యక్తులకు ఇది ఒక గొప్ప వరం. సురక్షితమైన, పోషకాలతో కూడిన బియ్యం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వృద్ధాప్యపు ఛాయలు కనపడకుండా సహాయపడతాయి.రోగనిరోధక శక్తి: రక్తశాలి బియ్యంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి.రక్త వృద్ధి: రక్తశాలి బియ్యం రక్త వృద్ధిని మెరుగుపరుస్తుంది. రక్తహీనత ఉన్న మహిళలకు వరప్రసాదం వంటిది. రక్తం స్థాయిని స్థిరీకరించడానికి లేదా నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది. రక్తశాలి బియ్యం రక్తంలో చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ముగింపురక్తశాలి అనేది స్వదేశీ వరి రకం. ఔషధగుణాలు, పోషకాంశాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఇప్పటికీ సాధారణ ప్రజలకు అంతగా తెలియదు. అందువల్ల ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేయాలి. రైతులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు ఉమ్మడిగా పనిచేసి దీన్ని మళ్లీ వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.రక్తశాలి అద్భుతమైన అధిక పోషక, ఔషధ గుణాలున్న పురాతన వరి వంగడం. పేరుకు తగ్గట్టే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది రక్తశాలి బియ్యపు గింజ. అంతేకాదు, రక్తహీనతను పారదోలటంతో పాటు రక్తం తగ్గి΄పోకుండా స్థిరీకరించగలిగిన అద్భుత గుణం రక్తశాలి సొంతం. రక్తహీనతకు గురయ్యే మహిళలకు ఇది చక్కటి ఆరోగ్యవంతమైన పరిష్కారం. ముడి రక్తశాలి బియ్యం తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. చాలా రకాల వరి బియ్యంలో ఉన్నట్లు ఇందులో గ్లుటెన్ లేదు. గ్లుటెన్ ఇన్టాలరెన్స్ / సెలియక్ వంటి ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది వరం. -
అరవై రోజుల అద్భుతం 'నవార'!
నవార.. కేరళకు చెందిన ఓ అపురూపమైన పాత పంట. 2 వేల ఏళ్ల క్రితం నుంచే సాగులో ఉన్న అద్భుతమైన ఔషధ విలువలున్న ధాన్యపు పంట. ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న విశిష్ట వంగడం నవార (Navara). ఆహారంగా, ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లనే ఇది ఔషధ పంటగా అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందింది. 60 రోజుల పంటదక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా కేరళ, పురాతన వ్యవసాయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది నవార. ఇది స్వల్పకాలిక పంట. విత్తిన 60 రోజుల్లోనే ధాన్యం చేతికొస్తుంది. అందుకే దీనికి ‘షస్తిక శాలి’ అనే పేరు వచ్చింది. నవార బియ్యం (Navara Rice) ఎరుపు + నలుపు రంగుల కలగలుపుతో విలక్షణంగా కనిపిస్తుంది. చర్మం, ఎముకలు, కండరాలు, జీర్ణకోశం ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందని కేరళలోని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.జిఐ గుర్తింపు జన్యుపరంగా విశిష్ట గుణాలు కలిగి ఉన్నందున 2008లో నవార వంగడానికి కేంద్ర ప్రభుత్వం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపునిచ్చింది. ఈ గుర్తింపు పొందిన నవార వంగడాలు రెండు. నలుపు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం ఒకటి. లేత బంగారు రంగు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం రెండోది. కేరళలోని కరుకమనికళంలో గల నవార రైస్ ఫార్మర్స్ సొసైటీ ఈ రెండు వంగడాలకు జిఐ గుర్తింపును పొందింది. ఈ రెండు రకాల నవార బియ్యానికి సహజమైన తీపి రుచి ఉంటుంది. సులువుగా జీర్ణమవుతాయి. అందువల్ల అన్ని వయసుల వారూ తినటానికి అనువుగా ఉంటాయి. సాధారణంగా నవార బియ్యాన్ని పిండి పట్టించి పాలలో కలుపుకొని తాగుతారు. దీనికి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆథ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. ఆలయ క్రతువుల్లోనూ వాడుతారు.9.5% మాంసకృత్తులు.. నవార బియ్యం పోషకాల గని. 73% పిండి పదార్థం, 9.5% మాంసకృత్తులు, 2.5% కొవ్వు, 389 కేలరీల శక్తి ఉంటాయి. అంతేకాదు, చక్కని పీచు పదార్థానికి, యాంటీఆక్సిడెంట్ల తోపాటు జింక్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలకు నిలయం. ఈ పోషకాలు కలిగి ఉన్నందునే ఆరోగ్యప్రదాయినిగా ప్రఖ్యాతి పొందింది.