Registration of Assets
-
వేగంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల డిజిటలీకరణ
సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 150 ఏళ్ల నుంచి ఉన్న పాత రికార్డులను డిజిటలీకరణ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దస్తావేజులు, వాటికి సంబంధించి మొత్తం 15 కోట్ల పేజీలను స్కానింగ్ చేసి కంప్యూటరైజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 1850 నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థ అమల్లో ఉంది. 1999 వరకు రిజిస్టర్ అయిన ప్రతి డాక్యుమెంట్‌ను ఒక పెద్ద వాల్యూమ్‌లో (పుస్తకం) ఎత్తిరాసి ఒరిజినల్ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఇచ్చేవారు. అమ్మినవాళ్లు, కొన్నవాళ్ల వివరాలను ఇండెక్స్ పుస్తకాల్లో నమోదు చేసేవారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వాల్యూమ్, ఇండెక్స్ పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. మరోవైపు.. 1999 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరణ జరిగింది. దస్తావేజులను స్కాన్‌చేసి ఒరిజినల్స్‌ను వినియోగదారులకు ఇస్తున్నారు. శిథిలమైన 150 ఏళ్ల నాటి రికార్డులు ఇక అంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ల ఈసీ నకలు కాపీ కావాలని అడిగితే ఈ వాల్యూమ్‌లో వెతికి ఇస్తున్నారు. ఇది చాలా క్లిష్టతరంగా మారింది. 150 ఏళ్ల నాటి రికార్డు కావడంతో అవన్నీ పాతపడిపోయాయి. వాల్యూమ్‌లు పట్టుకుంటే పేజీలు చిరిగిపోతూ, చిల్లులు పడి, పొడిపొడి అయిపోతూ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటిని భద్రపరచడం కూడా చాలాకష్టంగా మారిపోయింది. భూముల విలువ పెరిగిన నేపథ్యంలో వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజులుపోతే వాటిని తీసి చూడడం కూడా సాధ్యంకాని పరిస్థితి. అన్నింటికీ మించి ఎవరైనా తమ పాత దస్తావేజు నకలు కావాలని అడిగితే దాన్ని గుర్తించే పరిస్థితి లేకుండాపోయింది. ఆ వాల్యూమ్ నెంబర్, పేజీ నెంబర్ చెబితే తప్ప వెతికి ఇచ్చే పరిస్థితిలేదు. ఐడీఎంఆర్ఎస్ విధానంలో డిజిటలీకరణ ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం బ్రిటీష్ కాలం నుంచి 1999 వరకు రిజిస్టర్ అయిన దస్తావేజులు, ఇతర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల డిజిటలీకరణ చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 269 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పని వేగంగా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు జోన్లుగా విభజించి డిజిటలీకరణ కోసం టెండర్లు పిలిచారు. రైటర్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు జోన్ల టెండర్లు దక్కించుకుని పని మొదలుపెట్టింది. ఇంటిగ్రేటెడ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ రికార్డ్ సిస్టమ్ (ఐడీఎంఆర్ఎస్) విధానంలో డిజిటలీకరణ చేస్తున్నారు. మొదట అన్ని కార్యాలయాల్లో పాత రికార్డులను స్కానింగ్ చేసి ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరిస్తున్నారు. ఆర్నెలల్లో మొత్తం రికార్డుల డిజిటలీకరణ పూర్తయ్యే అవకాశమున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. డిజిటలీకరణ తర్వాత వెంటనే ఈసీ నకలు ఇక డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ చెప్పగానే దానిని వెంటనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈసీ నకలును ప్రజలు సులభంగా పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే, విలువైన ఆస్తుల రికార్డులు భద్రంగా ఉంటాయి. ఈ పని వేగంగా జరుగుతోంది. – వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ -
12లోగా ఆస్తుల నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 12లోగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఏ ఒక్క ఆస్తిని వదిలిపెట్టవద్దని, ఆస్తుల నమోదు 100 శాతం పూర్తి అయినట్లు సంబంధిత వార్డు అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నవీకరించిన వ్యవసాయేతర ఆస్తుల ముసాయిదా జాబితాను వార్డు కమిటీ ముందు వుంచి 3 రోజుల పాటు అభ్యంతరాలు/ సలహాలు స్వీకరించా లని ప్రభుత్వం నిర్దేశించింది. అభ్యంతరాల ను పరిష్కరించిన అనంతరం తుది జాబితా ను ప్రకటించాలని ఆదేశించింది. ఆస్తుల న మోదుకు సంబంధించిన వివరాలను వార్డు అధికారుల నుంచి పురపాలికలు సేకరించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొస్తున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ఇంకా పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డులకు ఎక్కని ఆస్తుల నమోదును గడువులోగా పూర్తి చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్, వారసత్వ బదిలీ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు. అక్రమాలకు పాల్పడితే వేటే... ఆస్తుల నమోదు ప్రక్రియలో ఏవైనా అక్రమాలకు పాల్పడితే తెలంగాణ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 95 కింద కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్లను పురపాలక డైరెక్టర్ హెచ్చరించారు. విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే మున్సిపల్ ఉద్యోగు లు, అధికారులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసే అధికారాన్ని ఈ సెక్షన్ కల్పిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల కు మెరూన్‌రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆస్తుల నమోదు ప్రక్రియ అత్యం త కీలకంగా మారింది. కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్‌ను దసరా రోజున సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ధరణిలో క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్లైన్ ద్వారా పురపాలికలు/ గ్రామ పంచాయతీల్లోని ఆస్తి పన్నుల రికార్డుల్లో సైతం కొత్త యజమాని పేరును నమోదు చేసి తక్షణ మ్యుటేషన్ చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలకు ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. ఇందుకోసం ప్రతి ఆస్తికి సంబంధించిన యజమానికి వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా యజమాని పేరు, కులం, వయసు, లింగం, ఫోన్ నంబర్, గుర్తింపు రుజువు, ఫొటో, ఆస్తి వివరాలు, వినియోగం, విస్తీర్ణం, సర్వే నంబర్, ఆస్తి సంక్రమణ విధానం, విద్యుత్, కులాయి కనెక్షన్ నంబర్లు, కుటుంబీకుల వివరాలు, చిరునామా తదితర వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటి యజమానులందరూ ఇకపై పన్ను చెల్లింపు పరిధిలోకి రానున్నారు. -
ఆధార్ ఉంటేనే ఆస్తుల రిజిస్ట్రేషన్
వచ్చే నెల నుంచి అమల్లోకి! సాక్షి, హైదరాబాద్: భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఇక నుంచి ‘ఆధార్’తప్పనిసరి కానుంది. క్రయ, విక్రయ లావాదేవీలకు గాను ఇరు పార్టీలూ ఆధార్ వివరాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధన త్వరలో అమల్లోకి రానుంది. దీనిపై రిజిస్ట్రే షన్ల శాఖ ఇంతకుముందే అంతర్గత సర్క్యు లర్ జారీ చేసినా.. ఆచరణలోకి రాలేదు. ఇటీవల భారీగా రిజిస్ట్రేషన్ అక్రమాలు బయటపడిన నేపథ్యంలో ‘ఆధార్’లింకును తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. రెండు మూడు వారాల్లో ఈ నిబంధనను అధికారికంగా అమల్లోకి తెస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొంత జాప్యం జరిగినా ఆగస్టు నుంచి కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పారదర్శకత కోసమే.. ప్రస్తుతానికి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వ్యక్తిగత ధ్రువీకరణతో సరిపెడు తున్నారు. క్రయ, విక్రయాలు జరిపే ఇరు పార్టీల ధ్రువీకరణ కార్డులతో పాటు ఇద్దరు సాక్షులు సంతకాలు చేస్తే రిజిస్ట్రేషన్ జరుగుతోంది. కానీ ఆధార్ నిబంధన అమ ల్లోకి వస్తే ఇరు పార్టీలు కచ్చితంగా తమ ఆధార్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వారి వేలిముద్రలు కూడా తీసుకుంటారు. సాక్షుల ఆధార్ వివరాలు కూడా తీసుకోవా లని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు యోచిస్తు న్నారు. తద్వారా సంబంధిత లావాదేవీ పూర్తి పారదర్శకతతో జరుగుతుందని, ఏదైనా అక్రమం జరిగినా కచ్చితంగా తేలు తుందనే భావిస్తున్నారు. సాక్షుల ఆధార్ విషయంగా ఇంకా తుది నిర్ణయం తీసుకో లేదు. క్రయ, విక్రయదారుల్లో ఎవరికైనా ఒకవేళ ఆధార్ లేనిపక్షంలో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలనే నిబంధన విధిస్తున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అధికారులు చెబుతున్నారు. కోర్టు కూడా అడ్డుకోదేమో..! వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అమలు చేసే సంక్షేమ పథకాలకు మినహా ఇతరాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం ఏ మేరకు అమల్లోకి వస్తుందన్న దానిపై అస్పష్టత ఉంది. రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేస్తే.. కోర్టుపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అన్నదిశగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికా రులు ఆలోచన చేస్తున్నారు. అయితే పాన్‌కార్డును ఆధార్‌తో లింకు చేయడాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భూ అక్రమాల నియంత్రణ కోసం ఉపయోగపడే అవకాశం ఉన్నందున రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేయ డానికి న్యాయపరంగా ఇబ్బందులు రావని భావిస్తున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.