గుంటూరులో కలకలం
కాలేజీ విద్యార్థిని అపహరణకు యత్నం
గుంటూరు రూరల్: కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిని అపహరించేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం గుంటూరు నగర శివారులో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. నగరంలోని సంగడిగుంట రెడ్లబజారుకు చెందిన విద్యార్థిని చేబ్రోలు మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అదే కాలేజీలో పెదనందిపాడు మండలం కట్ర పాడుకు చెందిన మద్దినేని లోకేశ్చౌదరి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
శనివారం ఆ విద్యార్థిని కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా.. లోకేశ్చౌదరి ఆమెను బెదిరించి బైక్పై ఎక్కించుకుని చేబ్రోలు వైపు తీసుకెళ్లాడు. నారా కోడూరు సమీపంలోకి వెళ్లేసరికి ఆ విద్యార్థిని బైక్పై నుంచి కిందకు దూకేసింది. స్థానికులు గమనించడంతో లోకేశ్ అక్కడ్నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థినిని గ్రామస్తులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆదివారం నల్లపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసేందుకు వస్తే టీడీపీ నాయకులు దాడి చేశారు..
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమపై లోకేష్ చౌదరి బంధువులు, కట్రపాడు టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారిపై ఫిర్యాదు చేస్తే ఎలా తీసుకుంటారంటూ పోలీ సులను సైతం బెదిరించారని వారు ఆరోపించారు. కాగా, బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అమీర్ తెలిపారు.