ఆయుర్వేదంలో నవారఆయుర్వేద పంచకర్మ చికిత్సల్లో నవార బియ్యానికి అత్యంత అధిక ప్రాధాన్యం ఉంది. రక్తప్రసరణ, శ్వాసకోశ, జీర్ణవ్యవస్థలను మెరుగుపరచటంలో నవార పాత్ర ఎంతో ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కీళ్లనొప్పులు, కండరాల క్షీణత, కొన్ని రకాల చర్మ సమస్యలకు చేసే ఆయుర్వేద చికిత్సల్లో ఈ బియ్యాన్ని వాడుతున్నారు. నవార బియ్యంతోపాటు తౌడు, నూక, ఊక, గడ్డిని కూడా ఔషధ విలువలతో కూడిన ఆహారోత్పత్తుల తయారీలో పరిశ్రమదారులు ఉపయోగిస్తున్నారు. నవార తౌడు, ఊకలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.నవార సాగులో సవాళ్లునవార వంటి పాత పంటల సాగులో సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే కేరళలో రైతులు అనుసరిస్తున్నారు. ప్రకృతి వనరులతో కూడిన ఎరువులు, కషాయాలు వాడుతూ వ్యవసాయం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చూస్తున్నారు. పొలాల్లో పర్యావరణ సమతుల్యానికి మిత్ర పురుగుల పాత్ర కీలకం.వాటిని రక్షించుకోవటం కోసం కషాయాలను మాత్రమే వాడుతున్నారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, పశువుల పేడ, పంచగవ్యలను రసాయనిక ఎరువులకు బదులు వాడుతున్నారు. బలమైన గాలులు, భారీ వర్షాలను నవార వరి పంట అంతగా తట్టుకోలేదు, పడిపోయే గుణం ఉంది. తీవ్రమైన మంచుతో కూడా ఇబ్బంది పడే సున్నితమైన పంట ఇది. చలిని తట్టుకోలేదు. కాండం అడుగునే వంగి పడి΄ోతుంది. కాబట్టి శీతాకాలంలో దీన్ని సాగు చేయకూడదు. ఈ కారణాల వల్ల నవార పంటకాలం 60 రోజులే అయినప్పటికీ ఏడాదికి కేవలం ఒకే పంట సాగు అవుతోంది. నవార వరి పంటను మనుషులతోనే కోయించాలి. కూలీల కొరతతో ΄ాటు అధిక ఖర్చుతో కూడిన పని కావటం వల్ల రైతులకు ఇది కూడా పెద్ద సమస్యే అవుతోంది.నిజంగా బంగారమే!నవార ధాన్యం దిగుబడి కూడా ఎకరానికి 300 కిలోలు మాత్రమే. ఇతర వరి రకాలతో ΄ోల్చితే చాలా తక్కువ. అయినా, దీనికి ఉన్న ప్రత్యేక ఔషధ గుణాల కోసం ఎక్కువ ధర పెట్టి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ధర అధికంగా ఉన్నప్పటికీ నవార బియ్యానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. రైతులకూ మంచి ఆదాయాన్ని సమకూర్చుతోంది. నవారకున్న అరుదైన ఔషధగుణాల వల్ల ‘బంగారం’ అని కూడా పేరొచ్చింది. నవార బియ్యాన్ని మీ కుటుంబం ఆహారంగా తీసుకుంటే ఎన్నెన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయి. 2 వేల సంవత్సరాల ఘన చరిత్ర గల అద్భుత వంగడాన్ని పరిరక్షించుకున్నట్లు కూడా అవుతుంది. షుగర్ నియంత్రణ...నవార బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ తెల్ల బియ్యంతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అంటే.. గ్లూకోజ్‌ను రక్తంలోకి తెల్ల బియ్యం మాదిరిగా ఒకేసారి కాకుండా నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది అనువైన మూలాహారం అయ్యింది. ఇందులోని పీచు వల్ల ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తుంది. ఎముక పుష్టి... కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలతో కూడి ఉంటుంది కాబట్టి నవార బియ్యం తిన్న వారికి ఎముక పుష్టి కలుగుతుంది. రెగ్యులర్‌గా తినే వారికి ఎముకలు గుల్లబారటం వంటి సమస్య రాదు. బ్లడ్ క్లాట్ కావటం, మజిల్ కంట్రాక్షన్ వంటి సమస్యలను అధిగమించడానికీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.చర్మ సౌందర్యం... యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నవార ఆహారం దోహదం చేస్తుంది. ముడతలను పోగొట్టడానికి, చర్మంలో మెరుపును పెంపొందించటానికి దోహదం చేస్తుంది. నవార బియ్యపు పిండిని పాలలో లేదా నీటిలో కలిపి ముఖవర్చస్సు మెరుగవడానికి, మచ్చలు పోవటానికి లేపనంగా వాడుతూ ఉంటారు. నవార బియ్యంలోని మెగ్నీషియం కండరాలను, నరాలను ఆరోగ్యవంతంగా ఉంచటానికి.. మొత్తంగా నాడీ వ్యవస్థను, కండరాల వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉండటానికి ఉపయోడపడుతుంది.