Reform Bills
-
న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం
జెరూసలేం: వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం తుది ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌ను ప్రతిపక్షం బహిష్కరించింది. బిల్లుకు అనుకూలంగా 64 ఓట్లు లభించగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లుపై ఏకంగా 30 గంటలపాటు పార్లమెంట్లో చర్చ జరిగింది. ఒకవైపు చర్చ జరుగుతుండగానే, మరోవైపు దేశవ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. జనం వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో మార్పులు తలపెట్టడాన్ని అమెరికాతోపాటు పశి్చమ దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. న్యాయ వ్యవస్థను సంస్కరిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను కోర్టులు అడ్డుకోరాదు. అంటే న్యాయ వ్యవస్థపై ప్రభుత్వానిదే పైచేయి అవుతుంది. -
అన్నదాతలే వెన్నెముక
న్యూఢిల్లీ: 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాన మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయం సమృద్ధ భారత్‌కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని కొనియాడారు. ఆదివారం మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులపై ఒక వర్గం రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండగా ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. అదే సమయంలో ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. మహాత్మాగాంధీ ఆర్థిక సిద్ధాంతాలను కాంగ్రెస్ పాటించి ఉంటే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్ భారత్’ యోజన అవసరం ఉండేదే కాదన్నారు. దేశం ఎప్పుడో స్వయం సమృద్ధం సాధించి ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతు సంఘా లతో ముచ్చటించారు. 2014లో చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)చట్టంతో లాభం పొందిన హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతుల అనుభవాలను వివరించారు. ఉత్పత్తులను విక్రయించే సమయంలో వీరికి దళారుల బెడద తప్పిందని, మెరుగైన ధర లభించిం దని పేర్కొన్నారు. ఇప్పుడు వరి, గోధుమ, చెరకు రైతులకు కూడా ఇదే స్వేచ్ఛ లభించనుందని, వారు మంచి ధర పొందనున్నారని అన్నారు. కథలు చెప్పడం మన సంస్కృతిలో భాగమంటూ ఆయన.. సైన్స్‌కు సంబంధిం చిన కథలు ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ‘బెంగళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ’ సభ్యులతో ముచ్చటించారు. వారితో తెనాలి రామకృష్ణుడి కథ ఒకటి చెప్పించారు. ప్రజలంతా కూడా పిల్లలకు కథలు చెప్పేందుకు కొంత సమయం కేటాయించాలని కోరారు. మాలి దేశానికి చెందిన సేదు దెంబేలే గురించి ప్రధాని తెలిపారు. ఆయనకు భారత్‌పై ఉన్న అభిమానాన్ని వివరించారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. ► కథలు ప్రజల సృజనాత్మకతను ప్రకటిస్తాయి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు. నా పర్యటనల్లో నేను పిల్లలతో మాట్లాడేవాడిని. వారిని కథలు చెప్పమని అడిగేవాడిని. కానీ వారు జోక్స్ చెబుతామని, మాకు జోక్స్ చెప్పండని అడగేవారు. నేను ఆశర్యపోయేవాడిని. వారికి కథలతో పరిచయం ఉండటం లేదు. గతంలో ఇంట్లో పెద్దలు పిల్లలకు కథలు చెప్పేవారు. ఆ కథల్లో శాస్త్రం, సంప్రదాయం, సంస్కృతి, చరిత్ర ఉండేవి. కథల చరిత్ర మానవ నాగరికత అంత పురాతనమైంది. కథలు చెప్పే సంప్రదాయం అంతరించిపోకుండా ఇప్పటికీ కొందరు కృషి చేస్తున్నారు. ఐఐఎం(ఏ)లో ఎంబీఏ చేసిన అమర్వ్యాస్ వంటి కొందరు వెబ్‌సైట్స్‌ను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతికత సాయంతో ఆసక్తి ఉన్నవారికి పలు కథారీతులను పరిచయం చేస్తున్నారు. బెంగుళూరులో శ్రీధర్ అనే వ్యక్తి గాంధీజీ కథలను ప్రచారం చేస్తున్నారు. ► ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వం టి పెద్దలుంటే వారి వద్ద కథలను విని, రికార్డ్ చేసుకోండి. భవిష్యత్తులో ఉపయోగ పడ్తాయి. ► ఆధునిక వ్యవసాయ పద్దతులను ఉపయోగించడం వల్ల వ్యయం తగ్గుతుంది. దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. రైతులు మార్కెట్ అవసరాలకనుగుణంగా పంటలు వేయాలి. ► సెప్టెంబర్ 28 షహీద్ భగత్ సింగ్ జయంతి. బ్రిటిష్ వారిని గడగడలాడించిన సాహస దేశభక్తుడు భగత్ సింగ్. లాలా లాజ్‌పత్ రాయ్ పట్ల ఆయనకున్న అంకితభావం, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి విప్లవకారులతో అనుబంధం చాలా గొప్పది. ఆయనకు నా వినమ్ర నివాళులు. భగత్‌సింగ్‌లా కావడం ఎలా? హైదరాబాద్ వ్యక్తికి మోదీ సమాధానం నమో యాప్‌లో ఒక ప్రశ్న చూశాను. ఈ తరం యువత భగత్‌సింగ్‌లా కావడం ఎలా? అని హైదరాబాద్‌కు చెందిన అజయ్ ఎస్జీ అడిగారు. మనం భగత్‌సింగ్ కాగలమో, లేదో తెలియదు కానీ, ఆయనకు దేశంపైన ఉన్న ప్రేమను, దేశ సేవ కోసం ఆయన పడే తపనను మనం పెంపొందించుకోవచ్చు. అదే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మన సైనికుల శక్తి సామర్థ్యాలను చూశాం. అప్పుడు ఆ వీర సైనికుల మనస్సులో ఒకటే ఉంది.. దేశ రక్షణ ఒకటే వారి లక్ష్యం. తమ ప్రాణాలకు వారు ఎలాంటి విలువనివ్వలేదు. పని ముగించుకుని, వారు విజయవంతంగా తిరిగిరావడం మనం చూశాం. దేశ మాత గౌరవాన్ని వారు మరింత పెంచారు. -
