'తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం'
మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నదీ జలాలను కూడా జలమార్గాలుగా ఉపయోగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రమాదాలు భారత దేశంలోనే జరుగుతున్నాయని, వీటిని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు గడ్కరీ తెలిపారు.
రోడ్డు, రవాణా శాఖలో అవినీతిని అరికట్టేందుకున ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకు రానున్నట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్టులు నిర్మించడం వల్లే అభివృద్ధి సాధ్యమని, భూ సేకరన చట్టాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూడటం తగదన్నారు. చెరుకుపై రవాణా పన్ను మినహాయించేందుకు ఆలోచన చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.