గుండెకు మేలు... నవార బియ్యంలోని అధిక పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తనాళాల్లో పూడికను నివారించడానికి తద్వారా గుండెపోటు ముప్పును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సీ ఉండటం వల్ల కణజాలానికి మరమ్మతు చేస్తే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి దోహదపడటం ద్వారా నవార రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ... ఇందులోని అధిక పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్టలోని సూక్ష్మజీవరాశిని పెంపొందించడం ద్వారా జీర్ణశక్తిని పెంపొందించి, పోషకాల మెరుగైన శోషణకు, మొత్తంగా జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు దోహదం చేస్తుంది.శిశు ఆహారం... కేరళలో నవార బియ్యాన్ని శిశువులకు ఆహారంగా పెడుతుంటారు. నవార పిండి, అరటి పండు ఒరుగులతో కలిపి తయారు చేసే ‘అంగ్రి’ అనే వంటకాన్ని పిల్లలకు తినిపించటం కేరళవాసులకు అనాదిగా అలవాటు. డబ్బాల్లో అమ్మే ప్రాసెస్డ్ ఆహారం కన్నా ఇది పిల్లలకు చాలా సహజమైన, బలవర్ధకమైన ఆహారం. పిల్లలు తగినంత బరువు పెరగడానికి దోహదపడుతుంది.కేన్సర్ నిరోధకం... నవార బియ్యంలో ప్రోయాంథోశ్యానిడిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయ. డిఎన్ఎకి నష్టం కలగకుండా నివారించడటం, హానికారక ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యం చేయటం ద్వారా కేన్సర్ ముప్పును తగ్గించడానికి నవార బియ్యం ఉపకరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.చదవండి: ఈ ఆపిల్ ఎక్కడైనా కాస్తుంది!రక్తహీనతకు చెక్... నవార బియ్యంలో పుష్కలంగా ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను నివారించగలదు. నిస్సత్తువ, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలను రూపుమాపగలదు. గర్భవతులకు ఈ బియ్యం ఉపయుక్తమైనవి. పీచు, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి సూక్ష్మపోషకాలు గర్భవతుల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. గర్భవతులు సాధారణంగా ఎదుర్కొనే మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించటంతో పాటు గర్భస్థ శిశువు పెరుగుదలకు చాలా ఉపయోగకరం.నవార నారాయణన్!కేరళ సంప్రదాయ ఆహారంలోనే కాదు ఆయుర్వేద వైద్యంలోనూ కీలక ΄పాత్ర పోషిస్తున్న నవార సాగుకు పాల్ఘాట్ ప్రాంతంలో 2 వేల ఏళ్ల చరిత్ర ఉన్నా గత 50 ఏళ్లుగా దీనికి సాగు తగ్గిపోయి, అంతరించిపోయే దశకు చేరింది. అక్కడక్కడా రైతులు సాగు చేస్తున్నారు. అయితే, ఒకే ఒక్క కుటుంబం మాత్రం నవారను గత 115 ఏళ్లుగా విడవ కుండా తమ 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో నిరంతరాయంగా సాగు చేస్తూనే ఉంది. అద్భుత వ్యవసాయ, సాంస్కృతిక వారసత్వ సంపద అయిన నవారను ఈ కుటుంబం కాపాడుకుంటోంది. ఈ కుటుంబానికి చెందిన మూడో తరం రైతు పి. నారాయణన్ ఉన్ని ఇప్పుడు దీన్ని సాగు చేస్తున్నారు. నవార ఎకో ఫార్మ్ అని ఈయన క్షేత్రానికి పేరు పెట్టారు. ‘నవార నారాయణన్’గా ఆయన పేరుగాంచారు. ఆయన కృషి దేశ విదేశాల్లో మారుమోగుతూ ఉంటుంది. పరిరక్షించటంతో పాటు నవార ఫార్మర్స్ సొసైటీ పేరిట నవారకు జిఐ గుర్తింపు తేవటంలోనూ నారాయణన్ విశేష కృషి చేశారు. నవార ఉత్పత్తులను ఆయన సేంద్రియంగా పండిస్తూ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. (చదవండి: చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ప్యాక్‌లు..!)న్యూఢిల్లీలోని కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ)కి చెందిన ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టాస్) నవారపై ప్రత్యేక గ్రంథాన్ని ప్రచురించింది. నారాయణన్ ఏర్పాటు చేసిన సొసైటీ ఆధ్వర్యంలో 2011లో నవార ఉత్సవ్‌ను నిర్వహించారు. నవార పునరుజ్జీవనానికి కృషి చేసిన నారాయణన్‌కు ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్అథారిటీ (పిపివి అండ్ ఎఫ్ఆర్ఎ) ప్రతిష్టాత్మకమైన ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ రికగ్నిషన్ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. ఎకరానికి 3 క్వింటాళ్ల నవార ధాన్యాన్ని ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండిస్తున్నారు. మిల్లు పట్టిస్తే 180 కిలోల బియ్యం వస్తున్నాయి. బియ్యంతో పాటు అటుకులు, పిండిని తయారు చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది ‘టాస్’ ప్రచురించిన వివరాల ప్రకారం నారాయణన్ ఎకరానికి రూ. 1 లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్’.. ఎర్ర బియ్యం తినడం వల్ల..