రైతుల పాలిట రక్షణ కవచాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు చరిత్రాత్మకం అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. అవి రైతు వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం, కేంద్రంలో బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కి చెందిన మంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని ఆ బిల్లుల్ని గట్టిగా సమర్థించారు. రైతులు, వినియోగదారుల మధ్య దళారీ వ్యవస్థ నుంచి కాపాడే రక్షణ కవచాలని వ్యాఖ్యానించారు. బిహార్‌లో పలు రైల్వే ప్రాజెక్టుల్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని తన ప్రసంగంలో ఈ బిల్లుల గురించే ఎక్కువగా మాట్లాడారు. రైతులకు స్వేచ్ఛ కల్పించడం కోసం రక్షణగా ఆ బిల్లుల్ని తీసుకువస్తే విపక్షాలు దళారులకు కొమ్ము కాస్తూ రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లులు అత్యంత అవసరం 21వ శతాబ్దంలో ఈ బిల్లుల అవసరం చాలా ఉందన్నారు. రైతుల్ని సంకెళ్లలో బంధించకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే అవకాశం వస్తుందని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఇక వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయదని, కనీస మద్దతు ధర ఇవ్వదని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) చట్ట సవరణల్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇవే అంశాలను ఉంచిందని మోదీ ధ్వజమెత్తారు. దళారులకు ఎవరు కొమ్ము కాస్తున్నారో, తమకు అండగా ఎవరున్నారో అన్నదాతలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుందని, కనీస మద్దతు ధర ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఎంఎస్పీని తొలగించే కుట్ర: కాంగ్రెస్ తాజాగా తీసుకువచ్చిన మూడు బిల్లుల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించే విధానాన్ని తొలగించే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రైతులను పాండవులతో, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కౌరవులతో పోలుస్తూ.. ఈ ధర్మ యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఇతర రాజకీయ పార్టీలను కోరింది. రైతుల కోసం పార్లమెంటు వెలుపల, లోపల పోరాడుతామని స్పష్టం చేసింది. మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై రైతులు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రైతుల పొట్టగొట్టి, తన స్నేహితులకు లాభం చేకూర్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శుక్రవారం ట్వీట్ చేశారు. పార్లమెంటు తాజాగా ఆమోదించిన వ్యవసాయ బిల్లులు కనీస మద్దతు ధర విధానాన్ని నాశనం చేస్తాయని మరో సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. -
‘మార్పు’ను పరిశ్రమలే గుర్తిస్తాయి
* మోదీ సర్కారుపై విమర్శలను తోసిపుచ్చిన నిర్మలా సీతారామన్ * కీలక సంస్కరణ బిల్లులపై విపక్షాలు సహకరించాలని వినతి న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారు వచ్చాక ఆర్థికపరంగా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. త్వరలోనే పారిశ్రామిక వర్గాలు ఈ మార్పుల గురించి చెప్పడం మొదలుపెడతాయని భావిస్తున్నట్లు శుక్రవారమిక్కడ ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు తొమ్మిది నెలల పాలనలో పరిశ్రమకు చెప్పుకోదగ్గ సానుకూల మార్పులేవీ కనబడటం లేదని, ఇంకా నిరాశావాదం, అసంతృప్తి రాజ్యమేలుతోందని ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్ విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం మరీ వేగంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని కూడా కార్పొరేట్లు జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే ఈ విమర్శలంటూ పరేఖ్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తీవ్రంగా స్పందించడం విదితమే. మరోపక్క, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అయితే మరో అడుగు ముందుకేసి.. పరేఖ్ వ్యాఖ్యల వెనుక వ్యక్తిగత కారణాలేవైనా ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాగా, యూపీఏ ప్రభుత్వ పాలనలోని విధానపరమైన జడత్వాన్ని కూడా పరేఖ్ అప్పట్లో తీవ్రంగా ఎండగట్టడం విశేషం. పదేళ్ల జాడ్యాన్ని పది నెలల్లో తొలగించలేం... పదేళ్ల పాటు యూపీఏ సర్కారు హయాంలో నెలకొన్న అలసత్వాన్ని అన్నిపక్షాల నుంచి సమిష్టి కృషి ఉంటేతప్ప, కేవలం పది నెలల్లో తొలగించడం సాధ్యం కాదని... పరేఖ్ పేరును ప్రస్తావించకుండా సీతారామన్ వ్యాఖ్యానించారు.