Sagubadi- Red Rice Health Benefits: అధిక పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశవాళీ వరి రకాల బియ్యానికి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సంప్రదాయ బ్రీడింగ్ పద్ధతుల్లోనే దేశవాళీ వంగడాల్లో పౌష్టికాంశాలతో కూడిన బీపీటీ సన్న వరి రకాల రూపకల్పనపై బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు 2012 నుంచే దృష్టి కేంద్రీకరించారు. ‘బీపీటీ బ్లాక్ రైస్’ వంగడాలను గత ఏడాదే అధికారికంగా విడుదల చేసి, రైతులకు విత్తనాలను విస్తారంగా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బీపీటీ రెడ్ రైస్ 2858’ వంగడాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పంటకాలం 135 రోజులు. తుపాన్లకు పడి పోదు. దోమ, అగ్గితెగులు, ఆకు ముడత, ఆకు ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. కంకి ముద్దగా వస్తుంది. ఒక కంకిలో 500 నుంచి 600 వరకు గింజలు ఉంటాయి. బీపీటీ 5204 కన్నా సన్న రకం. బీపీటీ 2858 రెడ్ రకం వెయ్యి గింజల బరువు 12 గ్రాములు. నాణ్యతా ఎక్కువే. దేశవాళీ రెడ్ రైస్ దిగుబడి 10 బస్తాలకు మించదు. బీపీటీ రెడ్ రైస్ ఎకరాకు 30 బస్తాలకు తగ్గదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ రకం రెడ్ రైస్ ధాన్యంపై పొట్టు మామూలుగానే ఉంటుంది. కానీ, బియ్యం నల్లగా ఉంటాయి. బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్’ అనే పదార్ధం ఉండడం వల్ల వాటికి ఎర్ర రంగు వచ్చింది. అందుకని, ముడి బియ్యాన్నే తినాలి. పోషకాలు పుష్కలం ►ఇందులో ఐరన్, జింకు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే రెండు రెట్లు అధికం. ►యాంటీ ఆక్సిడెంట్లు మూడు నుంచి నాలుగు రెట్లు అధికం. ►అధికంగా 10.5 శాతం మాంసకృత్తులు ఉన్నాయి. ►టోటల్ ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్ సాధారణ రకాలతో పోలిస్తే రెండు రెట్లు అధికం. ►శరీరంలో ఉత్పత్తయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఇవి సమతుల్యం చేసి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. ►రెడ్ రైస్‌లో బీపీటీ 2858తో పాటు బీపీటీ 3143, 3182, 3140, 3111, 3507 రకాలను సైతం రూపొందిస్తుండటం విశేషం. ఎర్ర బియ్యం ఎంతో ఆరోగ్యం బీపీటీ 2858 రెడ్‌రైస్ విత్తన మినీకిట్లను ఈ ఏడాది జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వ్యవసాయశాఖ జేడీఏలు, డాట్ సెంటర్లలో పంపిణీ చేస్తారు. మూడు సంవత్సరాల మినీకిట్ దశను వచ్చే ఏడాది పూర్తిచేసి, ఆ తరువాత అధికారికంగా విడుదల చేస్తాం. బీపీటీ 2858 రెడ్‌రైస్ దీర్ఘకాలిక రోగాలను ఎదుర్కొనే పుష్టిని కలిగిస్తుంది. మనుషుల ఆరోగ్య రక్షణకు అత్యంత అనుకూలమైన రకం. – బి.కృష్ణవేణి, సీనియర్ శాస్త్రవేత్త – అధిపతి, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, బాపట్ల – బిజివేముల రమణారెడ్డి, సాక్షి ప్రతినిధి, బాపట్ల